Search
  • Follow NativePlanet
Share
» »ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

పురాతనకాలం నాటి ఎన్నోఅద్భుతమైన కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయాయి.అయితే అప్పటికట్టడాలు వారి శిల్పకళానైపుణ్యం ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

By Venkatakarunasri

పురాతనకాలం నాటి ఎన్నోఅద్భుతమైన కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయాయి.అయితే అప్పటికట్టడాలు వారి శిల్పకళానైపుణ్యం ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఓరుగల్లు ప్రాంతం అంటే వరంగల్ జిల్లాలో కాకతీయులకళానైపుణ్యం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఆ కాలంలో కాకతీయులు ప్రతీదేవాలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.అయితే ఇంతకీ ఆ వనంలో బయటపడ్డ ఆ కట్టడాలేంటి?ఆ ప్రదేశం ఎక్కడుంది?అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వరంగల్ దుర్గంగా ప్రసిద్ధిచెందిన కాకతీయుల కోట వరంగల్ రైలుస్టేషనుకు 2 కి.మీ. దూరంలోనూ, హనుమకొండ నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. కోట శిలాతోరణ స్తంభాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో వాడుకలో ఉన్నాయి.

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు

ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసారు. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయం.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

కాకతీయ కీర్తితోరణాలు; స్వయంభూశివాలయం; ఏకశిల గుట్ట, గుండుచెరువు;, ఖుష్ మహల్ తదితర దర్శనీయ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసినది దీనిని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

రెండవ ప్రాకారములో ఉన్నది రాతి కోట గ్రానైటు రాళ్ళతో నిర్మితమైనది. రాతి కోటకు పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిల నిర్మితమైనవి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి (పూర్ణ కుంభం వంటివి). ఈ కీర్తి తోరణాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ఆధికారిక చిహ్నంగా ఉన్నాయి.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది. వరంగల్ జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఖిల్లా వరంగల్ అని పిలవబడే చారిత్రాత్మకప్రదేశం వుంది. అయితే ఖిల్లావరంగల్ లోని మట్టికోట వుత్తరవాయువ్యభాగంలోని కోటగర్భంలో కాకతీయుల కాలంనాటి ఆలయాలు లక్ష్మీకొండల గండిప్రాంతంలో వుంది త్రికుటాలయం.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

చారిత్రక అన్వేషణలో ఖిల్లావరంగల్ మట్టికోట లక్ష్మీకోటల గండివద్ద ఖిల్లావరంగల్ మట్టికోట లక్ష్మీ కొండల గండివద్ద భూగార్భంలోంచి సగం బయటపడింది ఒక త్రికుటాలయం మాత్రమే.మరొకటి పూర్తిగా కోటగోడలనే దాగివుంది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఈ రెండు త్రికుటాలయాలను పూర్తిస్థాయిలో తవ్వి బయటపెట్టలేదు.కాకతీయులకాలంలో నిర్మించిన ఇలాంటి చారిత్రకఆలయాలు కాల గర్భంలో కలిసిపోయే ప్రమాదంకలిగి వుంది.అయితే కొందరు ముఠాగా ఏర్పడి గుప్తనిధులకోసం ఆలయంతోపాటు పరిసరప్రాంతంలో భారీగా తవ్వకాలు జరిపారు.దీంతో ఆ ప్రాంతమంతా శిథిలావస్థకు చేరుకుంది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ప్రస్తుతం ఆలయం సమీపంలో శివలింగం పడివుండటం బట్టి చూస్తే అది ఆలయంలో వుండాల్సిన శివలింగమేనని స్పష్టమౌతుంది.పరిశోధనలో ఆలయం, శివలింగం బయటపడటంతో ఇంకా ఆ ప్రాంతంలోని భూమిపొరల్లో మరిన్ని అపురూపసుందర శిల్పకళవుండే అవకాశం వుంది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

చరిత్రకారుల అభిప్రాయంమేరకు నాటి ఓరుగల్లు కోట మొత్తం 7 కోటలతో,శ్రీరామారణ్యపాదుల ఆదేశానుసారం శ్రీచక్రం ఆకారంలో నిర్మించబడిందని ఈ ఏడుకోటల పరిధిలో దాదాపువందకుపై ఆలయాలు వుండేవని ఏకామ్రనాథుని,ప్రతాపరుద్రీయం ఆధారంగా చెప్తున్నారు.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

వారి అభిప్రాయంప్రకారం కాకతీయులు ముందుచూపుతోనే, ఈ విధంగా శ్రీచక్రమూలాలు వచ్చేవిధంగా నిర్మించారు. ఇలా నిర్మించటంవలనే భవిష్యత్తులో దండయాత్రలనుండి ఆలయాలను రక్షించేఅవకాశం కూడా వుందని వారు భావించివుంటారు. దానికి ఆధారంగా ఆలయంపై భాగంలో ఒక గోడలాగా నిర్మించి తేలికపాటి ఇటుకలనిర్మాణం మనకు నేటికీ కనిపిస్తోంది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

మట్టి కోట భూగర్భంలో ఇంకా పదులసంఖ్యలో ఆలయాలు వుండే అవకాశంకూడా వుంది. వాటిలో కేవలం 3ఆలయాల ఆనవాళ్ళుమాత్రమే బయటకి కనపడుతున్నాయి. వాటిని కావాలనే భూగర్భంలో నిర్మించివుంటారు అనటానికి ఎక్కువఅవకాశం వుంది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

కారణం ఈ ఆలయాలు అన్నీకూడా మట్టికోట ప్రవేశద్వారాల సమీపంలో వుండటం,ఆలయంపైన గోపురంలాంటి నిర్మాణం కాకుండా పొడవైన రాతిదిమ్మెలు పెద్దసైజు ఇటుకలతో గోడలాంటి నిర్మాణంచేసి ఆపైన మట్టి పోసి మట్టికోట నిర్మాణం చేసారు.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఈ ఆలయాలకు మరో ప్రత్యేకత కూడా వుంది.ఓరుగల్లు రాతి మరియు మట్టికోటల మధ్యలో సుమారు 17ఆలయాలు వున్నప్పటికీ వాటిలో ఏ ఆలయంలో లేనివిధంగా శిల్పాలు ఈ త్రికుటాలయంలో వున్నాయి.పద్మపుపట్టికలు, హంసపట్టికలు, రంగమంటపంలో స్థంభాలపై అందమైన శిల్పాలు చెక్కబడివున్నాయి.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

వాలివధ, గోపికలు, కృష్ణుడు, గజలక్ష్మి, నరసింహావతారం, వినాయకుడు,కోలాటదృశ్యం,ఇంకా మరెన్నో శిల్పాలున్నాయి.గర్భాలయద్వారంపై అందమైన చతుర్భుజులైన శైవద్వారపాలక, చామర గృహిణులైన పరిచారకజనాల శిల్పాలున్నాయి.ఇంకా 2 వ త్రికుటాలయం పూర్తిగా భూమిలోనే వుంది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

లోపలకు దిగిచూస్తే ఒక గర్భాలయాన్ని మాత్రమే చూట్టానికివీలుంది.కనిపించని విగ్రహం వీరభద్రునిది.కొంచెం చెక్కేసుంది. విగ్రహానికి ఇరువైపులా దేవతాగణాలు వుండటం విశేషం.ఈ మట్టికోట భూభాగంలో మరిన్ని కట్టడాలు బయటపడే అవకాశం వుందని అంటున్నారు.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు

స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం

ఓరుగల్లు కోటలోని మహత్తర కట్టడాలలో స్వయంభూదేవాలయం ఒకటి. క్రీ.శ. 1162లో గణపతిదేవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. భూభాగం నుంచి పుష్పాకారం, పైకప్పు నక్షత్ర ఆకారం పోలినట్లు రాతితో నిర్మించబడింది ఈ ఆలయం. గర్భగుడిలోని శివలింగం ఇతర దేవాలయాల్లోని శివలింగాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఖండములై పడివున్న చతుర్ముఖలింగము ఈ ఆలయములో మూలవిరాట్.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఇది భూమికి అతితక్కువ ఎత్తులో ఉండి పాణమట్టం గుడ్రంగా ఉంటుంది. దక్షణ ద్వారం వద్ద గల వీరభద్రస్వామి విగ్రహాం ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయంలో ఓ పక్క శ్రీ సీతారామలక్ష్మణ మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఏటా శివరాత్రి మహోత్సవం సందర్భంగా నగరం నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చి ప్రత్యేక పూజులు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం, అర్చనలు, కర్పూరహరతులు జరుగుతాయి. శ్రీ రామనవమి రోజు సీతారాముల కల్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుంది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఖుష్ మహల్

ఈ కట్టడం కాకతీయ తోరణాలకు అతి దగ్గరనే ఉంది. షితాబ్ ఖాన్ అనే రాజు క్రీ.శ. 1500 ప్రాంతంలో ఈ సౌధాన్ని కట్టించాడు. ఈ దర్బారు పొడవు సుమారు 90 అడుగులుండగా, వెడల్పు-ఎత్తులు వరుసగా 45, 30 అడుగులుంటాయి. దర్బారు పైకప్పును కొనదేలిన ఆర్చిలు మోస్తున్నట్లుగా ఉన్నాయి, ఆర్చిల మధ్యన కర్ర దూలాలున్నాయి.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

నిజానికి పైకప్పును మోస్తున్నది ఈ దూలాలే. పెద్ద పెద్ద ప్రమాణాల్లో కనిపిస్తున్న ఈ ఆర్చీలు కేవలం అందాన్ని అతిశయింపజేయడానికే. ఆర్చీల ముందు దర్వాజా లాంటి ఆర్చి, దానిపైన అందమైన అల్లికలతో కూడిన కిటికీలు దర్బార్ శోభను మరింత పెంచాయి. దర్బారులోకి ప్రవేశించే ప్రాంగణం మరింత అందమైంది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

నిజానికిది రెండంతస్తుల్లో ఉంది. ఇందులోని రెండు వరుసల్లో ఉన్న స్తంభాలు మూడు పొడవాటి హాల్‌లను ఏర్పరుస్తున్నాయి. ఈ కింద, పైనున్న గదులు రాచ కుటుంబీకులకు చల్లని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించబడ్డాయి. ఈ మహల్ గోడలు చాలా వెడల్పుండి బలిష్టమైనవి. అవి సుమారు 77 డిగ్రీల వాలుతో ఉండి వేలాడుతున్నట్లుగా కన్పిస్తాయి.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఎత్తైన ఈ భవనం పై భాగానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. కీర్తి తోరణాల మధ్య దొరికిన స్వయంభు దేవాలయ శిథిల శిల్పాలను సైతం ప్రస్తుతం ఈ ఖుష్ మహల్‌లో భద్రపరిచారు. దర్బారు మధ్యలో అందమైన నీటి కుండం ఉంది. ఇది ఆనాడు రాచవర్గ ప్రజలకు ఎంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేదో! కాబట్టే, ఈ మహల్‌కు ‘ఖుష్ మహల్' అని పేరొచ్చింది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

వరంగల్ వాతావరణం

ఉత్తమ సీజన్ఇంతకుముందు చెప్పిన అంశాలు దృష్టిలో ఉంచుకొని ఈ స్థల సందర్శానానికి ఉత్తమ సీజన్ అక్టోబర్ మరియు మార్చి మధ్య బాగుంటుంది. ఎండాకాలంలో ఎండ వేడినుండి తప్పించుకోవొచ్చు సందర్శానానికి వెళ్ళకుండా ఉంటె, చలికాలం,వానాకాలం రెండూ కూడా అనువైనవి. ఈద్ ఉల్ ఫితర్, దసరా మరియు దీపావళి వంటి పండుగలు కూడా ఈ సీజన్లో జరుపుకుంటారు, కాబట్టి ఈ సీజన్లో సందర్శిచటం బాగుంటుంది.

PC:youtube

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఎలా చేరాలి?

రోడ్ ద్వారా

రోడ్ ట్రాన్స్ పోర్ట్ పబ్లిక్ బస్ సర్వీసు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నగరాలన్నిటికి అనుసంధించబడింది.ఒక కి.మీ.కు రూ.4 చొప్పున చార్జ్ తీసుకుంటూ వరంగల్ నుండి హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నం వంటి నగరాలకు బస్సులు ఉన్నాయ్. వరంగల్ మరియు ఇతర నగరాల మధ్య ప్రైవేటు బస్ సర్వీసులు కూడా ఉన్నాయ్.

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

రైలు ద్వారా

వరంగల్ రైల్వే స్టేషన్ చాల ముఖ్యమైన స్టేషన్ మరియు దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాలన్నిటికి అనుసంధించబడింది. చెన్నై, బాంగుళూర్,ముంబై మరియు న్యూ ఢిల్లీ నుండి రైళ్ళు వరంగల్ గుండా వెళ్ళేప్పుడు వరంగల్ స్టేషన్లో ఆగుతాయి.

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

ఆ వనంలో బయటపడ్డ అద్భుత కట్టడాలు తెలిస్తే షాక్ అవుతారు?

విమానం ద్వారా

వరంగల్ దగ్గరగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. అది వరంగల్ నగరానికి 163కి.మీ. దూరంలో ఉన్నది మరియు దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాలన్నిటి కి అనుసంధించబడింది. హైదాబాద్ నుండి వరంగల్ కి టాక్సీలో అయితే సుమారుగా రూ.2500 అవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X