Search
  • Follow NativePlanet
Share
» » గత జన్మలో మీరు కూడా ఇక్కడ ‘కొనుగోలు’ చేసి ఉంటారు.

గత జన్మలో మీరు కూడా ఇక్కడ ‘కొనుగోలు’ చేసి ఉంటారు.

భారత దేశంలో అత్యంత ప్రాచీన మార్కెట్ల గురించి కథనం.

భారతదేశానికి అనేక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అదే సమయంలో ఇక్కడ పూర్వ జననం అనే విషయాన్ని నమ్మేవారు కూడా చాలా మంది ఉంటారు. అదే అలా గత జన్మ అనేది ఉందని కొద్దిసేపు మనం అనుకొందాం. అప్పుడు ఈ కింద పేర్కొన్న ఏదో ఒక ప్రాంతంలో మీరు జన్మించి ఉంటే ఏదో ఒక వస్తువును కొలుగోలు చేసి ఉంటారు.

ఎందుకంటే కింద పేర్కొన్న మార్కెట్లు అంత ప్రాచీనమైనవి. ఈ మార్కెట్లు అన్ని కొన్ని వందల ఏళ్ల నుంచి అస్థిత్వంలో ఉన్నాయి కాబట్టి. మరెందుకు ఆలస్యం చదివేయండి. ఒకవేళ మీకు ఆ మార్కెట్లతో గత జన్మలో సంబంధం ఉందేమో గుర్తుకు తెచ్చుకోండి. అన్నట్టు పర్యాకంలో భాగంగా మీరు ఆయా నగరాలకు వెళితే ఆ మార్కెట్లకు వెళ్లడం మిస్ చేసుకోకండి.

మీనా బజార్, ఢిల్లీ

మీనా బజార్, ఢిల్లీ

P.C: You Tube

ఢిల్లీలోని మీనా బజార్ భాతర దేశంలోని అత్యంత ప్రాచీన మార్కెట్ లలో ఒకటి. ఈ మార్కెట్ మొఘలుల కాలం నుంచి అస్తిత్వంలో ఉంది. వివాహ సంబంధ వస్తువులన్నీ ఈ మార్కెట్ లో అతి తక్కువ ధరకు దొరుకుతాయి.

అన్ని వర్గాల వారికీ

అన్ని వర్గాల వారికీ

P.C: You Tube

అన్ని వర్గాల వారికీ ఈ మార్కెట్ లో కావాల్సిన వివాహ సంబంధ వస్తువులు దొరకడం విశేషం. వివాహసమయంలో ధరించే ప్రత్యేక చీరలు, సూట్ లు మొదలకొని ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది.

జార్జ్ టౌన్, చెన్నై

జార్జ్ టౌన్, చెన్నై

P.C: You Tube

పూర్వం దీనిని బ్లాక్ టౌన్ అని పిలిచేవారు. దాదాపు క్రీస్తుశకం 1600 నుంచి ఈ మార్కెట్ అస్తిత్వంలో ఉన్నట్లు చెబుతారు. క్రీస్తుశకం 1900 లో ఈ మార్కెట్ ను పున: నిర్మించి దానికి జార్జ్ టౌన్ అని నామకరణం చేశారు.

చిన్న పిల్లల వస్తువులు

చిన్న పిల్లల వస్తువులు

P.C: You Tube

ఇక్కడ చిన్న పిల్లల దుస్తులు మొదలుకొని దొరకని వస్తువు అంటూ ఉండదు. ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడ చూడవచ్చు. అలనాటి వాస్తుశైలి భవనాలు ఇప్పటికీ ఇక్కడ మనకు కనువిందు చేస్తాయి.

లాడ్ బజార్, హైదరాబాద్

లాడ్ బజార్, హైదరాబాద్

P.C: You Tube

హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఛార్మినార్ పక్కనే ఈ లాడ్ బజార్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరికినా ముత్యాలు, గాజులకు ఈ బజార్ చాలా ప్రాచూర్యం చెందినది. లక్క గాజులు, స్వచ్ఛమైన ముత్యాలతో తయారు చేసిన గొలుసులు ఇక్కడ బాగా దొరుకుతాయి.

సుగంధ ద్రవ్యాలు

సుగంధ ద్రవ్యాలు

P.C: You Tube

సుగంధ ద్రవ్యాలు కూడా ఇక్కడ తక్కువ ధరకే దొరుకుతాయి. బేరం చేసే నైపుణ్యం ఉండాలేకాని ఇక్కడ వంద రుపాయల వస్తువు కూడా రూ.10 కు సొంతం చేసుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకి వస్తుంటారు.

జోహారీ బజార్, జైపూర్

జోహారీ బజార్, జైపూర్

P.C: You Tube

పింక్ సిటీగా పేరుగాంచిన జైపూర్ లో జోహారీ బజార్ అత్యంత పురాతన మార్కెట్లల్లో ఒకటి. జోహారీ బజార్ అంటే ఆభరణాల మార్కెట్ అని అర్థం. పేరుకు తగ్గట్టే ఇక్కడ బంగారు, వెండితో పాటు వివిధ రకాల లోహాలతో తయారుచేసిన ఎన్నో రకాల ఆభరణాలను ఇక్కడ మనం తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. లెహంగాలు కూడా ఇక్కడ తక్కువ ధరకే దొరుకుతాయి.

చోర్ బజార్, ముంబై

చోర్ బజార్, ముంబై

P.C: You Tube

బ్రిటీష్ కాలం నుంచి ఈ చోర్ బజార్ అస్తిత్వంలో ఉంది. దొంగతనం చేయబడ్డ చాలా వస్తువులు ఇక్కడ అతి తక్కువ ధరకే దొరుకుతాయి. అందువల్లే ఈ మార్కెట్ ను చోర్ బజార్ అని పిలుస్తారు. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ లేదు.

గుండు సూది మొదలుకొని

గుండు సూది మొదలుకొని

P.C: You Tube

గుండుసూది మొదలుకొని పెద్ద పెద్ల ఎలక్ట్రిక్ వస్తువుల వరకూ అన్ని రకాల వస్తువులు ఇక్కడ మనకు లభ్యమవుతాయి. అత్యంత ప్రాచీన వస్తువులు కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. అందుకే ఈ బజార్ నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది.

సర్దార్ మార్కెట్, జోద్ పూర్

సర్దార్ మార్కెట్, జోద్ పూర్

P.C: You Tube

రాజస్థాన్ లోని సర్దార్ మార్కెట్ భారత దేశంలోని అత్యంత ప్రాచీన మార్కెట్ లలో ఒకటి. రాజ సర్దార్ సింగ్ ఈ మార్కెట్ ను నిర్మింపజేశారని చెబుతారు. వివాహం వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు అవసరమైన వస్తువులు, దుస్తువులు ఇక్కడ తక్కువ ధరలోనే ఖరీదు చేయవచ్చు.

చర్మంతో తయారు చేసిన వస్తువులు

చర్మంతో తయారు చేసిన వస్తువులు

P.C: You Tube

ఇక్కడి వర్తకులు సంప్రదాయ రాజస్థానీ దుస్తులను ధరించడం విశేషం. ఇక్కడ రాజస్థాని బూట్లు కొనుగోలు చేయడం మరిచిపోకండి. చర్మంతో తయారు చేసిన బెల్టులు, బ్యాగులు, షూలు ఇక్కడ ప్రత్యేకం.

ఇమా మార్కెట్, ఇంఫాల్

ఇమా మార్కెట్, ఇంఫాల్

P.C: You Tube

ఇంఫాల్ లోని మార్కెట్ అత్యంత ప్రాచీన మార్కెట్. ఇక్కడ కేవలం మహిళలు మాత్రమే విక్రేతలు కావడం గమనార్హం. ఇలా మహిళలు విక్రేతలుగా ఉన్న మార్కెట్ ప్రపంచంలో ఇమా మార్కెట్ ఒక్కటే కావడం గమనార్హం.

4వేల మంది

4వేల మంది

P.C: You Tube

దాదాపు 4వేల మంది మహిళలు ఇక్కడ వర్తక వ్యాపారాలను నిర్వహిస్తారు. ఇక్కడ మణిపూర్ సంప్రదాయ దుస్తులతో పాటు సుగంధ ద్రవ్యాలను కూడా కొనుగోలు చేయవచ్చు.

దాదార్ ఫ్లవర్ మార్కెట్, ముంబై

దాదార్ ఫ్లవర్ మార్కెట్, ముంబై

P.C: You Tube

సాధారణంగా దీనిని ఫూల్ గుల్లీ అని అంటారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 వరకూ ఈ మార్కెట్ కిటకిటలాడుతూ ఉంటుంది. అత్యంత ప్రాచీన మార్కెట్ లలో ఒకటైన ఈ మార్కెట్ లో సరసమైన ధరలకే వివిధ రకాల పుష్పాలను సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ విదేశాల్లో మాత్రమే దొరికే పూలు కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

మహిందర్ పుర మార్కెట్, సూరత్

మహిందర్ పుర మార్కెట్, సూరత్

P.C: You Tube

భారత దేశంలోని అత్యంత ప్రాచీన మార్కెట్ లలో సూరత్ లోని మహిందర్ పుర మార్కెట్ కూడా ఒకటి. ఇక్కడ లక్షల సంఖ్యలో కార్మికులు ముడి వజ్రాలకు పాలిషింగ్ పెడుతూ, లేదా కట్ చేస్తూ కనిపిస్తారు. ప్రతి రోజూ ఇక్కడ కొన్ని వందల కోట్ల రుపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి.

అత్తర్ బజార్, ఉత్తర్ ప్రదేశ్

అత్తర్ బజార్, ఉత్తర్ ప్రదేశ్

P.C: You Tube

ఉత్తర్ ప్రదేశ్ లోని కనౌజ్ లోని అత్తర్ బజార్ మొఘలుల కాలం నుంచి అస్తిత్వంలో ఉంది. ఇక్కడే అత్తర్లు తయారు చేసి విక్రయించడం వల్ల సరసమైన ధరలకు మనకు ఇక్కడ మంచి అత్తర్లు దొరుకుతాయి.

విదేశాల నుంచి కూడా

విదేశాల నుంచి కూడా

P.C: You Tube

భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడ అత్తర్లను కొనుగోలు చేయడానికి వస్తుంటారు. అంతేకాకుండా అర్లను నిల్వచేసే గాజు సీసాలు కూడా ఇక్కడ మనకు తక్కువ ధరకే లభిస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X