Search
  • Follow NativePlanet
Share
» » సముద్ర తీర ఆకర్షణలతో... ప్రకృతి ప్రసాదించిన దీవులు!!

సముద్ర తీర ఆకర్షణలతో... ప్రకృతి ప్రసాదించిన దీవులు!!

అండమాన్ నికోబార్ దీవులు భారతదేశం యొక్క కేంద్ర పాలిత ప్రాంతం. చూడటానికి దూరంగా వెలివేసినట్టు ఉన్నప్పటికీ దేశ అంతర్భాగంలో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా ఉన్నది. ఇది రెండు దీవుల సముదాయం ఒకటేమో ఉత్తర భాగం దీనిని " అండమాన్ దీవులు" అని, మరొకటేమో దక్షిణ భాగం దీనిని " నికోబార్ దీవులు" అని పిలుస్తారు. అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని " పోర్టు బ్లెయిర్ ". ఇది మొత్తం 572 దీవుల సముదాయం అయినప్పటికీ అక్కడక్కడ విసిరేసినట్టు ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే కేవలం అండమాన్ దీవులకి మాత్రమే పర్యాటకులని అనుమతిస్తారు, నికోబార్ దీవులకు అనుమతించరు.

చరిత్ర

అండమాన్‌ నికోబార్‌ దీవులు గురించి 1777వ సం. వరకు బయట ప్రపంచానికేమీ తెలియదు. 1777లో బ్రిటిష్‌ వాళ్ళు జరిపిన సర్వేలోనే ఇవి బయట పడ్డాయి. అంతవరకు ఈ ద్వీపాల్లో బయట నుంచి అడుగుపెట్టిన వాళ్ళెవరూ లేరు. ఇక్కడ మొదట అడుగు పెట్టింది ఇంగ్లీషు వాళ్ళే. వారి రాజకీయ అవసరాల కోసం, ఖైదీలను ఉంచడం కోసం సెంటిల్‌మెంటుగా దీన్ని మార్చేసారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వేలాది దేశ భక్తుల్ని ఈ సెటిల్‌ మెంట్లలో నిర్భధించేవారు. ఆ తర్వాత సెల్యూలర్‌ జైలు కట్టారు. 1947లో భారతదేశానికి స్వతంత్రంతోపాటు అండమాన్‌, నికోబార్‌లు కూడా స్వతంత్రయ్యాయి. చరిత్ర తెలుసుకున్నాం కదా!! మరి ఇక్కడున్న పర్యాటక ఆకర్శణల గురుంచి తెలుసుకుందామా.....!!

Click Here to avail 50% OFF on Flight Bookings

సెల్యూలర్‌ జైలు

సెల్యూలర్‌ జైలు

సెల్యూలర్‌ జైలులో ఖైదీలు అనుభవించిన వర్ణనాతీత వేదనలు అండమాన్‌ కు ఎర్రటి పుండు లాగా అనిపిస్తుంది. వందల సంఖ్యలో ఉరితీయబడిన ఖైదీలు, భయానక బాధల నడుమ కూడా చైతన్యంతో ఉద్యమాలు నడిపిన ఖైదీలు వీరసావర్కార్‌ లాంటి ధిక్కార స్వరాలు క్రౄర, కసాయి బ్రిటిష్‌ జైలర్లు. అండమాన్‌లో సెల్యులర్‌ జైలును చూడడం, లైట్‌ అండ్‌ సౌండ్‌ ప్రోగ్రామ్‌ లో జైలు చరిత్ర, ఖైదీల ఆర్తనాదాలు భయానక వాతావరణాన్ని కలిగిస్తాయి.ఏడు పొడవాటి గోడల్లాగా ఒక వైపు మాత్రమే సెల్‌ తలుపు లుండేలా చాలా ప్లాన్డు గా కట్టిన కరకు నమూనా. ఖైదీలు ఒకరి ముఖాలొకరికి కనబడవు. వందలాది ఖైదీలను బంధించి, చిత్రహింసలు పెట్టి, ఉరితీసిన భయంకరమైన ఆ జైలు సందర్శనం ఒంటిని జలదరింపచేస్తుంది. ఖైదీలను ఏ విధంగా హింసించేవారో చూపించే బొమ్మలు వున్నాయక్కడ. ఒకేసారి ముగ్గురిని ఉరితీసే గది, వాసానికి వేలాడుతున్న ఉరితాళ్ళు. వీరసావర్కార్‌ గది. ఆవరణలో ఓ పెద్ద రావిచెట్టు ఉంటుంది, ఈ జైలులో జరిగిన అకృత్యాలకు మౌనసాక్షి అదే.

Photo Courtesy: Aliven Sarkar

హేవలాక్‌ ద్వీపం

హేవలాక్‌ ద్వీపం

ద్వీపంలోపల దట్టమైన అడవి లాగా పెరిగిన కొబ్బరి, పోకచెట్లు. ఎంత పచ్చగా ఉంటాయంటే, ఆ పచ్చదనానికి గుండెలయ తప్పుతుంది. ఆ ప్రకృతితో ప్రేమలో పడి మిగిలిన ప్రపంచాన్ని ఎడమకాలితో తన్నేయగల తన్మయం కల్గుతుంది. నీలి సముద్రం ఒడిలో కెరటాల లాలిపాటలో ఒదిగివున్నట్లు, ఎండలో మిల మిల మెరిసిపోతున్న సాగర సౌందర్యం, కెరటాల చప్పుడు తప్ప మరేమీ వినబడని ప్రదేశం ఈ హేవలాక్‌ ద్వీపం.

Photo Courtesy: mOTHrEPUBLIC

ఎలిఫెంటా బీచ్‌

ఎలిఫెంటా బీచ్‌

గుత్తులు గుత్తులుగా, రంగు రంగుల పూల గుత్తుల్లా జీవంతో తొణికిసలాడుతున్న కోరల్సు. తీరం వెంబడి అలా అలా నీళ్ళమీద నడుస్తూ, సాగర సంపదని కన్నార్పకుండా చూస్తూ... ఇలాంటి దృశ్యాలను డిస్కరరీ ఛానల్‌లో చూస్తూ పరవశించడమే ఇంతకాలం తెలుసు. కానీ ప్రత్యక్షంగా చూడగలుగుతున్నామనే, తాకగలుగు తున్నాయనే ఆనందం అణువణువులోను నిండి పోతుంది.

Photo Courtesy: Marcusbm

రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్సు కాంప్లెక్సు, పోర్టు బ్లెయిర్

రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్సు కాంప్లెక్సు, పోర్టు బ్లెయిర్

అందాలకు, ఆనందాలకు నెలవైన ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోని పర్యాటక ప్రాంతాలలో వాటర్ స్కైయింగ్, వాటర్ స్కూటర్, పారా సైలింగ్, విండ్ సర్ఫింగ్, సెయిలింగ్, స్పీడ్ బోటింగ్, రోయింగ్, పాడిల్ బోటింగ్, కయాకింగ్, ఆక్వా సైక్లింగ్, ఆక్వా గ్లైడింగ్, బంపర్ బోట్సు లాంటి సాహసోపేతమైన క్రీడలను సైతం నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే అండమాన్ దీవులు ట్రెక్కింగ్‌కు కూడా ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ కాంప్లెక్సు లో ఇటువంటివే ఉంటాయి మరి!

Photo Courtesy: Rubu1986

ఆబర్డీన్ బజార్

ఆబర్డీన్ బజార్

పోర్టు బ్లెయిర్ లో ఉన్న ఈ ప్రదేశం షాపింగులకు అనువైనది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. పర్యాటకులు ఇక్కడకు వచ్చి తమకు తోచిన వస్తువులు తీసుకువెళ్తారు.

Photo Courtesy: Biswarup Ganguly

వైపర్ దీవి

వైపర్ దీవి

వైపర్ దీవి జైలుకు ప్రసిద్ధి గాంచినది. ఈ దీవి పోర్టు బ్లెయిర్ కు 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. బోటు లేదా ఫెర్రీలో ఈ దీవి చేరాలి. ఈ దీవి పేరు గురించి రెండు కధలు చెపుతారు. ఒక కధనం మేరకు ఈ ద్వీపం పేరు ఒక ఓడ పేరు మీదుగా పెట్టారని చెపుతారు. 1789 సంవత్సరంలో ఈ ఓడ ఆర్చిబాల్డు బ్లెయిర్ ను ఈ దీవికి తీసుకు వచ్చింది కనుక దాని పేరు పెట్టారని చెపుతారు. రెండవ కధనం మేరకు , ఈ ప్రాంతంలో ఒళ్ళు గగుర్పొడిచే సంఖ్యలో వైపర్ పాములు ఉండటంచే వైపర్ దీవి అని పేరు వచ్చిందంటారు. భారతదేశ స్వాతంత్ర పోరాట యోధులలోని ప్రముఖులు వారి చివరి దినాలను ఇక్కడి వైపర్ జైలులో గడిపారు. నేటికి ఈ జైలు అవశేషాలు పర్యాటకులు చూడవచ్చు. ఇంతేకాక, వైపర్ దీవి అద్భుత విహార ప్రదేశం.

Photo Courtesy: Biswarup Ganguly

విమానాశ్రయం

విమానాశ్రయం

వీర్ శవర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం పోర్టు బ్లెయిర్ లో ఉన్నది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలైన ఢిల్లీ, చెన్నై, విశాఖపట్టణం, భువనేశ్వర్ ప్రాంతాల నుండి ఇక్కడకు విమానాలు వస్తుంటాయి.

Photo Courtesy: Jpatokal

జల మార్గం

జల మార్గం

విశాఖపట్టణం, చెన్నై, కలకత్తాల నుండి సెయిల్ లు బయలుదేరుతుంటాయి. నెలకు 3-4 సార్లు అండమాన్ కి పయనమవుతాయి. సుమారుగా ప్రయాణం 50-60 గంటల సమయం పడుతుంది.

Photo Courtesy: mamta tv

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X