Search
  • Follow NativePlanet
Share
» »అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు !

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు !

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు, వాస్తవంగా దేశానికి చిట్ట చివరి భాగంలో కలవు. అవి ఇండియా ప్రధాన భూభాగం కంటే కూడా థాయిలాండ్ కు సమీపంగా వుంటాయి. అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు మొత్తంగా 572 ద్వీపాలుగా కలవు. ఇవి 7,950 చ. కి. మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి వున్నాయి. ఈ దీవులలో 34 దీవీవులు మాత్రమే శాశ్వత నివాసాలు కలిగి వున్నాయి. అండమాన్ దీవులు నికోబార్ దీవుల నుండి ఒక చానెల్ ద్వారా వేరు చేయబడి వున్నాయి. అండమాన్ దీవుల సముదాయం మొత్తంగా 325 దీవులు కాగా నికోబార్ దీవులు 24 మాత్రమే. పోర్ట్ బ్లెర్ వీటి రాజధాని ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది కోల్కతా నుండి సుమారు 1,255 కి. మీ. ల దూరం, విశాఖపట్నం నుండి 1200 కి. మీ. లు, చెన్నై నుండి 1,190 కి. మీ. ల దూరం కలిగి వుంది. ఇండోనేషియా దేశం నుండి ఈ దీవులలోని చివరి భాగం 150 కి. మీ. ల దూరం మాత్రమే వుంటుంది. ఈ ద్వీపాలలో కొన్ని మానవ నివాసం లేక నిర్మానుష్యంగా వుండగా, మరికొన్ని టూరిస్ట్ లకు అందుబాటు లేక దూరంగా ఉంటాయి.

ఒకప్పుడు ఈ దీవులను బ్రిటిష్ వారు శిక్షల అమలుకు ఉపయోగించేవారు. అయితే, ఇపుడు అక్కడ కల పరిశుభ్రమైన బీచ్ లు, వివిధ రకాల పగడపు నిల్వలు, అనేక నీటి ప్రాణులు మొదలైన వాటితో ప్రతివారూ ఇక్కడ వచ్చి గడపాలని, విహరించాలని కోరుకుంటున్నారు. అండమాన్ మరియు నికోబార్ ద్వీపాల సముదాయం ఆనందాలను ఇవ్వటమే కాక ప్రశాంత జీవనం గడిపేందుకు, అక్కడ కల భూమి మరియు సముద్రంలో అన్వేషించేందుకు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. కొంతమంది పర్యాటకులు వాన్దూర్ లేదా రూట్ ల్యాండ్ ద్వీపాలలో వుండాలని కోరుకుంటు న్నప్పటికి, ఇక్కడ కల హావ్ లాక్ ద్వీపం లో పర్యాటకులకు కావలసిన అన్ని సౌకర్యాలు వున్నాయి. కనుక దీనిని బేస్ గా పెట్టుకోనమని మేము కూడా సిఫార్సు చేస్తున్నాము. హావ్ లాక్ ద్వీపం నుండి ఫెర్రీ లేదా యాచ్ రవాణాలు సమీపంలో కల మరి ఒక ద్వీపానికి సముద్రంలో ప్రయాణించి చేరటం తేలిక. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ బోటు ను నిలుపుకొని ప్రకృతి దృశ్యాల ఆనందాలను కూడా పొందవచ్చు. అండమాన్ మరియు నికోబార్ ద్వీపాల నీటిని ఆనందించాలంటే, మీరు చిన్న పిల్లలుగా ఉండాల్సిన అవసరం లేదు. వాటిని చూసి ఆనందించి వదలి వెళ్ళే సమయానికి మీరు గారంటీగా చిన్న పిల్లలు అయిపోతారన్న మాటే.

అండమాన్ నికోబార్ దీవులలో ఏమి చేయాలి ?
స్నోర్కేలింగ్ మరియు స్కూబా డైవింగ్
జీవం ఉట్టి పడుతోంది అనే మాట మీరు వినే వుంటారు. ఈ మాటకు అర్ధంగా మీరు ఇక్కడి సముద్రపు అడుగు భాగంలో కల ప్రదేశాలలో మీరు ఎన్నో రకాల అందమైన జీవులను చూడవచ్చు. స్వచ్చమైన ఈ నీటిలో స్నార్కెలింగ్ మరియు స్కూబా డైవింగ్ లు మీరు తప్పక చేయవలసిన సాహస క్రీడలు. గతంలో మీరు తలకు ఒక ముసుగు, నీటి దుస్తులు వేసుకోక పోయినా సరే, ఇపుడు వాటిని ధరించి సముద్రపు అడుగు భాగాల దృశ్యాలను చూసి ఆనందించండి.

స్కూబా డైవింగ్ లో నిపుణులుగా పేరొందిన వారు మిమ్మల్ని ఎంతో సురక్షితంగా ఈ అద్భుత సముద్రపు నీటి అడుగు భాగానికి తీసుకు వెళ్లి కన్నుల విందు చేస్తారు. వివిధ రకాల రంగు రంగుల చేపలు చూపుతారు. నీటి అడుగు భాగంలో దట్టంగా అలుముకొన్న అల్చిప్పలను, పగడపు ప్రాంతాలను మీకు చూపుతారు. బహుశ అక్కడే మునిగిన ఒక షిప్ ను సైతం మీకు చూపవచ్చు. మీరు ఈ ప్రదేశాలకు వెళ్లేముందు నీటి అడుగున ఫోటోగ్రఫీ పేకేజ్ కోరండి. ఎందుకంటే, మరల మరల తిరిగిరాని ఈ నీటి అడుగు దృశ్యాల అనుభూతి మీకు ఫోటో పరంగా వుండటం మంచిది. ఈ స్కూబా డైవింగ్ కు గాను మీరు అక్కడ కల బేర్ ఫుట్ స్కూబా డైవ్ రిసార్ట్ ను సంప్రదించండి. వారు మీకు స్నార్కెల్ లేదా డైవ్ లను రాజన్ అనే ప్రసిద్ధ స్విమ్మింగ్ ఎలిఫెంట్ తో పాటు ఏర్పాటు చేస్తారు.

అండమాన్ మరియు నికోబార్ దీవులు చూసేందుకు ఎన్నాళ్ళు పడుతుంది ? ఒక ప్రత్యేక విలాసవంతమైన నావపై సుమారు ఏడు రోజులపాటు మీరు విశ్రాంతి గా ఈ అందమైన ద్వీపాలను చూడవచ్చు. నీటి అడుగు భాగాలను శోధించవచ్చు. వెచ్చని సూర్య రశ్మిలో బీచ్ ల ఒడ్డున సన్ బాత్ లు చేయవచ్చు. మరి ఇన్ని ఆనందాలు కల అండమాన్ ద్వీపాల పర్యటనకు మీరు ఒక వారం రోజుల పాటు కేటాయించ వలసినదే.

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు !

నేచర్ వాక్స్
అండమాన్ మరియు నికోబార్ దీవులలో సాధారణ ప్రదేశాల నుండి రైన్ ఫారెస్ట్ లేదా అతి వేడి కల ప్రదేశాలలో మీకు నివాసం దొరుకుతుంది. అనేక రకాల నివాసాలు కలవు. వీటి వెంబడి మీరు విశ్రాంతితో ప్రకృతి నడకలు చేయవచ్చు. చాలా ద్వీపాలు బోటు లో మీరు వెళ్ళవచ్చు. హావ్ లాక్ ద్వీపంలో మీరు నడవ లేనంత విస్తారమైన ప్రదేశం కలదు.

హావ్ లాక్ ద్వీప సమీపంలో కల అండమాన్ మరియు నికోబార్ ద్వీప పర్యారావన బృందాని వారి రీసెర్చ్ బేస్ లో తప్పక సందర్శించండి. ఈ సంస్థ వాన్దూర్ ద్వీపం లో కలదు. ద్వీప జీవితం, సంస్కృతి మరియు ఇతర సమాచారం ఈ సంస్థ మీకు ఇస్తుంది. ఈ అద్భుత ప్రదేశంలో ట్రెక్కింగ్ చేయండి. లేదా ఇక్కడే కల మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ చూడండి. ఇక్కడ సముద్రపు తాబేళ్లు గుడ్లను పెట్టె దృశ్యాలు అద్భుతంగా వుండి జీవితంలో మీరు మరువలేనివి గా వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X