Search
  • Follow NativePlanet
Share
» »బ్రహ్మ ప్రతిష్టించిన మహావిష్ణువు - శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు ఆలయం !

బ్రహ్మ ప్రతిష్టించిన మహావిష్ణువు - శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు ఆలయం !

By Mohammad

విజయవాడ మహానగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలో ఆంధ్రా మహావిష్ణువు ఆలయం కొలువై ఉన్నది. ఈ గ్రామం ఘంటసాల మండలంలో దీవిసీమలోని కృష్ణా నది తీరంలో కలదు. శ్రీకాకుళం గ్రామం శాతవాహనుల కాలంలో రాజధానిగా ఉండేది. క్రీ. శ 2 వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని మహానగరంగా అభివర్ణించారు.

శ్రీకాకుళం గ్రామానికి ఎలా చేరుకోవాలి ?

శ్రీకాకుళం గ్రామానికి విజయవాడ, ఘంటసాల, కోడలి, కొల్లూరు ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు సౌకర్యం కలదు. విజయవాడ నుండి ప్రతి రోజూ శ్రీకాకుళం మీదుగా ఘంటసాల మండలానికి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి.

ఇది కూడా చదవండి : విజయవాడ కు 100 km లోపు పర్యాటక ప్రదేశాలు !

శ్రీకాకుళం గ్రామంలో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. సమీపాన విజయవాడ రైల్వే స్టేషన్ కలదు. అక్కడ దిగి ప్రభుత్వ బస్సులలో ప్రయాణించి శ్రీకాకుళం చేరుకోవచ్చు. విజయవాడ లో ఎయిర్ పోర్ట్ కూడా కలదు.

ఆంధ్ర మహావిష్ణు ఆలయం

ఆంధ్ర మహావిష్ణు ఆలయం

చిత్ర కృప : Adityamadhav83

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు / దేవాలయాలు

ఆంధ్రా మహావిష్ణు ఆలయం

ఆంధ్రా మహావిష్ణు ఆలయంలో ఉన్న విష్ణు భగవానుడిని ఆంధ్రా భాష ప్రియుడని అంటారు . దేవాలయములో ని మహా విష్ణువుని మొదట బ్రహ్మ ప్రతిష్టించి పూజించినట్లు చెబుతారు. ఇక్కడ ప్రతిష్టించబడిన శ్రీ మహావిష్ణువు 'శ్రీ కాకుళేశ్వరుడు' అనే పేరుతో ప్రఖ్యాతి గాంచాడు. ఈ స్వామీ వారిని ఆంధ్ర విష్ణువు , ఆంధ్ర నాయకుడు మొదలైన పేర్లతో పూజించారు అని పురాణాలలో పేర్కొన్నారు. ఈ గుడిలో వెలసిన మహా విష్ణువు స్వయముగా వెలసి భక్తుల పాపాలని హరిస్తాడు అని భక్తుల విశ్వాసం. గుడి యొక్క రాజగోపురం ఐదు అంతస్థులు ఉంటుంది. ఈ రాజగోపురాన్ని క్రీ. శ. 10 వ శతాబ్దంలో చోళరాజు అయినా అనంత దండపాలుడు నిర్మించాడు.

మహావిష్ణు ఆలయం రాజగోపురం

మహావిష్ణు ఆలయం రాజగోపురం

చిత్ర కృప : Adityamadhav83

విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ దండయాత్ర లో భాగంగా ఇక్కడి మందిరం గురించి విని స్వామిని దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. అలాగే ఇక్కడ ఉన్న ఒక మండపంలో కూర్చొని విష్ణువును తలుచుకుంటూ అముక్త మాల్యద అనే గ్రంధాన్ని రచించాడు. ఇప్పడు ఆ మండపాన్ని ఆముక్త మాల్యద మండపం అని పిలుస్తున్నారు. గుడి ప్రత్యేకత హోమగుండం లోని అగ్ని హోత్రము. అది ఇప్పటికీ వెలుగుతూనే ఉంది.

శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు ఆలయం

శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు ఆలయం

చిత్ర కృప : Tandavakrishna Tungala

శ్రీరాజ్యలక్ష్మి భోగ్యలక్ష్మి సమేత శ్రీ కాకుళేశ్వర స్వామి ఆలయం

గ్రామంలో వెలసిన ఈ ఆలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా మే నెలలో (వైశాఖమాసం లో) 5 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్స్వాలను తినాలకించటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వస్తుంటారు. ఆలయ ప్రాంగణం లో శ్రీకాసులపురుషోత్తమ కవి విగ్రహాన్ని గమనించవచ్చు.

ammavaru

చిత్ర కృప : Chandroos

శ్రీ సువర్చలా సమేత అంజనేయస్వామి ఆలయం

ఈ ఆలయం కూడా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దీంతో పాటు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కూడా వైభవంగా జరుపుతారు గ్రామస్థులు.

శ్రీ ప్రసన్న మల్లికార్జున స్వామి ఆలయం

ఈ ఆలయంలో వర్షం కోసం ప్రత్యేక పూజలు జరుపుతారు. కృష్ణానదీ జలాలు, 11 నీటి ముంతలతో స్వామి వారికి రుద్రాభిషేకాలు, జలాభిషేకాలు నిర్వహిస్తారు.

ఆలయ గోడలపై దేవుళ్ళ రాతి ప్రతిమలు

ఆలయ గోడలపై దేవుళ్ళ రాతిప్రతిమలు

చిత్ర కృప : Adityamadhav83

శ్రీ రామాలయం

గ్రామంలోని శ్రీ రామాలయం కొత్తది. హనుమాన్, లక్ష్మణ్, సీతా సమేత కోదండరామస్వామి విగ్రహాలను టిటిడి దేవస్థాన వేదపండితులు విశిష్ట పూజలు చేసి ప్రతిష్టించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X