» »అడిగిన వెంటనే వరాలిచ్చే ... అన్నవరం సత్యనారాయణ స్వామి !!

అడిగిన వెంటనే వరాలిచ్చే ... అన్నవరం సత్యనారాయణ స్వామి !!

Written By:

అన్నవరం దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిచెందినది. ఇది తూర్పుగోదావరి జిల్లా, రత్నగిరి కొండ మీద ఉన్నది. అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా ఇక్కడి సత్యనారాయణ స్వామికి పేరుంది. కొత్తగా పెళ్ళైన జంటలు ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేయటం ఆనవాయితీ. అయితే అన్నవరం వెళ్ళి సత్యదేవుని సన్నిధానంలో వ్రతం చేయటం శ్రేష్టమని అందరూ భావిస్తారు.

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండ మీద వెలసిన సత్య దేవును ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉన్నది. అన్నవరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి గుడి, వన దుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కొండ కింద గ్రామ దేవత గుడి తో మొదలయ్యే దర్శనం చివరగా సత్యదేవునితో ముగుస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కు చెందిన అన్నవరం, రాజమండ్రి కి 70 కి. మీ. దూరంలో మరియు కాకినాడ కి 45 కి. మీ. దూరంలో ఉన్నది.

గుడి ప్రాంగణం

గుడి ప్రాంగణం

ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున వనదుర్గ ఆలయం, రామాలయం, విశ్రాంతి మందిరం కనిపిస్తూ ఉంటాయి.

చిత్రకృప : Adityamadhav83

వ్రత మండపాలు

వ్రత మండపాలు

రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. స్వామి వారికి నిత్యం పూజలు, ఆర్చనలు మరియు భక్తుల సామూహిక వ్రతాలు జరుగుతుంటాయి.

చిత్రకృప : Raj

పర్వదినాలు

పర్వదినాలు

ఉగాది, శ్రీరామనవమి, వినాయక చతుర్థి, శరన్నవరాత్రులు, సంక్రాంతి మొదలైన పర్వదినాల రోజులలో కల్యానోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలలో సంపన్నమైన ఆలయంగా సత్యదేవుని ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఎప్పుడు భక్తులతో, యాత్రికులతో ఈ క్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది.

చిత్రకృప : Adityamadhav83

స్వామి వారి వ్రతం

స్వామి వారి వ్రతం

సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతుంది. సాధారణ వ్రతం రూ. 125 గా, ప్రత్యేక వ్రతం రూ. 200 గా, ధ్వజస్తంభం వద్ద వ్రతం రూ. 500 గా, విశిష్ట వ్రతం రూ. 1, 116 గా ఉంటాయి.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

అన్నవరం దర్శనీయ ప్రదేశాలు

అన్నవరం దర్శనీయ ప్రదేశాలు

అన్నవరం దేవస్థానం పరిసరాల్లో అనేక దర్శనీయ క్షేత్రాలున్నాయి. శ్రీ నేరుళ్లమ్మ తల్లి ఆలయం, తొలిమెట్టు వద్ద శ్రీకనకదర్గ అమ్మ వారి ఆలయం, కొండపైకి వచ్చే మెట్ల మార్గంలో మద్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం, రత్నగిరి కొండపై క్షేత్రపాలకులు సీతారామచంద్రుని ఆలయం ఉన్నాయి.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

కాల నిర్ణయ గడియారం

కాల నిర్ణయ గడియారం

పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ నిర్దేశక యంత్రం రత్నగిరి పైన ప్రధాన ఆలయానికి ప్రక్కన ఉంది. సూర్యుని నీడ (ఎండ) ఆధారంగా కాల నిర్ణయం చేసి, పని చేసేగడియారం ఇది. దీని పక్కనే తులసి వనం, వనం మధ్యలో పాముల పుట్ట చూడవలసినది.

చిత్రకృప : Adityamadhav83

ఉద్యానవనం

ఉద్యానవనం

దేవాలయం కి వచ్చే భక్తులు సేదతీరేందుకై దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉద్యానవనం తప్పక చూడాలి. అనేక రకాల పూల మొక్కలు, పూజ కు ఉపయోగపడే జాపత్రి మొక్కలు, పొగడ చెట్లు ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన ఆకర్షణలతో ఈ ఉద్యానవనం నిర్మితమైనది.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

ప్రకృతి చికిత్సాలయం

ప్రకృతి చికిత్సాలయం

రత్నగిరి కొండపై భక్తుల ఆయురారోగ్యాల కోసం పకృతి చికిత్సాలయ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో నిష్ణాత్తులైన యోగ విద్య నిపుణులు, ప్రకృతి వైద్య నిపుణులు ఆద్వర్యంలో చిక్సిత అందిస్తారు. అనేక వ్యాదులకు చికిత్స అందిస్తారు.

చిత్రకృప : Adityamadhav83

అన్నదానం

అన్నదానం

అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్య అన్నప్రసాద కార్యాక్రమం అందుబాటులో ఉంది. దేవస్థానంలో గోధుమ రవ్వతో తయారయ్యే ప్రసాడానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. 200 గ్రాముల ప్రసాదాన్ని రూ. 10 అమ్ముతారు.

చిత్రకృప : Adityamadhav83

వసతి

వసతి

సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు అనేక వసతి సౌకర్యాలు ఉన్నాయి. గుర్తింపు కార్డు చూపిస్తేనే గదులు కేటాయిస్తారు. కొండ క్రింది దేవస్థానం సత్రములు, హొటళ్ళు ఉన్నాయి. కొండపైన కూడా విడిదికి సత్రాలు దేవస్థానం తరపున గదులతో కూడినవి ఉన్నాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు ఉన్నాయి.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

అన్నవరం ఎలా చేరుకోవాలి ??

అన్నవరం ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

అన్నవరం గ్రామానికి చేరుకోవడానికి సమీపంలో విమానాశ్రయం రాజమండ్రి దేశీయ విమానాశ్రయం. ఇది సుమారు 80 కి. మీ. దూరంలో ఉండి, రెండు గంటల్లో అన్నవరం చేరుకొనే విధంగా ఉంటుంది.

రైలు మార్గం

అన్నవరంలో రైల్వే స్టేషన్ ఉంది. చెన్నై-హౌరా రైల్వేలైన్‌లో ఉన్న అన్నవరం రైల్వేస్టేషన్‌లో సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లన్నీ ఆగుతాయి.

బస్సు మార్గం

రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నుంచి ప్రతీ పావుగంటకు బస్సులున్నాయి. రాజమండ్రి నుంచి విశాఖపట్నం అన్నవరం సింగిల్‌స్టాప్‌ బస్సులుకూడా ప్రతీ 45 నిమిషాలకు అందుబాటులో ఉన్నాయి. అన్నవరం చేరుకున్న తర్వాత దేవస్థానం బస్సులు అందుబాటులో ఉంటాయి. ఓపిక ఉన్నవారు 450 మెట్లు ఎక్కి కూడా వెళ్ళవచ్చు.

చిత్రకృప : Imahesh3847

Please Wait while comments are loading...