Search
  • Follow NativePlanet
Share
» »అంతరగంగ - సాహస క్రీడల సమాహారం !

అంతరగంగ - సాహస క్రీడల సమాహారం !

By Mohammad

అందమైన ప్రకృతి అందాలతో దీవించబడ్డ అంతరగంగ కొండ ప్రాంతంలో కలదు. ఈ రాతి కొండలు సముద్ర మట్టానికి 1226 మీటర్ల ఎత్తులో కర్నాటక లోని కోలార్ లో ఉన్నాయి. బెంగళూరు నుండి అంతరగంగ 70 కి. మీ ల దూరంలో ఉన్నది.

అంతరగంగ రోడ్డు మార్గం ద్వారా

బెంగళూరు నుండి అంతర గంగ చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో జాతీయరహదారి వయా 4 గుండా గంటన్నార ప్రయాణం, మరొకటేమో వయా జాతీయ రహదారి 7 మరియు 4 గుండా రెండుగంటల ప్రయాణం.

ఇది కూడా చదవండి : బెంగుళూరు నుండి హోగనెక్కల్ వన్ డే రోడ్ ట్రిప్ జర్నీ !

సాహస ప్రియులకు అంతర గంగ బాగా నచ్చుతుంది. అంతర గంగ అంటే నిరంతరం ప్రవహించే నీరు అని అర్థం వస్తుంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ అంతరగంగ గుహలు. ఇవి అగ్నిపర్వత చిన్న చిన్న రాళ్ళతో ఏర్పడ్డాయి. ఇక్కడి సమీపంలోని ఒక కొండ కాశీ విశ్వేశ్వర ఆలయం ఉన్నది. సాహస యాత్రికులు కొండ మీదకి ట్రెక్కింగ్, రాక్ క్లైమ్బింగ్ వంటి సాహసాలు చేయవచ్చు.

పర్యాటకులకు వినోదం ఎలా ?

అంతరగంగ అందాలు దాని రాతి నిర్మాణాలలోను, గుహలలోను ఉన్నాయి. సాహసం ఇష్టపడేవారికి అంటే పర్వతా రోహణ, ట్రెక్కింగ్ వంటివి చేసేవారికి ఈ ప్రదేశం మరువలేని అనుభూతులనిస్తుంది. ఇక్కడి గుహలు కూడా అన్వేషించదగినవే. ట్రెక్కింగ్ కనీసం ఒకటి రెండు గంటలు పడుతుంది. అయితే, కొండనుండి కిందకు వేగంగాను, తేలికగాను రావచ్చు.

రాక్ క్లైమింగ్ సాహస క్రీడ

రాక్ క్లైమింగ్ సాహస క్రీడ

చిత్ర కృప : Sumeet Mulani

అంతరగంగ గుహలు

అంతరగంగ కొండలలో గుహలు దాగి ఉన్నాయి. అందుచేతనే వీటిని అంతరగంగ గుహలు అంటారు. ఈ గుహలు చిన్న చిన్న అగ్ని పర్వత రాతి ముక్కలతో ఏర్పడ్డాయి. కాలక్రమంలో ఆ రాతి ముక్కలు కరిగి గుహలుగా రూపాంతం చెందాయి. గుహలు పర్యాటకులకు తప్పక ఆనందాన్ని కలిగిస్తాయి. కొన్ని గుహలలో సందర్శకులు పాములా పాక్కుంటూ లోనికి వెళ్ళవలసి ఉంటుంది.

అంతరగంగ గుహలు !

అంతరగంగ గుహలు !

చిత్ర కృప : kmahesh_79

కాశీ విశ్వేశ్వర ఆలయం

అంతరగంగ లో మతపర ప్రాధాన్యత కూడా ఉంది. ఇక్కడికి దగ్గరలోని కొండ మీద కాశీ విశ్వేశ్వర ఆలయం ఉన్నది. ఇది భగవంతుడు శివునికి అంకితం చేయబడింది. ఆలయంలో కొలను కూడా కలదు. ఇక్కడకు వచ్చే యాత్రికులు నిరంతర నీటిప్రవాహాన్ని, పురాతన దేవాలయాన్ని దర్శించవచ్చు. వాస్తవానికి ఈ ప్రవాహం దేవాలయంలో ఒక భాగమైన ఒక రాతి ఎద్దు నోటి వద్ద ఆగిపోతుందట ..!

కాశీ విశ్వేశ్వర ఆలయం

కాశీ విశ్వేశ్వర ఆలయం

చిత్ర కృప : Maya

సందర్శకులకు సూచనలు

సందర్శకులు కొండ మీదకి అడ్వెంచర్ ట్రిప్ చేసేటప్పుడు తాగటానికి నీళ్ళ బాటిల్, భోజనం వెంట తీసుకెళ్లటం మంచిది. రాత్రిపూట నైట్ క్యాంప్ చేయటానికి సాహసికులు వారాంతంలో, సెలవు రోజుల్లో ఎక్కవగా వస్తుంటారు. గుహల వద్ద రాత్రి పూట విశ్రాంతి తీసుకోవటానికి టార్చి లైట్, టెంట్ మరియు ఇతర అవసమైన వస్తువులను సిద్దం చేసుకొని బయలుదేరండి . ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండ మీదకి వెళ్ళేటప్పుడు కోతులు ఎక్కవగా కనిపిస్తాయి కాస్త జాగ్రత్తగా వెళ్ళండి . ట్రెక్కింగ్ పాయింట్లు, స్లీవ్ టీ షర్ట్ లు ధరించండి . గ్రిప్ లో ఉండే షూ లను ధరించి , స్వెటర్ లేదా జాకెట్ లను వెంటతీసుకొని వెళ్ళండి.

సందర్శకులకు సూచనలు

కొండ మీద విశ్రాంతికై టెంట్

చిత్ర కృప : India Hops

అంతరగంగ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

బెంగళూరు అంతరగంగ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. ఇది 70 కి. మీ ల దూరంలో ఉంటుంది. దేశంలోని, ప్రపపంచంలోని వివిధ నగరాల నుండి బెంగళూరు విమానాశ్రయానికి విమానాలు తరచూ వస్తుంటాయి . క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని అంతరగంగ సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

అంతరగంగ కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ కోలార్ రైల్వే స్టేషన్. ఇది 3 కి.మీ ల దూరంలో ఉన్నది. దేశంలోని అన్ని నగరాలనుండి కోలార్ స్టేషన్ కు రైళ్ళు వస్తుంటాయి. స్టేషన్ బయటికి వచ్చి లోకల్ ట్రాన్స్పోర్ట్ (టెంపో, టాక్సీ, క్యాబ్, ఆటో మొదలైనవి) లలో ప్రయాణించి అంతరగంగ చేరుకోవచ్చు.

బస్సు మార్గం

బెంగళూరు నుండి లేదా కోలార్ నుండి అంతరగంగ చేరుకోవచ్చు. మీ వద్ద సొంత వాహనం ఉంటె ఇంకా మంచిది. బైక్ లలో ప్రయాణిస్తూ చుట్టూ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ .. రోడ్డు మార్గం ద్వారా త్వరగా చేరుకోవచ్చు.

అంతరగంగ కు వెళ్ళే మార్గాన్ని చూపుతున్న బోర్డు

అంతరగంగ కు వెళ్ళే మార్గాన్ని చూపుతున్న బోర్డు

చిత్ర కృప : Infinite Possibilities

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X