Search
  • Follow NativePlanet
Share
» »అంతరగంగ ట్రెక్, బెంగళూరు !!

అంతరగంగ ట్రెక్, బెంగళూరు !!

By Mohammad

సాహస క్రీడాకారులకు అంతరగంగ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది. అంతరగంగ అంటే నిరంతరం ప్రవహించే నీరు అని చెప్పవచ్చు. ఇది కర్నాటకలోని కోలార్ జిల్లాకు తూర్పు భాగంలో కొండలపై ఉంది. ఈ ప్రవాహం పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుండి ప్రవహిస్తూ కొండలపైనుండి దుముకుతుంది. ఈ కొండ చరియల శ్రేణిపై దట్టమైన అడవి కూడా ఉంది. దీనిని తప్పక చూడాలి. కొండ ప్రాంతం వచ్చేటప్పటికి పచ్చదనం తగ్గి అందమైన కిరీటాకారంలో ముళ్ళ పొదలుగా తయారవుతుంది.

పర్యాటకులకు వినోదం ఎలా?

అంతరగంగ అందాలు దాని రాతి నిర్మాణాలలోను, గుహలలోను ఉన్నాయి. సాహసం ఇష్టపడేవారికి, అంటే పర్వతా రోహణ, ట్రెక్కింగ్ వంటివి చేసేవారికి ఈ ప్రదేశం మరువలేని అనుభూతులనిస్తుంది. ఇక్కడి గుహలు కూడా అన్వేషించదగినవే. ట్రెక్కింగ్ కనీసం ఒకటి రెండు గంటలు పడుతుంది. అయితే, కొండనుండి కిందకు వేగంగాను, తేలికగాను రావచ్చు. అంతరగంగ లో మతపర ప్రాధాన్యత కూడా ఉంది. ఇక్కడకు వచ్చే యాత్రికులు నిరంతర ఈ ప్రవాహాన్ని, పురాతన దేవాలయాన్ని దర్శించవచ్చు. వాస్తవానికి ఈ ప్రవాహం దేవాలయంలో ఒక భాగమైన ఒక రాతి ఎద్దు నోటి వద్ద ఆగిపోతుంది. ఈ ప్రదేశం బెంగుళూరుకు 68 కి.మీ.ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం సౌకర్యం కనుక యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు.

అంతరగంగ ట్రెక్, బెంగళూరు !!

చిత్రకృప : solarisgirl

అంతరగంగ గుహలు

అంతరగంగ కొండలలో అంతరగంగ గుహలున్నాయి. ఇవి అగ్నిపర్వత చిన్న రాళ్ళుగా ఏర్పడ్డాయి. కాలక్రమంలో పెద్ద పెద్ద లేదా చిన్నరాళ్ళు కరిగి గుహల నిర్మాణాలయ్యాయి. ఈ గుహలు పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తాయి. కొన్ని గుహలలో సందర్శకులు పాకు కుంటూ వెళ్ళవలసి వస్తుంది.

ఈ ప్రాంతంలో గుహలే కాకుండా, సందర్శకులు కొన్ని పురాతన దేవాలయాలను, మత కేంద్రాలను కూడా సందర్శించవచ్చు. బెంగుళూరుకు ఇది 70 కి.మీ.ల దూరంలో ఉంది. బస్ లలో ప్రతిరోజూ ప్రయాణించవచ్చు. ట్రెక్కింగ్, రోపింగ్ వంటివి ఆనందించవచ్చు. అనేక సహజ నీటి ప్రవాహాలు ఈ కొండల మధ్య నుండి వచ్చి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తాయి.

అంతరగంగ ట్రెక్, బెంగళూరు !!

చిత్రకృప : solarisgirl

రెస్టారెంట్లు మరియు లోకల్ భోజనం

రెస్టారెంట్లు ఇక్కడ అనుమానమే. కానీ టీ త్రాగటానికి, బిస్కెట్లు తినటానికి ఒక చిన్న టీ స్టాల్ ఉంది. కనుక పర్యాటకులు భోజనం ఇంటినుండే ప్రిపేర్ చేసుకొని లేదా కోలార్ వెళ్ళే దారిలో కనిపించే రెస్టారెంట్లు, హోటళ్ళలో పార్సల్ తీసుకొని అంతరగంగ వెళ్ళటం ఉత్తమం.

అంతరగంగ లో ఎక్కడ స్టే చేయాలి ?

అంతరగంగ లో ఎటువంటి వసతి సదుపాయాలు లేవు. ఉండటానికి లాడ్జీలు కూడా అందుబాటులో లేవు. ఇది బెంగళూరు నుండి ఒక్కరోజు ప్రయాణానికి అనుకూలం. కనుక పర్యాటకులు చాలా మంది బెంగళూరు నుండి రావటానికి ఇష్టపడుతారు. బెంగళూరు లో స్టే వసతులు కలవు.

అంతరగంగ ట్రెక్, బెంగళూరు !!

చిత్రకృప : Vedamurthy J

అంతరగంగ కు విమాన, రైలు మార్గాలు

విమాన ప్రయాణం - అంతర గంగ కు సమీపంగా బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది దేశీయ మరియు విదేశీయ పర్యాటకులకు అనువుగా ఉంటుంది. 70 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం దేశంలోని అన్ని నగరాలకు విదేశాలకు కూడా ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

రైలు ప్రయాణం - అంతర గంగకు రైలు స్టేషన్ లేదు. సమీపంలోని కోలార్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడకు బస్ లు, టాక్సీలు, క్యాబ్ లేదా మోటర్ బైక్ లలో చేరవచ్చు. కోలార్ రైలు స్టేషన్ నుండి 3 కి.మీ. ల దూరం మాత్రమే ఉంటుంది.

ఇది కూడా చదవండి : ముచ్చటైన కోలార్ పర్యటన !!

అంతరగంగకు ఇలా వెళ్ళండి ... ఇదే ఉత్తమం

అంతరగంగ కోలార్ జిల్లాలో ఉన్నది. కోలార్ నుండి అంతరగంగ కు ప్రవేట్ వాహనాలు, ఆటో రిక్షాలు అందుబాటులో ఉన్నాయి. ఇది కోలార్ నుండి 3-5 కిలోమీటర్ల దూరంలోనే కలదు. బెంగళూరు నుండి కోలార్ కు రెగ్యులర్ గా ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు తిరుగుతాయి. పర్యాటకులు బెంగళూరు నుండి ఒకరోజు పర్యటనకు క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని ప్రయాణించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X