Search
  • Follow NativePlanet
Share
» »పోగొట్టుకు పోయిన వస్తువులు, తప్పి పోయిన కుటుంబ సభ్యులను మీ చెంతకు చేర్చే అమ్మవారు

పోగొట్టుకు పోయిన వస్తువులు, తప్పి పోయిన కుటుంబ సభ్యులను మీ చెంతకు చేర్చే అమ్మవారు

అరైకాసు అమ్మన్ దేవాలయంలోని దేవత పోగొట్టుకొన్న వస్తువులను తిరిగి ఇస్తుందని నమ్ముతారు. ఇందుకు సంబంధించిన కథనం.

By Kishore

బాధల్లో ఉన్న సమయంలో దేవాలయానికి వెళ్లి కొంత సాంత్వన పొందడాన్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడకు వెళ్లితే మన కోరికలు కూడా తీరుతాయని భక్తులు భావిస్తూ ఉంటారు. అయితే పోగొట్టుకొన్న వస్తువులను తిరిగి తమ చెంతకు చేర్చాలని గుళ్లకు వెళ్లి కోరుకొనేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే తమిళనాడులోని ఒక దేవాలయంలోని దేవత ఇలా పోగొట్టుకొన్న వస్తువులను తిరిగి బాధితుల వద్దకు చేరుస్తుందని చెబుతారు. అంతేకాకుండా ఈ దేవతను పూజిస్తే తప్పిపోయిన కుంటుంబ సభ్యలు తిరిగి మన వద్దకు వస్తారని భక్తులు నమ్ముతున్నారు. విడిపోయిన రెండు కుటుంబాలు కూడా ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల కలుస్తాయని స్థానికుల నమ్మకం. ఇన్ని విశిష్టతలు కలిగిన దేవాలయం, అందులోని అమ్మవారికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం

రాక్షసుడి శరీరభాగాలు పడినే చోటే...శక్తి పీఠాలు అందుకే వీటి సందర్శనతోరాక్షసుడి శరీరభాగాలు పడినే చోటే...శక్తి పీఠాలు అందుకే వీటి సందర్శనతో

1. రాజు ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టు కొంటాడు

1. రాజు ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టు కొంటాడు

P.C:You Tube

చాలా కాలం క్రితం తమిళనాడులోని పుదుక్కోట దగ్గర ఉన్న గోకర్ణంలో ప్రగడాంబాల్ అనే అమ్మవారు కొలువు దీరి భక్తులతో పూజలు అందుకొనేవారు. ఒకసారి స్థానికంగా ఉంటున్న సామంతరాజు ఒక ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకొన్నాడు.

2. కొన్ని క్షణాలకే

2. కొన్ని క్షణాలకే

P.C:You Tube

ఎంత వెదికినా ఆ పత్రం దొరకలేదు. దీంతో ప్రగండాంబల్ అమ్మవారిని వేడుకొంటాడు. ఇలా జరిగిన కొన్ని క్షణాలకే అతనికి ఆ పత్రం దొరుకుతుంది.

3. అరకాసు విలువ ఉన్న నాణెం మీద

3. అరకాసు విలువ ఉన్న నాణెం మీద

P.C:You Tube

ఈ విషయాన్ని రాజుకు తెలిపి ఆయన అనుమతితో ప్రగడాంబాల్ అమ్మవారి రూపాన్ని అరకాసు విలువ ఉన్న నాణెం మీద ఒక పక్క ముద్రిస్తాడు. వీటిని రాక్ష్యంలోని ప్రజలందరికీ పంచిపెట్టాడు.

4. ప్రజలు కూడా

4. ప్రజలు కూడా

P.C:You Tube

ఇలా అమ్మవారి గొప్పతనం రాజ్యంలో ప్రతి ఒక్కరికీ తెలుసింది. అటు పై ప్రజలు కూడా అమ్మవారి పట్ల విశ్వాసం పెరిగింది. తాము పోగొట్టుకొన్న వస్తువులను కూడా వెదికి పెట్టమని అమ్మవారిని వేడుకొని సాంత్వన పొందేవారు.

 5. రత్న మంగళంలో

5. రత్న మంగళంలో

P.C:You Tube

దీంతో అమ్మవారు పోయిన వస్తువులను తిరిగి బాధితుల చెంతకు చేర్చే తల్లిగా పేరొందారు. ఇదిలా ఉండగా తమిళాడులో రత్న మంగళంలో లక్ష్మీ కుబేర ఆలయం ఉంది.

6. ఒక ఆభరణం కనిపించలేదు

6. ఒక ఆభరణం కనిపించలేదు

P.C:You Tube

ఇక్కడ కుబేరుడికి ప్రతి ఏడాది కళ్యాణోత్సవం జరుగుతుంది. ఒక ఏడాది కళ్యాణోత్సవం జరిగే సమయంలో అత్యంత విలువైన ఆభరణం కనిపించలేదు.

7. ఆలయం నిర్మిస్తామని మొక్కు కొన్నారు

7. ఆలయం నిర్మిస్తామని మొక్కు కొన్నారు

P.C:You Tube

దీంతో ఆలయ నిర్వాహకులు ఆ ఆభరణం దొరికేలా చేయమని అరైకాసు అమ్మవారిని ప్రార్థించారు. ఒకవేళ ఆభరణం దొరికితే లక్ష్మీ కుబేర ఆలయం పక్కనే అరైకాసు అమ్మవారి ఆలయం నిర్మిస్తామని మెక్కుకొన్నారు.

8. వెంటనే దొరికింది

8. వెంటనే దొరికింది

P.C:You Tube

ఇది జరిగిన కొన్ని క్షణాలకే ఆ ఆభరణం లక్ష్మీ కుబేర ఆలయంలో దొరికింది. దీంతో నిర్వాహకులు తాము చెప్పినట్లే అమ్మవారి ఆలయాన్ని అక్కడ నిర్మించారు.

9. దేశ వ్యాప్తంగా ప్రాచూర్యం

9. దేశ వ్యాప్తంగా ప్రాచూర్యం

P.C:You Tube

ఇలా అరైకాసు అమ్మవారి దేవాలయం ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది. దీంతో భక్తులు తాము పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందటానికి ఇక్కడి వచ్చి అమ్మవారిని వేడుకొంటూ ఉంటారు.

10. తప్పి పోయిన కుటుంబ సభ్యులు

10. తప్పి పోయిన కుటుంబ సభ్యులు

P.C:You Tube

ముఖ్యంగా పిల్లలు, కుటుంబ సభ్యలు ఎవరైనా తప్పి పోతే వారి ఆచూకీ కోసం, ఆస్తులు, దూరమైన కుటుంబ సభ్యలు తిరిగి కలవాలని కోరుకొని మంచి ఫలితం పొందుతున్నారని స్థానిక పూజారులు చెబుతున్నారు.

11. ప్రత్యేక రోజుల్లో

11. ప్రత్యేక రోజుల్లో

P.C:You Tube

ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాలతో పాటు పౌర్ణమి, అమావాస్యల్లో ఈ దేవతను పూజిస్తే బాధితుల కోరిక తప్పక నెరవేరుతుందని ప్రజలు నమ్ముతారు. ఆ రోజుల్లో అమ్మవారి దగ్గరున్న 108 పత్రాల్లో నుంచి భక్తులు ఒక దానిని తీసుకోవటానికి అనుమతిస్తారు.

 12. దేవ ప్రశ్న

12. దేవ ప్రశ్న

P.C:You Tube

ఆ కాగితాల్లో ఉన్న సూచనల మేరకు బాధితుల కోరిక నెరవేరుతుందని చెబుతారు. దీనినే దేవ ప్రశ్న అని అంటారు. ఈ ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ భక్తులు వేల సంఖ్యలో ఉంటారు.

13. 107 దేవతా మూర్తుల విగ్రహాలు

13. 107 దేవతా మూర్తుల విగ్రహాలు

P.C:You Tube

ఆలయంలో మధ్యలో పెద్ద హాలు ఉంటుంది. ఇందులో 107 దేవతా మూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో కంచి కామాక్షి, కాశీ విశాలాక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక ఆలయం మధ్యలో ఉన్న చిన్న గర్భగుడిలో అరై కాసు అమ్మవారు కొలువై ఉంటారు.

14. ఆలయం సమయం

14. ఆలయం సమయం

P.C:You Tube

ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకూ తెరిచి ఉంటుంది. అదే విధ:గా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ఇక్కడ పూజలు జరుగుతాయి.

15. ఎలా వెళ్లాలి

15. ఎలా వెళ్లాలి

P.C:You Tube

చెన్నై నుంచి చెగల్ పట్ రైలు మార్గం వందలూరు వస్తుంది. ఇక్కడ దిగి షేర్డ్ ఆటోల ద్వారా అమ్మవారి ఆలయానికి వెళ్లవచ్చు. వందలూరు నుంచి అమ్మవారి ఆలయానికి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే. తాంబరం నుంచి రత్నమంగళానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X