Search
  • Follow NativePlanet
Share
» »టిప్పు ట్రయాంగిల్ : టిప్పు సుల్తాన్ ప్రధాన కట్టడాలు !

టిప్పు ట్రయాంగిల్ : టిప్పు సుల్తాన్ ప్రధాన కట్టడాలు !

By Mohammad

ఆధునిక ప్రపంచంలో రాచరికం పాలనకు చాలా దేశాలు చరమగీతం పాడాయి. అయినప్పటికీ కొన్ని దేశాల్లో( బ్రిటీష్, సౌది అరేబియా, బ్రూనై, జపాన్ మొదలైన దేశాల్లో) ఈ తరహా పాలన అమలులో ఉన్నది. మన దేశం ఇప్పుడైతే ప్రజాస్వామ్యం దేశం కానీ, అప్పట్లో రాచరిక దేశమే. ఎందరో రాజులు, రాజ వంశాలు, విదేశీ రాజులు, ఇప్పుడున్న బ్రిటన్ దేశం కూడా మనల్ని పరిపాలించిందే. ఇప్పటికీ మన దేశం కామన్ వెల్త్ దేశాలలో ఒకటి (కామన్ వెల్త్ అంటే బ్రిటీష్ అధీనంలో అప్పుడు, ఇప్పుడు ఉన్న రాజ్యాలన్న మాట). అందుకే ఇప్పటికీ మనం కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొంటాం.

ఆదునిక భారత దేశ చరిత్రలో, దక్షిణాన చెప్పుకోదగ్గ రాజులలో టిప్పు సుల్తాన్ ముందు వరుసలో ఉంటాడు. ఈయన తండ్రి హైదర్ అలీ. టిప్పు 'మైసూర్ పులి' గా ప్రసిద్ధి చెందినాడు. బ్రిటీష్ వారికి లొంగిపోకుండా, వారికి ఎదురుతిరిగిన ఏకైక భారతీయ రాజు టిప్పు సుల్తాన్.

దరియా దౌలత్ బాగ్ ప్రాంగణం, శ్రీరంగపట్నం

దరియా దౌలత్ బాగ్ ప్రాంగణం, శ్రీరంగపట్నం

చిత్ర కృప : Manfred Sommer

మైసూర్ లేదా బెంగళూరు పరిసరాల్లో మరియు కర్నాటక లోని వివిధ ప్రదేశాల్లో టిప్పు కాలానికి చెందిన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. టిప్పు కూడా అతని హయాంలో కొన్ని చారిత్రక కట్టడాలను నిర్మించాడు. వాటిలో ప్రధానమైనవి కింద పేర్కొన్న ఈ మూడు. వీటిని దర్శిస్తే, మీరు కూడా ఒకసారి అలా బ్రిటీష్ హయాంలో ఫ్రీ గా వెళ్ళేసి వస్తారు.

ఇది కూడా చదవండి : వీకెండ్ లో మైసూర్ ట్రిప్ !

దరియా దౌలత్ బాగ్, శ్రీరంగపట్నం

దరియా దౌలత్ బాగ్, టిప్పు సుల్తాన్ వేసవి విడిది. దీనిని క్రీ.శ. 1784 లో నిర్మించారు. దీని నిర్మాణంలో భారతీయ మరియు ముస్లిం శిల్ప కళా శైలి కనపడుతుంది . మొదటి అంతస్తులో టిప్పు వాడిన దుస్తులు, పెయింటింగ్ లు మొదలైనవి చూడవచ్చు. అలాగే కింద కూడ్య చిత్రాలలో టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారితో పోరాడిన సంఘటనలను చూడవచ్చు.

దరియా దౌలత్ బాగ్ గోడలపై నాటి పోరాట దృశ్యాలు

దరియా దౌలత్ బాగ్ గోడలపై నాటి పోరాట దృశ్యాలు

చిత్ర కృప : indianature12

సమ్మర్ ప్యాలెస్, బెంగళూరు

టిప్పు సుల్తాన్ హయాంలో ఈ ప్యాలెస్ వేసవి విడిది గా ఉండేది. స్వతంత్ర పోరాట సంగ్రామంలో ఈ విడిది కీలక భూమిక వహించింది. ప్యాలెస్ ప్రాంగణం అంతా రకరకాల పూల మొక్కలతో, అందమైన పుష్పాలతో సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది. దీనిని కూడా కింద, పైన ఒక భవనం లా నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ గదుల్లో టిప్పు వాడిన కత్తులు, ఖడ్గాలు, వస్తువులు ప్రదర్శిస్తుంటారు. అనుమతి లేనిదే ఫోటోలు తీసుకోరాదు. మొన్నీ మధ్యనే ఒక జంట మైసూర్ ప్యాలెస్ లో అనుమతి లేకుండా ఫోటోలు దిగారు. అది పెద్ద ఇష్యూ అయింది.

సమ్మర్ ప్యాలెస్, బెంగళూరు

సమ్మర్ ప్యాలెస్, బెంగళూరు

చిత్ర కృప : Pamri

జమలాబాద్ ఫోర్ట్

క్రీ.శ. 1794 వ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ కొండ మీద జమలాబాద్ కోట ను నిర్మించాడు. ఈ కోట జాడలు మీకు కుద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో, దక్షిణ కన్నడ లోని బెల్తంగడి లో కనిపిస్తాయి. శిధిలావస్థ లో ఉన్న కట్టడాన్ని మరళా పునః నిర్మించి ఆ కట్టడానికి తన తల్లి పేరు (టిప్పు తల్లి పేరు జమలాబీ) పెట్టాడు టిప్పు సుల్తాన్. కొండ మీద ట్రెక్కింగ్ చేయటం ఒకింత ఆనందాన్ని కలిగించే విషయమే కానీ జాగ్రత్త గా వెళ్ళాలి.

జమలాబాద్ ఫోర్ట్ మెట్ల మార్గం

జమలాబాద్ ఫోర్ట్ మెట్ల మార్గం

చిత్ర కృప : krishflickr

ఈ హెరిటేజ్ సైట్ ల గుండా మీ ప్రయాణం తప్పక ఆసక్తిని, ఆనందాన్ని రేకెత్తిస్తుంది. టిప్పు కట్టడాల సందర్శన మీ జీవితంలో ఒక ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X