Search
  • Follow NativePlanet
Share
» »అర్జునుడు కఠోర తపస్సుతో శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన ప్రదేశం

అర్జునుడు కఠోర తపస్సుతో శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన ప్రదేశం

హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో మనాలి ఒక అద్భుతమైన, అత్యంత ప్రసిద్ద పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది. ఇది సముద్రమట్టానికి 1950మీటర్ల ఎత్తులో ఉంది. ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశమైన మనాలి ఏడాది పొడవునా మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు లోయలను అద్భుతమైన వాతావరణ కలిగి ఉంది. మనాలిలో ఒక అద్భుతమైన గుహ ఒకటి ఉంది. అదే అర్జునుడి గుహ. మరి ఈ గుహకు మరియు అర్జునిడికి మధ్య సంబంధం ఏంటో ఇక సారి తెలుసుకుందాం..

అర్జున గుహ ఎక్కడ ఉంది:

అర్జున గుహ ఎక్కడ ఉంది:

మనాలి బస్ స్టేషన్ నుండి 21కి.మీ, కుల్లు నుండి 23కి.మీ. మరియు ఫ్రిని గ్రామానికి 10కిలోమీటర్ల దూరంలో ఉండే అర్జున గుహ నగరానికి పక్కన బియాస్ నది యొక్క ఎడమ ఒడ్డున ఉంది. అర్జున్ గుహకు సమీపంలో ఫ్రిని మరియు ఈ గ్రామం సహజ సౌందర్యానికి ఎక్కువ ప్రసిద్ది చెందినది. ఇది నగ్గర్ కోటకు చాలా దగ్గరగా ఉంది.

పురాణాల ప్రకారం:

పురాణాల ప్రకారం:

ఈ ప్రదేశంలో ప్రధాన పర్యాటక ఆకర్షణలలో అర్జున్ గుహ ఒకటి, ఈ గుహ సహజ సిద్దమైన సౌందర్యంతో పాటు దానికి సంబంధించిన ఒక పురాణ కథ ఒకటి ఉంది. అర్జున్ గుహ మహాభారత పురాణాలతో సంబంధం కలిగి ఉంది. భారతీయ ఇతిహాసం ప్రకారం మహాభారతంలో పాండవులలో ఒక్కరైన అర్జునుడు ఈ ప్రదేశంలో ధ్యానం చేసినట్లు చెబుతారు.

అర్జునుడి గుహకు ఆ పేరు ఎలా వచ్చింది:

అర్జునుడి గుహకు ఆ పేరు ఎలా వచ్చింది:

దేవతల అనుగ్రహాన్ని సాధించి కొత్త శస్త్రాస్త్రాలు సంపాదించడానికి అర్జునుడు వ్యాసులవారి సలహాను అనుసరించి హిమవత్ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయాలనుకున్నాడు. అన్నదమ్ముల వద్ద సెలవు తీసుకుని, పాంచాలితో చెప్పడానికి వెళ్ళాడు. ఆమె అతణ్ణి చూసి, "ధనుంజయా! మా సుఖదుఃఖాలూ, మా బ్రతుకులూ, మా అందరి మానావమానాలూ, ఐశ్వర్యసంపదలూ అన్నీ నీమీద ఆధారపడి వున్నాయి. విజయుడవై, దివ్యాస్త్రాలతో త్వరగా తిరిగిరా" అని శుభాకాంక్షలు చెప్పింది.

అస్త్రాల కోసం బయలుదేరిన అర్జునుడు ఎన్నో అడవులూ

అస్త్రాల కోసం బయలుదేరిన అర్జునుడు ఎన్నో అడవులూ

అస్త్రాల కోసం బయలుదేరిన అర్జునుడు ఎన్నో అడవులూ, కొండలూ దాటి చివరకు ఇంద్రకీల పర్వతం చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక వృద్ధబ్రాహ్మణుడు కనిపించాడు.

"నాయనా! విల్లూ, బాణాలూ కత్తీ కటార్లూ పెట్టుకుని వున్నావు.

"నాయనా! విల్లూ, బాణాలూ కత్తీ కటార్లూ పెట్టుకుని వున్నావు. ఎవరు నీవు? ఇక్కడ అస్త్రాలతో పనేమీ లేదే! కోపతాపాలూ, రాగద్వేషాలూ వదిలిపెట్టి నిర్మలంగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఈ తావున ఈ క్షత్రియవేషం ఎందుకు?" అంటూ ఆ వృద్ధుడు అర్జునుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. కొంతసేపటికి నిజరూపంతో ఎదుట నిలిచి, తాను ఇంద్రుడనని చెప్పాడు. "నా కుమారుడవైన నిన్ను చూసిపోదామని స్వర్గం నుండి వచ్చాను" అన్నాడు. అప్పుడు అర్జునుడు "నాకు దివ్యాస్త్రాలు కావాలి. అవి దయతో ఇప్పించండి" అని దేవేంద్రుణ్ణి అడిగాడు.

అప్పుడు ఇంద్రుడు ముక్కంటి దేవరను గూర్చి తపస్సు చేస్తే

అప్పుడు ఇంద్రుడు ముక్కంటి దేవరను గూర్చి తపస్సు చేస్తే

అప్పుడు ఇంద్రుడు ముక్కంటి దేవరను గూర్చి తపస్సు చేస్తే ఆయన వరప్రసాదం వల్ల దివ్వాస్త్రాలు పొందగలవు అలా చెయ్యి అని చెప్పి వేయికన్నుల వేల్పు మాయమైపోయాడు. ఆ తర్వాత అర్జునుడు హిమవత్పర్వతానికి వెళ్ళి పరమశివుణ్ణి గురించి చాలాకాలం కఠోరమైన తపస్సు చేశాడు. అప్పటి నుండి ఈ గుహకు అర్జున గుహ అని పేరు వచ్ఛింది. .

శంకరుడు సతీసమేతంగా బోయవానిరూపంలో

శంకరుడు సతీసమేతంగా బోయవానిరూపంలో

అర్జునుడి తపస్సుకు మెచ్చిన శంకరుడు సతీసమేతంగా బోయవానిరూపంలో బయలు దేరారు. అయితే అదే సమయంలో అర్జునుడు తపస్సు చేస్తున్న ప్రదేశంలో మూకాసురుడు అనే రాక్షసుడు దుర్యోధనుని ప్రేరేపితుడైన వరాహరూపంలో అర్జునుడు తపమాచరించే వనంలో భీభత్సచేయసాగాడు.

తపోభంగం కలిగిన అర్జునుడు, పరీక్షింపవచ్చిన శివుడు

తపోభంగం కలిగిన అర్జునుడు, పరీక్షింపవచ్చిన శివుడు

తపోభంగం కలిగిన అర్జునుడు, పరీక్షింపవచ్చిన శివుడు ఒకేసారి వారాహంపై బాణాలు వేసారు. ఈ వేటనాదంటే నాది అని ఇరువురు వాదులాడుకున్నారు. అర్జునుడుకోపించి భోయవాని రూపంలోని శివునిపై పలు అస్త్రాలు ప్రయోగించాడు. నీ అస్త్రాలు అన్నీ నా స్వామి మెడలో పూమాలలు అగుగాక అంది పార్వతీదేవి.

నీవుకోరుకునే పాశుపతాస్త్రం ఇస్సున్నాను

నీవుకోరుకునే పాశుపతాస్త్రం ఇస్సున్నాను

తన దివ్వ అస్త్రాలు అన్ని విఫలంకావడంతో తన ఎదురుగా ఉంది ఆది దంపతులే అని గ్రహించిన అర్జునుడు ధనస్సు వదిలి సదాశివుని క్షమింపమని కోరాడు. వత్సనీ తపస్సుకు మెచ్చాను, నీవుకోరుకునే పాశుపతాస్త్రం ఇస్సున్నాను అని అనుగ్రహించి ఆశీర్వదించి వెళ్ళిపోయారు.

కుంతి దేవి దేవాలయం

కుంతి దేవి దేవాలయం

అర్జునుడి గుహకు సమీపంలో కుంత్ భాయో సరస్సు మరియు కుంతి దేవి ఆలయం ఉన్నాయి. ఇది రెండు కి.మీ దూరంలో ఉంది. కొండలు మరియు లోయలు మధ్యన అర్జున గుహ యొక్క అద్భుతమైన దృశ్యాలు చూడాలంటే ఒక్క రోజులో చుట్టి రావచ్చు. ఈ గుహ సహజ సౌందర్యం మరియు గొప్పతనానికి ప్రసిద్ది చెందినది.

సందర్శించడానికి ఉత్తమ సమయం

సందర్శించడానికి ఉత్తమ సమయం

ఈ అర్జున గుహను సందర్శించడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ నుండి జూన్ వరకు మరియు సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

అర్జున గుహ మనాలి నుండి 5కి.మీ దూరంలో ఉంది. స్థానిక బస్సులు, ట్యాక్సీలు మరియు ప్రైవేట్ వాహనాలు మనాలీ సమీప గ్రామమైనల ఫ్రిని చేరుకోవడానికి ఉత్తమ రవాణా మార్గం. కుల్లు-నగర్-మనాలి రహదారి ద్వారా ఫ్రిని చేరుకోవడానికి 20 నిముషాలు పడుతుంది. అద్దె మోటారు బైకుల ద్వారా కూడా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఫ్రినిలో ఒకసారి పర్యాటకులు బియాస్ నది ఎడమ ఒడ్డు వరకు నడవాల్సి ఉంటుంది. అక్కడి నుండి ఈ అర్జున్ గుహను చేరుకోవడానికి సుమారు 20 నిముషాలు కొండపైకి ఎక్కాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X