Search
  • Follow NativePlanet
Share
» »ఈ పట్టీశ్వరాలయం వింతలు మీకు తెలుసా?

ఈ పట్టీశ్వరాలయం వింతలు మీకు తెలుసా?

తమిళనాడులోని అత్యంత ప్రాముఖ్యం కలిగిన దేవాలయాల్లో ఆరుల్‌మిగి పట్టీశ్వరార్ స్వామి దేవాలయం ఒకటి.

కోయంబత్తూరులోని పరూరు పట్టీశ్వరం దేవాలయం గురించి మీరు విన్నారా? ఈ దేవాలయం ఒక విశేషాల పుట్ట అని చెప్పవచ్చు. ఈ దేవాలయాన్ని మోక్షస్థలం అని చెబుతారు. ఇక్కడ చింత గింజ మొలకెత్తదు. అదే విధంగా పేడలో క్రిమికీటకాలే ఉండవు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం..

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

ఈ పట్టీశ్వరార్ దేవాలయం తమిళనాడులోని కొయంబత్తూర్ నగరానికి పశ్చిమ దిశలో పరూరు అనే గ్రామం ఉంది. ఇది కొయంబత్తూరు నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.

నరకాసురుడిని సత్యభామ చంపిన ప్రదేశం ఇదేనరకాసురుడిని సత్యభామ చంపిన ప్రదేశం ఇదే

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

ఇది ప్రముఖ శైవ క్షేత్రం. ఈ దేవాలయం వెనుక ఒక పురాణ కథనం కూడా ఉంది. పూర్వం ఒక ఆవు నిత్యం శివుడిని ధ్యానించేది. అదే విధంగా ఒక పుట్ట పై నిల్చొని నిత్యం పాలను ధారగా కార్చేది.

కేవలం 2,500 టికెట్ ఖర్చుతో వైష్ణోదేవి యాత్ర పూర్తి

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

అయితే ఆ పుట్ట లోపల శివలింగం ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. ఈ శివలింగాన్ని పాలతో అభిషేకించడం కోసమే ఆవు పాలను ధారగా అందించేది. ఈ ఆవుకు ఒక చిన్న లేగదూడ కూడా ఉండేది.

బ్లాక్ అండ్ వైట్ లో బెంగళూరుబ్లాక్ అండ్ వైట్ లో బెంగళూరు

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

ఆ లేగదూడ పేరు పట్టి. ఈ పట్టి కూడా తన తల్లి నిత్యం వెళ్లే ప్రదేశానికి వెళ్లి పుట్ట దగ్గర నిల్చొనేది. ఆవు పుట్ట పై నిలబడి పాలను ధారగా అందించే సమయంలో ఈ లేగదూడ చుట్ట పక్కల ఆటలాడేది.

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

ఈ చిన్నలేగదూడ ఈ విధంగా ఆటలాడుతూ ఉంటే ఒకసారి ఆ పుట్ట పై అనుకోకుండా కాలుపెడుతుంది. దీంతో ఆ పుట్ట కొంత భాగం కుంగిపోతుంది. అదే సమయంలో పుట్ట దిగ్గర నిలబడిన ఆవు కాలు కూడా కుంగిపోయి పుట్టలోపల ఉన్న శివలింగం పై పడుతుంది.

ఇక్కడ ప్రార్థించిన 24 గంటల్లోపు వర్షం వస్తుందిఇక్కడ ప్రార్థించిన 24 గంటల్లోపు వర్షం వస్తుంది

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

ఆ ఆవుగిట్టను మనం శివలింగ పై ఇప్పటికీ చూడవచ్చు. జరిగిన తప్పు తెలుసుకొన్న ఆవు శివుడిని మన్నించమని వేడుకొంటూ ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమవుతుంది.

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

దీంతో వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి ఆవును వారిస్తాడు. అంతే కాకుండా ఆవుకు తపస్సు చేయాలని చూసిస్తారు. ఆవు తపస్సు చేసిన ప్రదేశం మోక్షస్థలంగానే కాకుండా ప్రముఖ శైవ క్షేత్రంగా కూడా మారుతుందని చెబుతారు.

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

అంతేకాకుండా ఇక్కడ తాను ప్రత్యక్షమవ్వడానికి ప్రధాన కారణం పట్టి అనే లేగదూడ కాబట్టి ఆ పట్టీ పేరుతోనే ఈ ప్రాంతం పట్టీశ్వరంగా ప్రాచూర్యం చెందుతుందని చెబుతాడు. అలా ఈ పట్టీశ్వరం ప్రముఖ శైవ క్షేత్రంగా మారిపోయింది.

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

ఇక ఈ దేవాలయంలో శివుడు నర్తించే భంగిమలో అదే విధంగా పార్వతీదేవి పచైనాయకి పేరుతో ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారిని సందర్శించుకొన్నవారికి తప్పక మోక్షం లభిస్తుందని చెబుతారు.

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

అందువల్లే ఒక్క తమిళనాడు నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రంలో జరిగే విషయాలకు సైన్సు కూడా కారణాలు కనిపెట్టలేకపోయింది.

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయ ప్రాంగణంలోని పేడలో ఎన్ని రోజులైనా కూడా పురుగులు చేరకపోవడం విశేషం. ఈ దేవాలయంలోని మరో విషయం ఇక్కడ ఉన్నటువంటి చింత చెట్టు. ఈ చింత చెట్టు కాయలకు ఉన్న గింజలను ఎక్కడ నాటినా కూడా మొలకెత్తవు.

పరూరు పట్టీశ్వరం దేవాలయం

పరూరు పట్టీశ్వరం దేవాలయం

P.C: You Tube

ఇందుకు గల కారణాలను ఇప్పటివరకూ ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ శివాలయంలో శివుడు నర్తించే స్థితిలో ఉండటం వల్ల చిదంబరంలోని దేవాలయం తర్వాత ఎక్కువ మంది భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. ఏడాదిలో ఒక వారం పాటు ఇక్కడ శాస్త్రీయ న`త్యోత్సవ వేడుకలు జరుగుతాయి.

రవన్‌గ్లా పర్యాటకం జీవితంలో మరిచిపోలేరురవన్‌గ్లా పర్యాటకం జీవితంలో మరిచిపోలేరు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X