Search
  • Follow NativePlanet
Share
» »పూతరేకులు, మామిడితాండ్ర .. మన తీయని ఆత్రేయపురం !!

పూతరేకులు, మామిడితాండ్ర .. మన తీయని ఆత్రేయపురం !!

By Super Admin

పూతరేకులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక మిఠాయి. పూతరేకులు చేయటం ఒక కళ. అటువంటి కళను అందిపుచ్చుకున్న తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం గురించి, అక్కడ ఉన్న ప్రధాన ఆకర్షణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం !!

ఆత్రేయపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ఊరు. ఈ ఊరు రావులపాలెం మార్గ మధ్యలో వస్తుంది. ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవు. తరచుగా సినిమా చిత్రీకరణలు జరుగుతుంటాయి.

పూరి జగన్నాధ స్వామి ఆలయంలోని మిస్టరీలు ఏంటో మీకు తెలుసా ?పూరి జగన్నాధ స్వామి ఆలయంలోని మిస్టరీలు ఏంటో మీకు తెలుసా ?

యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండలు !యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండలు !

గ్రామ చరిత్ర

అత్రి మహాముని పీరుమీద ఆత్రేయపురమయింది. సీతారాములు ఇక్కడ వనవాస సమయంలో నివసించారు. ధర్మపీఠంగ పిలువబడుతున్న రావిచెట్టు క్రింద సీతారాములు ముచ్చట్లు చెప్పుకునేవారని భావించేవారు. అసత్య ప్రమాణము చేసినవారు ఈ చెట్టువద్ద క్షమాపణవేడుకుంటారు. చెట్టు వెనుక భాగంలో శివకేశవులు ఆలయాలు ఉన్నాయి.

ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' !ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' !

పూతరేకుల విశిష్టత

పూతరేకుల విశిష్టత

ఇక్కడ పూతరేకు అనే స్వీట్ బహు ప్రత్యేకం. పూతరేకులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధ మిఠాయి. కొన్నిప్రాంతాలలో వీటిని పోరచుట్టలు అని కూడా పిలుస్తారు. ఇది కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే పరిమితం.

విచిత్రమైన కహానీ

విచిత్రమైన కహానీ

పూతరేకులు పుట్టుకకు ఒక విచిత్రమైన కహానీ ఉంది. అదేమిటంటే ఒక వృద్ధురాలు వంట చేసే సమయంలో ఆమెకు కలిగిన ఊహకు రూపం పూతరేకు. తదనంతరం కాలానికి అనుగుణంగా మరింతగా మార్పు చెంది వివిధరకాలలో పూతరేకులు తయారుచేస్తున్నారు. ఒక్కో చోట పూతరేకులు టెస్ట్ ఒక్కో విధంగా ఉంటుంది. ఆత్రేయపురంలో మాత్రం దీని టెస్ట్ అమోఘం.

చిత్రకృప : Nagkumar 2

మట్టి కుండ

మట్టి కుండ

పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడుతారు. కుండ నున్నగా గుండ్రంగానూ ఉండేలా చూసుకొంటారు. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రం చేస్తారు. ఇడ్లీకి వాడే విధంగా మినప మరియు వరిపిండి మిశ్రమాన్ని పల్చగా జాలుగా వచ్చేలా చేసుకొని ఒకరోజు పాటు నిల్వ ఉంచుతారు. మరుసటి రోజు కుండకు ఉన్న రంధ్రం ద్వారా కట్టెలు పెట్టి, మంట పెట్టి కుండను వేడెక్కిస్తారు.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

 పేపర్ మందం

పేపర్ మందం

జాలుగా తయారుచేసుకుని సిద్ధంగా ఉంచుకున్న పిండిలో పల్చని గుడ్డను ముంచి, దానిని విప్పి వెడల్పుగా కుండపై ఒకవైపు నుండి మరొక వైపుగా లాగుతారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరలా ఒక పేపర్ మందంతో ఊడి వస్తుంది దానిని రేకుగా పిలుస్తారు.

చిత్రకృప : Balajijagadesh

సుగర్‌ఫ్రీ పూతరేకులను కూడా

సుగర్‌ఫ్రీ పూతరేకులను కూడా

ఈ రేకులో తీపిపదార్థాలను వేసి పొరలుపొరలుగా మడిచిపెట్టి పూతరేకులను తయారుచేస్తారు. ఈ తీపి పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. నెయ్యి, బెల్లం వేసి వేసి తయారుచెయ్యడం సంప్రదాయికంగా వస్తున్న పద్ధతి. అలాగే పంచదార పొడి వేసి కూడా తయారుచేస్తారు. జీడిపప్పు, బాదం పప్పు వేసి తయారుచెయ్యడం ఒక పద్ధతి. మధుమేహవ్యాధి ఉన్నవారికోసం సుగర్‌ఫ్రీ పూతరేకులను కూడా తయారుచేస్తున్నారు.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

సినిమాల్లో పూతరేకులు

సినిమాల్లో పూతరేకులు

బెండు అప్పారావు ఆరెంపీ సినిమాలో పూతరేకుల తయారీని క్లుప్తంగా చూపించారు ఛత్రపతి సినిమాలో మన్నేల తింటివిరా కృష్ణా అనే పాటలో ఆత్రేయపురం పూతరేకుల ప్రస్తావన వస్తుంది. అడపాదడగా (పండగ సమయాలలో) వీటి గురించి టీవీల్లో, న్యూస్ ఛానళ్లలో షో లు కూడా వేస్తుంటారు.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

మామిడితాండ్రకీ ప్రసిద్ధి

మామిడితాండ్రకీ ప్రసిద్ధి

ఆత్రేయపురం కేవలం పూతరేకులు తయారీకే ప్రసిద్ధి కాదు ... మామిడితాండ్రకీ ప్రసిద్ధి. మావిడితాండ వేసవికాలంలో తయారుచేస్తారు. పూతరేకులు సంవత్సరం పొడవునా తయారుచేస్తారు. ఈ రోజుకీ కేవలం పూతరేకుల కోసం ఆత్రేయపురానికి వెళ్ళేవారు ఉన్నారంటే నమ్మండి.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

వడపాలి వెంకన్న ఆలయం

వడపాలి వెంకన్న ఆలయం

ఆత్రేయపురంలో అతి పెద్ద ఆంజనేయ విగ్రహం కలదు. వడపల్లి లోని వెంకన్న స్వామి దేవాలయం చూడదగ్గది. అలాగే ఎనిమిది కోలోమీటర్ల దూరంలో ఉన్న ర్యాలీ గ్రామములో జగన్మోహినీ - కేశవ స్వామి ఆలయం కలదు.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

జగన్మోహినీ - కేశవ స్వామి ఆలయం

జగన్మోహినీ - కేశవ స్వామి ఆలయం

ఈ గుడిని ఘంటచోళ మహారాజు కట్టించినట్లు చెబుతారు. ఈ ఆలయాన్ని 'బదలీ ఆలయంగా' ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించినవారు తప్పకుండా తాము కోరుకున్న ప్రాంతానికి బదలీ అవుతారనే నమ్మకం ఆంధ్ర ప్రదేశ్ అంతటా వ్యాపించింది. మంత్రులు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు మాత్రం ర్యాలీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే తమ పదవులు పోతాయనే భయం అని ఇక్కడి పూజార్లు చమత్కరిస్తుంటారు.

చిత్రకృప : Msvamsi

ఆత్రేయపురానికి ఎలా వెళ్ళాలి ?

ఆత్రేయపురానికి ఎలా వెళ్ళాలి ?

కాకినాడ నుండి ఆత్రేయపురం 86 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 24 కిలోమీటర్లు. రాజమండ్రి నుండి, కాకినాడ నుండి రావులపాలెం వెళ్ళే బస్సులు ఎక్కితే ఆత్రేయపురం చేరుకోవచ్చు. కాకినాడ నుండి, రాజమండ్రి నుండి గంట గంట కు రావులపాలెం కు ప్రభుత్వ బస్సులు కలవు. వసతి సదుపాయాల కొరకు రాజమండ్రి సూచించదగినది. ఇక్కడే విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కూడా కలదు.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X