Search
  • Follow NativePlanet
Share
» »మలంపూజ - సుందర దృశ్యాలు, అత్యుత్తమ వినోదాలు !!

మలంపూజ - సుందర దృశ్యాలు, అత్యుత్తమ వినోదాలు !!

మలంపూజ పట్టణం దాని సుందర దృశ్యాలకు, ఆనకట్టలకు మరియు తోటలకు ప్రసిద్ధి. ఈ పట్టణం కేరళ లోని పాలక్కాడ్ జిల్లలో కలదు. ఈ పర్యాటక ప్రదేశం వేలాది పర్యాటకులను, ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తుంది.

By Mohammad

పర్యాటక ప్రదేశం : మలంపూజ

రాష్ట్రం : కేరళ

జిల్లా : పాలక్కాడ్

ప్రధాన ఆకర్షణలు : ఉద్యానవనాలు, ఆనకట్టలు, సుందర దృశ్యాలు మరియు యక్షి విగ్రహం

మలంపూజ పట్టణం దాని సుందర దృశ్యాలకు, ఆనకట్టలకు మరియు తోటలకు ప్రసిద్ధి. ఈ పట్టణం కేరళ లోని పాలక్కాడ్ జిల్లలో కలదు. పాలక్కాడ్ జిల్లాని 'కేరళ రాష్ట్ర అన్నపూర్ణ' గా చెపుతారు. ఈ పర్యాటక ప్రదేశం వేలాది పర్యాటకులను, ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తుంది. కేరళ లో మలంపూజ డాం అతి పెద్ద డాం గా పేరుపడింది. పాలక్కాడ్ పట్టణానికి 10 కి.మీ. ల దూరం లో కల మలంపూజ పర్యాటకులకు అనేక వినోద ప్రదేశాలను అందిస్తుంది. ఈ ప్రదేశంలో ప్రకృతి అందాలు మరియు మానవ నైపున్యతలు రెండూ కలసి దానిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

ఇది కూడా చదవండి : పాలక్కాడ్ - అత్యుత్తమ ఆకర్షణ ప్రదేశాలు !

అత్యుత్తమ వినోదాలు

మలంపూజ లోని అన్ని ఆకర్షనలలోను అధికంగా సందర్శిమ్చేది అక్కడ కల రిజర్వాయర్ . దీనిని మలంపూజ నది పైకట్టారు. డాం సైట్ నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఫాంటసీ పార్క్ అనే అమ్యూజ్మెంట్ పార్క్ కలదు. ఇక్కడే ఇంకా, థ్రెడ్ గార్డెన్, స్నేక్ పార్క్, యక్షి విగ్రహం, రాక్ గార్డెన్, ఫాంటసీ పార్క్, ఉడాన్ ఖటోల మరియు తేన కురుస్సి మొదలైనవి కలవు. ఇంతేకాక పరంబికులం శంచురి , సైలెంట్ వాలీ నేషనల్ పార్క్, నేల్లింపతి, డీర పార్క్, పోతుంది రిసెర్ వోఇర్ మరియు ధోని ఫారెస్ట్ రిజర్వు వంటి ప్రదేశాలు కూడా చూడవచ్చు.

ఫాంటసీ పార్క్

ఫాంటసీ పార్క్

ఫాంటసీ పార్క్ మలంపూజ లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్. ఉత్తర కేరళ లో పర్యాటకులు అధికంగా చూసే ప్రదేశం. పాలక్కాడ్ టవున్ కు 10 కి.మీ. ల దూరంలో కల ఈ పార్క్ సుమారు 15 ఎకరాలలో విస్తరించి వుంది. ఒక రోజు పిక్నిక్ లకు, స్కూల్ పిల్లల సందర్శనలకు బాగుంటుంది.

చిత్రకృప : Asokants

మలంపూజా తోటలు

మలంపూజా తోటలు

మలంపూజ తోటలని కేరళ బృందావనం గా పిలుస్తారు. ఇవి రిసర్వాయర్ ప్రాంత సమీపం లో కలవు. ఈ ప్రాంతం లో ఒక వైపు ప్రకృతి మరో వైపు మానవ నిర్మిత డాం ఎంతో అందంగా కనిపిస్తాయి. వారాంతపు సెలవులలో తోటలకు సాయంకాలం 7గంటల నుండి 8 గంటల వరకు లైటింగ్ ఏ ర్పాట్లు చేస్తారు.

చిత్రకృప : കാക്കര

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్

మలంపూజ లో కల రాక్ గార్డెన్ కేరళ లో ఈ రకం వాటిలో మొదటిది. ఇండియా లో రెండవ గార్డెన్ రాక్. ఇది మలంపూజ డాం మరియు గార్డెన్ల కు సమీపంగా ఉంటుంది. దాని ప్రత్యేకతతో ఎంతో మందిని ఆకర్షిస్తోంది.

చిత్రకృప : Ranjithsiji

మలంపూజ డాం

మలంపూజ డాం

మలంపూజ డాం పాలక్కాడ్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇది కేరళలో అతి పెద్ద సాగునీటి రిజర్వాయర్. ఒక మేసోనేరి డాం, ఒక మట్టి డాం కలిగి , ఎన్నో కాలువలు కలిగి ఉంటుంది. డాం వెనుక భాగం లో కల కొండలతో నేపధ్యం ఎంతో అందంగా ఉంటుంది.

పాలక్కాడ్ పట్టణానికి సుమారు 10 కి.కమి. ల దూరం లో కల ఈ ప్రదేశానికి రోడ్డు మార్గం లో తేలికగా చేరవచ్చు.

చిత్రకృప : Joseph Lazer

థ్రెడ్ గార్డెన్

థ్రెడ్ గార్డెన్

మలంపూజ లోని ఈ గార్డెన్ కు లక్షలాది పర్యాటకులు వస్తారు. ఇది ఒక విశిష్ట మైనది గాను మరియు అసాధరణమైనది గాను ఉంటుంది. దీనిలో ఇతర తోటలవలేనే పూవులు మొక్కలు వుంటాయి. కాని అవన్నీ కూడా దారం తో తయారు చేయబడి వుంటాయి.

చిత్రకృప : Ranjithsiji

ఉడాన్ ఖటోల

ఉడాన్ ఖటోల

ఉడాన్ ఖటోల అంటే ఇది ఒక పర్యాటకుల రోప్ వే. దీనిని మలంపూజ గార్డెన్ల లో పెట్టారు. మలంపూజ లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. సౌత్ ఇండియా లో ఇది మొదటి రోప్ వే గా కేరళకి వచ్చే పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది. ఈ రోప్ వేని గార్డెన్ లో సుమారు 60 అడుగుల ఎత్తు లో నిర్మించారు. సుమారు 625 మీ.ల దూరం నడుస్తుంది. ఈ రోప్ వే అక్కడి పర్వతాలలోను మరియు తోటల లోనుఎంతో ఆనందం కలిగిస్తుంది.

చిత్రకృప : Ranjithsiji

స్నేక్ పార్క్

స్నేక్ పార్క్

వివిధ రకాల సరీనృపాలు కలిగిన ఈ స్నేక్ పార్క్ మలంపూజ డాం మరియు మలంపూజ గార్డెన్ ల సమీపం లో కలదు. ఎన్నో రకాల పాములు ఉంటాయి. సంవత్సరం అంతా ఈ పార్క్ విజిటర్లను ఆకర్షిస్తూనే ఉంటుంది. అటవీ శాఖ నిర్వహించే ఈ పార్క్ లో విషపు పాములు మరియు విషం లేనివి కూడా వుంటాయి.

చిత్రకృప : Ranjithsiji

తెన్ కురుస్సి

తెన్ కురుస్సి

తెన్ కురుస్సి గ్రామం దాని సహజ అందాలకు మరియు వారసత్వ కట్టడాలకు ప్రసిద్ధి గాంచింది. ఇది పాలక్కాడ్ కు సుమారు 10 కి.మీ. దూరంలో కలదు. ఈ ప్రదేశానికి రోడ్డు మార్గం అనుకూలం. పాలక్కాడ్ పట్టణం నుండి తరచుగా బస్సులు కలవు. కొద్దిసేపు ప్రయాణం మాత్రేమే. తెన్ కురిస్సి నుండి ఒక గంట ప్రయాణించి నారింజ తోటలు కల నేల్లియంపతి ప్రదేశాన్ని కూడా చూడవచ్చు.

చిత్రకృప : കാക്കര

యక్షి విగ్రహం

యక్షి విగ్రహం

ఈ విగ్రహాన్ని కేరళ కళా ప్రియుల పనితనానికి ఒక మంచి ఉదాహరణగా చెపుతారు. ఈ విగ్రహం మలంపూజ గార్డెన్ ల లో ఉంది, ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులను ఆకర్షిస్తోంది. పర్వత శ్రేణులు, మరియు పచ్చటి తోటలు నేపధ్యం గా గల ఈ విగ్రహం పర్యాటకుల కన్నుల విందుగా వుంటుంది. విగ్రహాన్ని దర్శించేందుకు ఒకే సారి డాం సైట్ మరియు గార్డెన్ల తో పాటు వెళ్ళవచ్చు.

చిత్రకృప : Ranjithsiji

మలంపూజా ఎలా చేరుకోవాలి ?

మలంపూజా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 55 కి. మీ ల దూరంలో కోయంబత్తూర్ విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో మలంపూజా చేరుకోవచ్చు.

రైలు మార్గం : పాలక్కాడ్ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. అక్కడ దిగి టాక్సీ లేదా బస్సులలో మలంపూజా చేరుకోవచ్చు.

రోడ్డు / బస్సు మార్గం : కేరళ మరియు తమిళనాడు ప్రాంతాల నుంచి మలంపూజా కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్రకృప : Ranjithsiji

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X