
ఇప్పటి యువతీ, యువకులు పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. బ్యాచిలర్ పార్టీ అంటే అందులో చాలా ఉంటాయి. మందు, మగువ, డిస్కో ఇలాంటివి చాలానే ఉంటాయి. అయితే ఈ బ్యాచిలర్ పార్టీ సమయంలో ఎక్కడికి వెళ్లాలి, ఏ ఏ ప్రాంతాలను ఎంపికచేసుకోవాలన్నది చాలా కన్ఫూజన్.

గోవా ఈజ్ బెస్ట్
P.C: You Tube
అందువల్లే గోవాలో పార్టీ చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతారు. గోవాలో మీరు పార్టీ చేసుకోవాలనుకొంటే అప్పుడు ఈ ఆప్షన్స్‌ను పరిశీలించండి. మీ బ్యాచిలర్ పార్టీ జీవితాంతం గుర్తుండిపోతుంది.

చాలా రెస్టోరెంట్లు
P.C: You Tube
గోవాలో ఉండటానికి చాలా విల్లాలు, బంగ్లాలు, రెస్టోరెంట్లు ఉన్నాయి. నీవు మీ స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ మీకు ప్రేవసీ కావాలంటే ప్రైవేటు ఇళ్లు కూడా అద్దెకు ఇచ్చే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి.

జలక్రీడలు
P.C: You Tube
గోవాలో వాటర్‌స్పోర్ట్స్ చాలా ఫేమస్. ఇక్కడ అనేక రకాలైన జలక్రీడలను మీరు ఎంజాయ్ చేయవచ్చు.. అందులో మీరు స్కూబా డైవింగ్, కయాకింగ్, సేలింగ్, జెట్ సేలింగ్, బనానా రైడ్ తదితర జలక్రీడలు అందుబాటులో ఉన్నాయి. ఈ జలక్రీడలతో పాటు కొన్ని సంస్థలు అన్లిమిటెడ్ బీర్, లంచ్‌ను కూడా ఆఫర్ చేస్తాయి.

క్రూజ్ పార్టీ
P.C: You Tube
మీ బ్యాచులర్ పార్టీ మరింత బాగుండాలని భావిస్తూ ఉంటే క్రూజ్ పార్టీని మిస్ చేసుకోకండి. ఈ పార్టీ మీకు మీ స్నేహితులకు జీవితాంతం గుర్తుకు ఉంటుంది. గోవాలో అత్యంత బెస్ట్ పార్టీ క్రూజ్ పార్టీ అనే చెప్పవచ్చు..