Search
  • Follow NativePlanet
Share
» »ఆర్థిక కష్టాలన్నీ తీర్చే శయనించిన స్థితిలోని హనుమ

ఆర్థిక కష్టాలన్నీ తీర్చే శయనించిన స్థితిలోని హనుమ

ఆర్థిక కష్టాలన్నీ తీర్చే శయనించిన స్థితిలోని బడే హనుమాన్ జీకు సంబంధించిన కథనం.

By Kishore

మన కష్టాలన్నీ తీర్చే ప్రత్యక్షదైవంగా భావించి హనుమంతుడిని ప్రతి ఒక్కరూ కొలుస్తుంటారు. అందుకే భారత దేశంలో ఆంజనేయుడి విగ్రహం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ 'చిరంజీవి' ఇప్పటికీ జీవించి ఉన్నాడని హిందూ పురాణాలు ఘోషిస్తున్నాయి. భక్తులు కూడా అదే విషయాన్ని నమ్ముతారు. ఇక భారత దేశంలో ప్రతి గ్రామంలో ఉన్న హనుమంతుడి విగ్రహాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. అయితే ఇకటి రెండు చోట్ల మాత్రమే ఆ హనుమంతుడి విగ్రహం మనకు విభిన్న రూపాల్లో కనిపిస్తుంది. ఇదే కోవకు చెందిన పరమ పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద ఉన్న బడే హనుమాన్ జీ విగ్రహం. దాదాపు 20 అడుగుల పొడువు ఉన్న ఈ విగ్రహం శయనించిన స్థితిలో కనిపిస్తుంది. దీని వెనుక పురాణ కథనం ఉంది. ఇలా శయనించిన స్థితిలో హనుమంతుని విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఈ విగ్రహాన్ని దర్శించుకొంటే కోరుకొన్న కోర్కెలన్నీ తీరుతాయని ప్రజలు నమ్ముతారు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం...

ఆ 'పులి' నిర్మించిన నక్షత్రాకార కోట ఎక్కడుందో తెలుసాఆ 'పులి' నిర్మించిన నక్షత్రాకార కోట ఎక్కడుందో తెలుసా

1. ఎక్కడ ఉంది ఈ దేవాలయం

1. ఎక్కడ ఉంది ఈ దేవాలయం

Image Source:

ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో హనుమంతుని ఈ అనుమంతుని దేవస్థానం ఉంది. ఈ దేవాలయాన్ని బడే హనుమాన్ మందిర్ పేరుతో భక్తులు పిలుస్తుంటారు. ఈ దేవాలయం హిందువులకు ఒక పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ దేవాలయానికి వచ్చి తమ కోరికలను తీర్చవలిసిందిగా వేడుకుంటూ ఉంటారు.

2. శయనించిన స్థితిలో

2. శయనించిన స్థితిలో

Image Source:

ఇక్కడి హనుమంతుడి విగ్రహం శయనించిన స్థితిలో కనిపిస్తుంది. భారత దేశంలో మరెక్కడా ఇటువంటి విగ్రహాన్ని మనం చూడలేము. ఈ విగ్రహం ఎత్తు దాదాపు 20 అడుగులు ఉంటుంది. ఇక్కడ గంగానది హనుమంతుడి విగ్రహం పాదాన్ని తాకుతూ వెలుతున్న దృశ్యం చూడటానికి చాలా మనోహరంగా ఉంటుంది.

3. ఎందుకు ఈ స్థితిలో...

3. ఎందుకు ఈ స్థితిలో...

Image Source:

పురాణాల ప్రకారం రామరావణ యుద్ధంలో హనుమంతుడు చాలా అలసి పోతాడు. యుద్ధం ముగిసిన అనంతరం శ్రీరాముడి అనుమతితో కొద్ది సేపు ఇక్కడ శయనించినట్లు చెబుతారు. అందువల్లే ఇక్కడ హనుమంతుడు పడుకొన్న స్థితిలో మనకు కనిపిస్తాడని ఆలయ పూజారులతో పాటు స్థానికులు చెబుతారు.

4. మొదట సీత

4. మొదట సీత

Image Source:

ఇక్కడ ఆదమరిచి నిద్రపోతున్న హనుమంతుడికి మొదట సీతా దేవి కుంకుమ లేపనాన్ని పూసిందని చెబుతారు. ఆ సంప్రదాయం అప్పటి నుంచి ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతూనే ఉందని చెబుతారు. అందువల్లే ఇక్కడకు వచ్చినవారు హనుమంతునికి కుంకుమ లేపనాన్ని రాసి తమ కోరికలను తీర్చమని భక్తితో ప్రార్థిస్తుంటారు.

5. ఎప్పుడు సరైన సమయం

5. ఎప్పుడు సరైన సమయం

Image Source:

గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం అలహాబాద్ అన్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రం. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో అలహాబాద్ ను చూడటానికి బాగుంటుంది. అందువల్లే ఈ మందిరానికి కూడా అదే సమయంలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X