Search
  • Follow NativePlanet
Share
» »బాహుబలి 2 షూటింగ్ ప్రదేశాలు !!

బాహుబలి 2 షూటింగ్ ప్రదేశాలు !!

అరేబియా సముద్రం తో సరిహద్దు పంచుకుంటున్న కన్నూర్ విశిష్ట వారసత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు, సహజ అందాలకు ప్రసిద్ధి చెందినది.

By Mohammad

టాలీవూడ్ లో సంచలన విజయ సాధించిన బాహుబలి అందరికి తెలిసే ఉంటుంది. పార్ట్ - 1 సినిమా తర్వాత ఇప్పుడు అందరూ పార్ట్ - 2 కోసం ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'బాహుబలి-2' జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా కేరళలో షూటింగ్ జరుపుకుంటున్నది. కేరళలోని ప్రాచీన కోటలో ఈ షూటింగ్‌ను చేస్తున్నారు. ప్రభాస్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 'బాహుబలి' మొదటిభాగం సంచలన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంతకుమించి రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఫిలిమ్‌సిటీలో ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం కేరళలోని కున్నార్‌ ఫోర్ట్ లో జరుగుతోంది. జనవరి చివరి వరకు అక్కడ షెడ్యూల్ జరగనుంది.

కన్నూర్ లో టాలీవూడ్ లో తీసిన సినిమాలు : సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం మొదలగునవి.

కేన్నోర్ అని అంగ్లీకరించబడిన కన్నూర్, గొప్ప వారసత్వానికి, శక్తివంతమైన ప్రసిద్ధికి ప్రాచుర్యం పొందింది. ఇది కేరళ లో ని ఉత్తరం లో ఉన్న జిల్లా. పశ్చిమ కనుమలు మరియు అరేబియన్ సి తో సరిహద్దును పంచుకుంటున్న ఈ ప్రాంతం, సంస్కృతీ సంప్రదాయాలను మరియు సంవృద్దిగా ఉన్న సహజమైన ప్రకృతి సౌందర్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాచీన కాలం లో మలబార్ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక, సాంప్రదాయ మరియు వాణిజ్య కేంద్రాలుగా ఈ జిల్లా వ్యవహరించేది.

ఇది కూడా చదవండి : ఇండియాలో మొదటి ఎకో టూరిజం - తేన్మల !!

విశ్రాంతికి, ఆహ్లాదానికి అనువైన విస్తరించబడిన ఇసుక తీరంతో ఇక్కడి బీచ్ లు పర్యాటకులు తప్పక చూడాలనుకునే సందర్శన ప్రదేశాలు. పయ్యమ్బలం బీచ్, మీన్కున్ను బీచ్, కిజ్హున్న ఎజ్హర బీచ్ మరియు ముజ్హుప్పిలన్గడ్ బీచ్ లు ఈ ప్రాంతంలో ప్రాచుర్యం పొందినవి.

కన్నూర్ ఫోర్ట్ మాత్రమే కాదు ఇక్కడ చూడవలసినవి, చేయవలసినవి అనేకం ఉన్నాయి. వాటి వివరాలలోకి వెళితే ..

తాలిపరంబ

తాలిపరంబ

సర్పిలాకార కొండలను చుట్టూ కలిగిన తాలిపరంబ కన్నూర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. శ్రీ రాజరాజేశ్వర ఆలయం, త్రి చాంబరాం ఆలయం, ముతప్పాన్ ఆలయం లు ఇక్కడి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు.

చిత్ర కృప : Shareef Taliparamba

సుందరేశ్వర ఆలయం

సుందరేశ్వర ఆలయం

సుందరేశ్వర ఆలయం కన్నూర్ పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ మహా శివుడు, సుందరేశ్వర స్వామి రూపంలో కొలువై ఉంటాడు. ఏప్రిల్ - మే నెలల మధ్యలో ఉత్సవాలు సుమారు ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు.

సమీపంలో చూడవలసిన ఇతర దేవాలయాలు : శ్రీ మావిలయిక్కవు ఆలయం - 15కి.మీ., శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం, శ్రీ రాఘవాపురం ఆలయం - 35 కి. మీ, పల్లిక్కున్ను మూకాంబికా ఆలయం - 3 కి. మీ., ఊర్పజ్హస్సి కావు టెంపుల్, కిజ్హక్కేకర ఆలయం - 7 కి.మీ.

చిత్ర కృప : Shareef Taliparamba

పప్పినిస్సేరి

పప్పినిస్సేరి

కన్నూర్ నుండి కేవలం 10 కి.మీ. దూరంలో ఉన్న పప్పినిస్సేరి అను చిన్న గ్రామం ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలకి, ఆలయాలకి ప్రసిద్ది. బలియపటం నది, చుట్టు పక్కల చిన్న పర్వతాలు ఈ గ్రామాన్ని సందర్శించే పర్యాటకులకి కనువిందుచేస్తాయి. పంపురుతి (నది లో ఉన్న అందమైన ప్రదేశం), వాదేశ్వరం హిల్ (కేరళ కైలసంగా స్థానికంగా ప్రసిద్ది) పప్పినిస్సేరి లో ఉన్న ప్రధాన ఆకర్షణలు.

చిత్ర కృప : Rakesh S

కొట్టియూర్ శివ ఆలయం

కొట్టియూర్ శివ ఆలయం

దక్షిణ కాశీ గా పిలువబడే కొట్టియూర్ శివాలయం, కన్నూర్ సమీపంలోని కొట్టియూర్ గ్రామంలో కలదు. మే - జూన్ మాసాల మధ్యన జరిగే వైశాఖ పండుగ ని ఈ ఆలయంలో ప్రధానంగా జరుపుతారు. కొబ్బరికాయ లని కొట్టి, ఆ నీళ్ళతో స్వామి వారిని అభిషేకించటం ఈ పండుగ ప్రత్యేకత.

చిత్ర కృప : Vijayanrajapuram

చేరుకున్ను

చేరుకున్ను

కన్నూర్ పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న చిన్న ఆధ్యాత్మిక గ్రామం చేరుకున్ను. అన్నపూర్ణేశ్వరి టెంపుల్, చేరుకున్నిలమ్మ ఆలయం, చిన్న చిన్న ద్వీపాలు, తావం చర్చి, ఒలియంకర జూమా మసీదు లు ఇతర ఆకర్షణ లుగా ఉన్నాయి.

చిత్ర కృప : Prof. Mohamed Shareef

ప్యాథల్ మల

ప్యాథల్ మల

ప్యాథల్ మల కన్నూర్ పట్టణానికి 60 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్నది. ప్రకృతి ప్రేమికులకు, వన్య మృగ ప్రేమికులకు ఈ ప్రదేశం ఎంతగానో ఆకర్షిస్తున్నది. ట్రెక్కింగ్ చేయటానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. దారి పొడవునా ఫోటో లతో ఇక్కడి దృశ్యాలను తీసి ఆనందించవచ్చు.

చిత్ర కృప : Rawbin

పరిస్సినిక్కడవు స్నేక్ పార్క్

పరిస్సినిక్కడవు స్నేక్ పార్క్

భారతదేశంలో సరీశృపాలను పరిరక్షించే అతి ముఖ్యమైన కేంద్రాలలో పరిస్సినిక్కడవు స్నేక్ పార్క్ ఒకటి. కేరళ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఏకైక స్నేక్ పార్క్ కూడా ఇదే ..! కన్నూర్ కు 16 కి. మీ. దూరంలో ఉన్న పరిస్సినిక్కడవు అనే గ్రామంలో ఈ పార్క్ ఉన్నది. పరిస్సిని క్కడవు ముతప్పాన్ ఆలయం ఇక్కడి మరొక ప్రధాన ఆకర్షణ.

చిత్ర కృప : Navaneeth Krishnan S

ఎజ్హిమల

ఎజ్హిమల

ఎజ్హిమల పచ్చని ప్రదేశాలతో, 290 మీటర్ల ఎత్తున ఉండి పర్యాటకులని విశేషం గా ఆకర్షిస్తున్నది. ఇక్కడి ముఖ్య ఆకర్షణలలో హనుమంతుడి గుడి మరియు మౌంట్ డెలి లైట్ హౌస్. ఇది కన్నూర్ నుంచి 55 కిలోమీటర్ల దూరం లో ఉన్నది.

చిత్ర కృప : Sreelalpp

కన్నూర్ కోట

కన్నూర్ కోట

కన్నూర్ కోట, కన్నూర్ పట్టణం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ అనేక సినిమా షూటింగ్ లు రెగ్యులర్ గా జరుగుతుంటాయి. బాహుబలి - 2 షూటింగ్ జరుగుతోంది. బ్రహ్మోత్సవం మరియు సర్దార్ గబ్బర్ సింగ్ లు చిత్రీకరణ లు జరిగాయి. ఇది పోర్చుగీసు వారు ఇండియాలో కట్టిన తొట్టతొలి కోట.

చిత్ర కృప : Vinayaraj

ముజుప్పిలన్గడ్ బీచ్

ముజుప్పిలన్గడ్ బీచ్

పర్యాటకులు కన్నూర్ కు 16 కి. మీ. దూరంలో ఉన్న ముజుప్పిలన్గడ్ బీచ్ తీరం పొడవున నడుస్తూ అద్భుతమైన బీచ్ అందాలను ఆస్వాదించవచ్చు. ఏప్రిల్ లో జరిగే బీచ్ పండుగలో ఈ ప్రాంతం అంతా యువతరంతో సాహస విన్యాసాల ప్రేమికులతో నిండిపోతుంది.

సమీపంలో చూడవలసిన ఇతర బీచ్ లు : పయ్యమ్బలమ్ బీచ్ - 2 కి. మీ., కిజ్హున్న ఎజ్హర బీచ్ - 12 కి.మీ., మీన్కున్ను బీచ్ - 10 కి. మీ.,

చిత్ర కృప : Nisheedh

అరక్కల్ కెట్టు

అరక్కల్ కెట్టు

కన్నూర్ కు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కల్ కెట్టు ఇదివరకు రాజుల నివాస స్థలం గా (ప్యాలెస్) ఉండేది ప్రస్తుతం మ్యూజియం గా మార్చబడినది. ఈ ప్యాలెస్ లో కోర్ట్ యార్డ్, వరండాలు, దర్బార్ హాల్స్, చెక్క నేలలు, రంగు రంగుల అద్దాల కిటికీలు కనువిందు చేస్తాయి.

సమీపంలో చూడవలసిన ఇతర ప్రదేశాలు : గుండెర్ట్ బంగ్లా - 20 కి. మీ., తెల్లిచెర్రి ఫోర్ట్, హోలీ ట్రినిటీ కేథడ్రాల్

చిత్ర కృప : ജസ്റ്റിൻ

అరలమ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

అరలమ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

అరలమ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ పశ్చిమ కనుమల లోయల్లో, కన్నూర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో జంతువులకి స్థావరంగా ఉన్నది. ఈ ఫారెస్ట్ లో కూడా బాహుబలి -2 షాట్ లు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ 1145 మీటర్ల ఎత్తున ఉన్నకట్టిబెట్ట శిఖరం వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ ని సందర్శించటానికి అనువైన సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.

చిత్ర కృప : Manojk

ధర్మదమ్ ఐలాండ్

ధర్మదమ్ ఐలాండ్

ధర్మదమ్ అనే ప్రదేశం నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న చిన్న ద్వీపమే ఈ ధర్మదమ్ ఐలాండ్. ఈ ద్వీపం ముజ్హుప్పిలన్గడ్ బీచ్ నుండి కనబడుతూ వీక్షకులను మురిపిస్తుంది. పర్యాటకులు అలల తాకిడి తక్కువగా ఉన్న సమయంలో ఈ బీచ్ నుండి ద్వీపానికి నడిచి వెళ్ళవచ్చు.

చిత్ర కృప : Drajay1976

పజ్హస్సి డ్యాము

పజ్హస్సి డ్యాము

కన్నూర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పజ్హస్సి డ్యాము ప్రఖ్యాత పర్యాటక మజిలి. ఇక్కడి వినోద కార్యక్రమాలతో , అందాలతో ఈ డ్యాము పర్యాటకులను ఆకర్షిస్తుంది. పజ్హస్సి రాజ విగ్రహం, బుద్ధ పర్వతం, బోటింగ్ ఇక్కడి ముఖ్య ఆకర్షణలు.

చిత్ర కృప : Vinayaraj

కన్నూర్ ఎలా చేరుకోవాలి ?

కన్నూర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

కన్నూర్ కు 121 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలికాట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గాని, 142 కి. మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయంలో కానీ దిగి క్యాబ్ లేదా ట్యాక్సీ ల ను అద్దెకు తీసుకొని కన్నూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

కన్నూర్ నగరానికి నడిబొడ్డున రైల్వే స్టేషన్ ఉన్నది. బెంగళూరు, తిరువనంతపురం, న్యూఢిల్లీ, చెన్నై, ముంబై వంటి నగరాలకు ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించవచ్చు. నగరంలో వెళ్ళటానికి ఆటో రిక్షాల సదుపాయం, ట్యాక్సీ మరియు సిటీ బస్సుల సదుపాయం కలదు.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం ద్వారా కన్నూర్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటుగా , దేశంలోని ప్రధాన నగరాలకు చక్కగా అనుసంధానమై ఉన్నది. తిరువనంతపురం, తలసెరి, కొచ్చి, కాలికాట్, మున్నార్, మంగళూరు నుండి తరచూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి.

చిత్ర కృప : Anoopan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X