Search
  • Follow NativePlanet
Share
» »హంపిలో మొట్టమొదటి టెంపుల్: ముద్దులొలికే మోముతో ఉన్న చిన్నిబాలకృష్ణుడు

హంపిలో మొట్టమొదటి టెంపుల్: ముద్దులొలికే మోముతో ఉన్న చిన్నిబాలకృష్ణుడు

శ్రీ ‌మ‌హావిష్ణువు అవతారాల్లో ఒకటి శ్రీకృష్ణ అవతారం. హిందూ పురాణాలతో పాటు, అనేక గ్రంథాలు, కథల్లో శ్రీకృష్ణుని గురించి అనేక విధాలుగా చెప్పారు. శ్రీకృష్ణుడు మహాభారతంలో పాండవుల పక్షాన నిలిచి ధర్మాన్ని

శ్రీ ‌మ‌హావిష్ణువు అవతారాల్లో ఒకటి శ్రీకృష్ణ అవతారం. హిందూ పురాణాలతో పాటు, అనేక గ్రంథాలు, కథల్లో శ్రీకృష్ణుని గురించి అనేక విధాలుగా చెప్పారు. శ్రీకృష్ణుడు మహాభారతంలో పాండవుల పక్షాన నిలిచి ధర్మాన్ని గెలిపించాడు. అదే విధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకను ఏలాడు. చిన్ని కృష్ణుడు చేసిన చిలిపి బాలుని లీలలు, పశువుల కాపరిగా, గోపికలకు ప్రాణనాథుడిగా, యాదవ రాజుగా అనేక విధాలుగా శ్రీకృష్ణున్ని వర్ణించారు. అయితే ఎలా చెప్పినా శ్రీకృష్ణున్ని గొప్ప దైవంగా భావించి భక్తులు పూజలు చేస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణుడికి అనేక దేవాలయాలున్నాయి. మన భారతదేశంలో కూడా కృష్ణదేవాయాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటకలోని హంపిలో ఉన్న శ్రీ కృష్ణ దేవాలయం అతి పురాతనమైన ఒక ప్రముఖ చారిత్రక దేవాలయం . ఈ ఆలయంను 15వ శతాబద్దంలో శ్రీ కృష్ణదేవరాయ నిర్మించారు. ఈ దేవాలయం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..

హంపి పేరు వినగానే

హంపి పేరు వినగానే

హంపి పేరు వినగానే మనకు మొదట విరూపాక్షా ఆలయమే గుర్తుకువస్తుంది. అయితే, హంపీలో విరూపాక్షా ఆలయంతో బాటు బాలకృష్ణుడి గుడి కూడా ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యాఅధిపతి శ్రీకృష్ణ దేవరాయలు యుద్ధంలో సాధించిన ఘనవిజయానికి ప్రతీకగా స్వయంగా దగ్గరుండి మరీ ఎంతో శ్రద్ధాభక్తితో కట్టించాడని ప్రతీతి.

P.C: You Tube

 హంపిలో ఉన్న ఈ కృష్ణ దేవాలయాన్ని చేరుకోవాలంటే

హంపిలో ఉన్న ఈ కృష్ణ దేవాలయాన్ని చేరుకోవాలంటే

హంపిలో ఉన్న ఈ కృష్ణ దేవాలయాన్ని చేరుకోవాలంటే కొంచెం కష్టమే అయినా ఒక్క సారి దేవాలయ ప్రాంగణం చేరుకోగానే అలసట అనేది కనిపించదు. ఎందుకంటే ఈ ఆలయ శిల్ప సంపద అలాంటిది మరి. ఒక్క సారి చూపు పడితే అలానే చూస్తూ ఉండిపోతారు. అంత అద్భుతంగా ఈ ఆలయం గోచరిస్తున్నది. యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది.

P.C: You Tube

ఈ దేవాలయంలోని శిల్పకలు

ఈ దేవాలయంలోని శిల్పకలు

ఈ దేవాలయంలోని శిల్పకలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము లాంటోడు అన్నట్లుగా ముద్దులొలికే మోముతో ఉంటాడు బాలకృష్ణుడు. దురదృష్టం ఏమిటంటే ఈ నగుమోమును మనం ఇప్పుడు ఈ గుడిలో సందర్శించుకోలేం. కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా వేడుకలు, ఉత్సవాలు జరుగుతాయి.

P.C: You Tube

ఈ ఆలయ భవనం పంచాయన శైలిలో

ఈ ఆలయ భవనం పంచాయన శైలిలో

ఈ ఆలయ భవనం పంచాయన శైలిలో రెండు ఆవరణాలతో ఏర్పాడు చేయబడింది. ఈ ఆలయంలోని ఎల్తైన ప్రాకారాలు, ఆ ప్రాకారాలపై అత్యద్భుతంగా మలచిన శిల్పాలు ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయం గోడలపై భగవత్ గీత వర్ణనలు అద్భుతంగా చూడవచ్చు. ఈ దేవాలయంలో అంతరాళం, అర్ధ లేదా ప్రదక్షిణ మంటపం, గర్భలాయం, ముక్తి మంటపము లేదా రంగ మంటపము అని నాలుగైదు విభాగాలుగా ఉన్నాయి. ఈ దేవాలయానికి తూర్పున ఉన్న మంటపమే రంగమంటపం. ఉన్నాయి.

P.C: You Tube

 ఒక్క సారి పర్యాటకులు లోపలికి ప్రవేశించగానే అందమైన

ఒక్క సారి పర్యాటకులు లోపలికి ప్రవేశించగానే అందమైన

ఒక్క సారి పర్యాటకులు లోపలికి ప్రవేశించగానే అందమైన కృత్రిమ శిల్పాలను చూడవచ్చు. అందంగా అలంకరిపంబడిన అపసారాల దృశ్యాన్ని చూడవచ్చు. అద్భుతమైన అత్యున్నతమైన ప్రాకారాలున్న ఈ రంగమంటపంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటారు. దక్షిణ దిక్కుగా అందమైన అరటి తోటకోసం పెద్ద మైదానమే ఉంది.ఇంకా ఎక్కువగా రాతి కట్టడాలు, శిల్పకళలు ప్రకృతి దృశ్యం. ఆ తర్వాత ఓ రాతి ఉద్యానం. వీటన్నింటినీ కలుపుతూ ఒక కొలను ఉంది.

P.C: You Tube

ఈ కొలనులో నీరుండక పోవడం వల్ల

ఈ కొలనులో నీరుండక పోవడం వల్ల

ఈ కొలనులో నీరుండక పోవడం వల్ల అది వాడుకలో లేదు. పశ్చిమ దిశగా వెళితే దీర్ఘచతురస్రాకారంలో ఒక భవంతి ఉంది. ఒకప్పుడు అది అతి పెద్ద ధాన్యాగారం నిల్వ ఉంచే గాదె ఉండేడి, దానికి ఆనుకుని సువిశాలమైన వంటశాల ఉండేది. చిత్రమేమిటంటే, ఈ భవంతి మహమ్మదీయ కట్టడాన్ని తలపిస్తుంది. దాని వెనకాలకు వెళితే ఇరుకుగా ఉండే మెట్లు. ఆ మెట్లెక్కితే ఆలయం పై భాగానికి చేరుకోవచ్చు. అక్కడ నిలబడి చూస్తే, అందమైన పకృతి దృశ్యాలను చూడవచ్చు.

P.C: You Tube

ఇక సభామంటపంలోనికి అడుగిడితే...

ఇక సభామంటపంలోనికి అడుగిడితే...

ఇక సభామంటపంలోనికి అడుగిడితే... అక్కడి లోపలి నాలుగు గోడలపైనా బాలకృష్ణుడు, హనుమంతుడు, కాళీయ మర్ధనం చేస్తున్న కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు దశావతారాల చిత్రాలు సజీవమా అన్నట్లు కనిపిస్తుంటాయి. దేవాలయంపై అతి పెద్ద రాయ గోపురాలున్నాయి. అంతరాలయం పైకప్పుపై సింహతలాటాలు, శిల్పాలు కనువిందు చేస్తుంటాయి.

P.C: You Tube

బాలకృష్ణాలయంలో బాలకృష్ణుడి విగ్రహం ఉండదు

బాలకృష్ణాలయంలో బాలకృష్ణుడి విగ్రహం ఉండదు

బాలకృష్ణాలయంలో బాలకృష్ణుడి విగ్రహం ఉండదు. ఒకప్పుడు ఉండేది కానీ, మహమ్మదీయుల దండయాత్రలలో నాశనం అవుతుందన్న ఉద్దేశంతో చిన్నికృష్ణుడి విగ్రహాన్ని తీసి వేరేచోట భద్రంపరిచారని చెబుతుంటారు, చెన్నైలోని నేషనల్ మ్యూజియంలో ఈ విగ్రం ఉన్నట్లు చెబుతారు. మరి శ్రీకృష్ణుడి విగ్రహం లేదు కదా, మరి అక్కడ చూడటానికి ఇంకేముందుని మీరు అనుకోవచ్చు? అయితే, ఈ పురాతన చారిత్రాత్మక ఆలయంలోని శిల్పసంపదను, దేవాలయం యొక్క నిర్మాణాన్ని తప్పక చూసి తీరాల్సిందే.

P.C: You Tube

బాలకృష్ణాలయంలోకి అడుగు పెట్టడానికి

బాలకృష్ణాలయంలోకి అడుగు పెట్టడానికి

బాలకృష్ణాలయంలోకి అడుగు పెట్టడానికి ఏ విధమైన ఫీజులు వసూలు చేయరు. ఆలయంలోపల కానీ, వెలుపల కానీ మనం ఎన్ని ఫొటోలైనా తీసుకోవచ్చు. ఎవరూ అభ్యంతర పెట్టరు.
అలాగే ఆ ఆలయం ఎదురుగా అతి పెద్ద కృష్ణా బజార్ ఉన్నది. పర్యాటకులను ఆకర్షించే వాటిలో ఇది ఒకటి.

P.C: You Tube

ఎలా వెళ్లాలంటే..?

ఎలా వెళ్లాలంటే..?

బెంగళూరు నుంచి హోస్పేటకు రెగ్యులర్ ఆర్టీసీ బస్సులున్నాయి. హోస్పేట నుండి హంపికి 12కిలోమీటర్ల దూరం. అలాగో రైళ్లు కూడా ఉన్నాయి. బెంగళూరు నుండి హోస్పేటకు రెగ్యులర్ గా ట్రైయిన్స్ ఉన్నాయి. తిరుపతి నుండి హోస్పేటకు జంక్షన్ కు కూడా ట్రైన్ ఫెసిలిటి ఉంది. ప్రయాణ సమయంలో 8 గంటలు-30 నిముషాలు-11గంటల 15నిముషాలు. 12 కిలోమీటర్ల దూరంలోని హంపీ చేరుకోవడానికి ప్రైవేటు ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

P.C: You Tube

హంపీలో చూడదగ్గ ఇతర ప్రదేశాలు

హంపీలో చూడదగ్గ ఇతర ప్రదేశాలు

హంపీకి పర్యటనకు ప్లాన్ చేసుకున్నప్పుడు కేవలం హంపీ మాత్రమే కాకుండా ఆ చుట్టు ప్రకల ఉన్న ప్రదేశాలను కూడా చుట్టి రావచ్చు. అలాంటి పర్యాటక ప్రదేశాలు మరికొన్ని మీకోసం విరూపాక్ష దేవాలయం,
కడలేకలులో ఏక శిలతో నిర్మింపబడిన అతి పెద్ద గణేశుని విగ్రం, హజార రామాలయం, విరూపాక్ష గుహలు, శశిలేఖలులో పొట్ట ఉదరానికి మొలతాడులా సర్పాన్ని చుట్టుకుని ఉన్న ఎనిమిది అడుగుల గణేశుని విగ్రహం, ఆనాటి విజయనగర రాజుల కాలం నాటి రత్నాభరణాలు, అమూల్యాభరణాలను రాశులు పోసి విక్రయించిన అతి పెద్ద బజార్ ఉంది. ప్రస్తుతం ఈ బజార్ లో కృత్రిమ బంగారు, ముత్యాల, వెండి, రంగు రాళ్లు అమ్ముతున్నారు.

P.C: You Tube

ఇంకా పట్టాభిరామాలయం,

ఇంకా పట్టాభిరామాలయం,

ఇంకా పట్టాభిరామాలయం, కమల్ మహాల్, హంపీ బజార్, అచ్యుతరాయాలయం ఈ ఆలయంలో విజయనగర కళారీతిలో నిర్మించిన తిరువేంగళనాథుని విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. ఇంకా గగమ్ మహాల్, ఆర్కిలాజికల్ మ్యూజియం, తొమ్మిది వందల ఏళ్ళ నాటి చంద్రమౌళీశ్వరాలయంను తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు.

PC: Youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X