Search
  • Follow NativePlanet
Share
» »బండాజే : ఒక ఆకర్షణీయమైన ట్రెక్ !!

బండాజే : ఒక ఆకర్షణీయమైన ట్రెక్ !!

మూడు రోజుల పర్యటనకు 'బండాజే' సూచించదగినది. పోవడం, రావటం, విశ్రాంతి కి ఒకరోజు, ట్రెక్కింగ్ కు ఇంకోరోజు, చుట్టుప్రక్కల ప్రదేశాలను చూడటానికి మరోరోజు. ఇలా మొత్తం మూడు రోజులు.

By Mohammad

పర్యాటకులారా ! ఏంటీ స్వేటర్లు, దుప్పట్లు కప్పుకొని ఈ వింటర్ ఇంట్లోనే కూర్చొన్నారా ? అబ్బే ఇది అస్సలు బాగాలేదండీ .. ప్రకృతిని ఆస్వాదించాలని అనుకునేవారు ఇలా రగ్గులు, చలి కోర్ట్ లు వేసుకొని ఇంట్లో వుండటం మీ లాంటి వారికి తగదు! రండి ఈ చలిలో కూడా కాక పుట్టించే ప్రదేశం ఒకటి ఉంది. అదేదో ఉత్తర భారతదేశం అనుకొనే పొరబడినట్లే ... ఈ టైం లో ఉత్తర భారతదేశం వెళితే ఇంకేమైనా !! దేవునికే దుప్పట్లు కప్పుతున్నారు అక్కడ.

మిమ్మల్ని కాక పుట్టించేటట్లు చేసే ప్రదేశం 'బండాజే'. పేరు బండ మాదిరి ఉన్నా అక్కడ ప్రకృతి, చెట్లు, జలపాతాలు, పర్వతాలు, పచ్చని మైదానాలు, ఆహ్లాదపరిచే వాతావరణం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. పశ్చిమ కనుమలలో భాగమైన చార్మడి శ్రేణిలో బండాజే కలదు.

ఎక్కడ ఉంది ?

బండాజే కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థల కు 22 కిలోమీటర్ల దూరంలో, దక్షిణ కర్ణాటక జిల్లాలో కలదు. బెంగళూరు మహానగరం నుండి బండాజే సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వారాంతంలో ట్రెక్కింగ్ మరియు ఆధ్యాత్మికత రెండూ అనుభూతి పొందాలనుకునేవారు 'బండాజే మరియు ధర్మస్థల' కు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

<strong>ధర్మస్థల లో సందర్శించవలసిన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.</strong>ధర్మస్థల లో సందర్శించవలసిన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

దిగువన ఉన్న అన్ని ఫోటోగ్రఫీ చిత్రాల సమకూర్పణ : హేమంత్ కుమార్

ట్రెక్కింగ్ రూట్లు

ట్రెక్కింగ్ రూట్లు

బండాజే సముద్రమట్టానికి 2000 అడుగుల ఎత్తున థ్రిల్లింగ్ గొలిపే ట్రెక్కింగ్ రూట్లతో, జలపాతాలతో ధర్మస్థలకు 23 కిలోమీటర్ల దూరంలో కలదు. ట్రెక్కింగ్ దూరం : 13 కిలోమీటర్లు.

ఉజిరే నుంచి

ఉజిరే నుంచి

'బండాజే' కు డైరెక్ట్ గా చేరుకోవటానికి ఎటువంటి బస్సు, రైలు సదుపాయాలూ లేవు. కనుక ట్రెక్కర్లు ధర్మస్థల చేరుకుంటే .. అక్కడి నుండి 9 కి.మీ ల దూరంలో ఉన్న ఉజిరే వరకు జీప్ లేదా ప్రభుత్వ బస్సులలో ప్రయాణించి మరళా ఉజిరే నుంచి బండాజే వరకు జీప్ లేదా ఆటో రిక్షా అద్దె కు తీసుకొని చేరుకోవాలి.

సూచన

సూచన

ట్రెక్కర్లు ధర్మస్థల నుంచి డైరెక్ట్ గా క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు మాట్లాడుకొని బండాజే వరకు వెళితే మంచిది. లేకుండా ఎక్కడం, దిగటం దానికే టైం సరిపోతుంది.

ట్రెక్కర్లు

ట్రెక్కర్లు

ట్రెక్కర్లు వారాంతంలో ఇక్కడికి అధికంగా వస్తుంటారు. బెంగళూరు ,ముంబై, కేరళ, గోవా తదితర ప్రాంతాల నుంచి తక్కువ మంది (తెలిసినవారు మాత్రమే) ఇక్కడికి వస్తారు.

మూడు రోజుల పర్యటన

మూడు రోజుల పర్యటన

మూడు రోజుల పర్యటనకు 'బండాజే' సూచించదగినది. పోవడం, రావటం, విశ్రాంతి కి ఒకరోజు, ట్రెక్కింగ్ కు ఇంకోరోజు, చుట్టుప్రక్కల ప్రదేశాలను చూడటానికి మరోరోజు. ఇలా మొత్తం మూడు రోజులు.

ట్రెక్కింగ్ లో ఏమేమి చూడవచ్చు ??

ట్రెక్కింగ్ లో ఏమేమి చూడవచ్చు ??

ట్రెక్కింగ్ అంతా చెట్లు, నీటి ప్రవాహాలు, పచ్చని గడ్డి మైదానాలు మీదుగా సాగిపోతుంది. ట్రెక్కింగ్ కాస్త కష్టంగా ఉండి, మధ్యస్థంగా ఉంటుంది. కనుక నీటి ప్రవాహాలు, గడ్డి పొదలు దాటాలనుకొనేవారు జాగ్రత్త. ట్రెక్కింగ్ లో ఆర్బీ ఫాల్స్ ఆనందపరుస్తుంది.

మొదటి రోజు

మొదటి రోజు

ట్రెక్ లో భాగంగా మొదటి రోజు ఉదయం బేస్ క్యాంప్ వద్ద బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని ట్రెక్కింగ్ ప్రారంభించండి. వెళ్తున్నప్పుడు వాటర్ బాటిల్, తినుబండారాలను వెంట తీసుకెళ్లండి.

మొదటి రోజు

మొదటి రోజు

అడవిలో ప్రవేశించగానే మొదట కనిపించేవి గడ్డిపొదలు. వాటిలో నడుస్తుంటే ఆ అనుభూతే వేరు. అక్కడి నుంచే అసలు ట్రెక్కింగ్ మజా కనిపిస్తుంది.

మొదటి రోజు

మొదటి రోజు

వెంట తీసుకొచ్చిన తినుబండారాలను, ఆహారపొట్లాలను ఒకచోట ఆగి తినండి. నీరు త్రాగండి. సన్నని నీటి ప్రవాహాలలో చిన్న చిన్న గులకరాళ్ళ మీద కాలుపెట్టి ఆనందించండి.

మొదటి రోజు

మొదటి రోజు

సాయంత్రంవేళ కొండ పైకి చేరుకొని అక్కడే టెంట్లు వేసుకోండి. అందమైన సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసి ... అంతవరకు పడిన శ్రమ వృధా కాలేదని గర్వించండి.

మొదటి రోజు

మొదటి రోజు

కొండపై నుండి ప్రకృతి దృశ్యాలను చూసి ముగ్దులవండి.ఆర్బీ జలపాతం వద్ద (సూర్యాస్తమయానికి ముందు) సందడి చేయండి. స్నానాలు చేయాలనుకునేవారు, ఈత కొట్టాలనుకొనేవారు చేసుకోవచ్చు.

మొదటి రోజు

మొదటి రోజు

కొండ పైన కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి (ముఖ్యంగా కొండ అంచుల వద్ద). వెంట తీసుకెళ్లిన సామాగ్రితో వంట చేసుకొని, మధ్యలో మంట వేసుకొని, వెన్నెల కాంతులను ఆస్వాదిస్తూ, మీ కిష్టమైన పాటలు వింటూ డిన్నర్ చేయండి.

రెండవ రోజు

రెండవ రోజు

ఉదయాన్నే లేచి సూర్యోదయ దృశ్యం చూడండి. జలపాతం వద్దకు వెళ్ళి ఫ్రెషప్ అవ్వండి మరియు మీ ట్రెక్కింగ్ ను మొదలుపెట్టండి. రెండవరోజు ట్రెక్కింగ్ లో భాగంగా వ్యూ పాయింట్లు, బళ్ళరాయణదుర్గ కోట చూసేయండి. తిరిగి మీ టెంట్ల వద్దకు చేరుకొని డాన్స్ లతో, సంగీతంతో ఎంజాయ్ చేయండి.

మూడవ రోజు

మూడవ రోజు

చివరిరోజు ఉదయాన్నేలేచి, రీఫ్రెష్ అయి సందడి చేసే పక్షుల మధ్య నడుస్తూ ... జంగల్ ట్రెక్ తిరిగి ప్రారంభించండి. సూర్యుడు భగభగ మనే లోపే బేస్ క్యాంప్ చేరుకోండి. అక్కడితో మీ మూడు రోజుల పర్యటన ముగుస్తుంది.

ట్రెక్ టైం మరియు దూరం

ట్రెక్ టైం మరియు దూరం

బేస్ క్యాంప్ నుండి బండాజే ఫాల్స్ చేరుకోవటానికి 4- 6 గంటలు (8-9 KM) మరియు బండాజే ఫాల్స్ నుండి ఫోర్ట్ చేరుకోవటానికి 2-3 గంటలు (4-5 KM) సమయం పడుతుంది.

బండాజే ట్రెక్ కు అనువైన సమయం

బండాజే ట్రెక్ కు అనువైన సమయం

వర్షాకాలానికి, వేసవి కాలానికి మధ్య వచ్చే శీతాకాలం బండాజే ట్రెక్ కు అనువైనది. తడిసిన బట్టలను పిండారబోసినట్లు ఉంటుంది అక్కడి వాతావరణం. వర్షాకాలం ట్రెక్కింగ్ కష్టంగా ఉంటుంది. వేసవిలో వాటర్ ఫాల్స్ ఒక్కోసారి ఇంకిపోయి కనిపిస్తుంది. కనుక శీతాకాలం అనువైనది.

ఏ ఏ వస్తువులు వెంట తీసుకెళ్లాలి ?

ఏ ఏ వస్తువులు వెంట తీసుకెళ్లాలి ?

వాటర్ ఫాల్స్ పైన(టెంట్లు వేసుకొనే ప్రాంతం) ఎటువంటి వసతులు ఉండవు. కనుక టెంట్లు, క్యాంపైనింగ్ బ్యాగ్స్, ఆహార వస్తువులు, తినుబండారాలు, బిస్కెట్లు, వాటారు బాటిల్స్, దుస్తులు, పవర్ బ్యాంక్ వంటివి తీసుకెళ్ళటం ఉత్తమం.

గుర్తించుకోవలసినవి

గుర్తించుకోవలసినవి

1. డిపార్ట్మెంట్ అనుమతి
2. అవసరమైన ట్రెక్కింగ్ సామాగ్రి
3. దుస్తులు, షూ వంటివి
4. ఎదో అడవిలో చించేద్దాం అని చెప్పి ఒంటరిగా అటూ ఇటూ వెళ్ళటం వంటివి చేయవద్దు. గ్రూప్ ట్రయిల్ ను ఫాలో అవ్వండి.
5. తెలియకుండా చెట్లమీద ఉన్న పండ్లను, ఆకులను ముట్టుకోవద్దు, తినొద్దు.
6. బాటిల్ లో నీరు అయిపొయింది కదా అని పారవేయవద్దు. నీటి ప్రవాహాల వద్ద వాటిని నింపుకోండి.
7. బండాజే ట్రెక్ తిరిగిప్రయాణంలో ధర్మస్థల సందర్శించడం మరవద్దు..!!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X