Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు ప్యాలెస్, కర్ణాటక !

బెంగళూరు ప్యాలెస్, కర్ణాటక !

By Mohammad

బెంగళూరు వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిన రాజప్రసాదం బెంగళూరు ప్యాలెస్. ఇది బెంగళూరులోని ప్యాలెస్ రోడ్, వసంత నగర్ లో కలదు. దీని నిర్మాణం 1862 లో ప్రారంభమై 1944 లో పూర్తయింది.

సందర్శించు సమయం : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5: 30 గంటల వరకు.

టికెట్ ధరలు : భారతీయులు 210 రూపాయలు, విదేశీయులు 410 రూపాయలు చెల్లించాలి.

పూర్వపు చరిత్ర

బెంగుళూరు ప్యాలెస్ , భారతదేశములోని బెంగుళూరు నగరంలో ఉన్న ఒక రాజప్రాసాదం. ఇది ఇంగ్లాండులోని విండ్సర్ కాసిల్ యొక్క ఒక చిన్న నమూనా లాగా ఉండేటట్లు నిర్మించబడింది. బెంగుళూరులోని సెంట్రల్ ఉన్నత పాఠశాల మొదటి ప్రిన్సిపాల్ అయిన రెవరెండ్ గారెట్ దీనిని నిర్మించారు.

1884 లో, మైసూరు మహారాజు చామరాజ వడయార్ దీనిని కొన్నారు. ప్రస్తుతం మైసూరు రాజ కుటుంబం యొక్క ప్రస్తుత వారసుడు, శ్రీకంఠ దత్త నరసింహరాజ వడయార్ ఆధీనంలో కలదు.

ప్యాలెస్ గ్రౌండ్స్

ప్యాలెస్ గ్రౌండ్స్

ఈ రాజప్రాసాదం చుట్టుపక్కల విస్తరించిన మైదానం సంగీత కచేరీలతో సహా బహిరంగ కార్యక్రమముల కొరకు ఉపయోగించబడుతుంది.

చిత్రకృప : Vinu Thomas

ప్యాలెస్ వర్ణన

ప్యాలెస్ వర్ణన

రాజప్రాసాదం దుర్గములతో కూడిన బురుజులు, కోట కొమ్ములు మరియు బురుజు మీది చిన్న గదులతో ట్యూడర్ తరహా నిర్మాణ కళలో నిర్మించబడింది. అంతర్భాగములు సొంపైన కొయ్య బొమ్మలు, పువ్వుల నమూనాలు, చూరులు మరియు పై కప్పుల పైన స్వస్థత కూర్చే తైలవర్ణ చిత్రములతో అలంకరించబడ్డాయి.

చిత్రకృప : Brian Evans

 ఇంగ్లాండ్ నుండి

ఇంగ్లాండ్ నుండి

రాజప్రాసాదం మొత్తం మీద 35 గదులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పడక గదులే. మనుష్యుల సాయంతో నడిచే లిఫ్ట్ మరియు కొయ్య ఫ్యాన్ లతో పాటు, ప్రత్యేకించి ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న అద్దకము వేసిన గాజు మరియు అద్దములు ప్యాలెస్ లో చూడవచ్చు.

చిత్రకృప : John Hoey

బాల్ రూమ్

బాల్ రూమ్

గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్లోరసెంట్ నీలి రంగు సెరామిక్ పలకలతో కప్పబడిన గ్రానైట్ ఆసనములతో కూడిన బహిరంగ చావడి ఉంది. ఇక్కడ వ్యక్తిగత వేడుకలను నిర్వహించటానికి ఒక బాల్ రూమ్ కూడా ఉంది.

చిత్రకృప : John Hoey

దర్బార్ హాల్

దర్బార్ హాల్

మొదటి అంతస్తులో దర్బార్ హాల్ గా పిలవబడే ఒక పెద్ద హాలు ఉంది. అలంకరించబడిన మెట్లు ఎక్కి ఈ హాలుకి చేరుకోవచ్చు. ఈ హాలులోనే రాజు దర్బారు నిర్వహించేవాడు. మెట్ల పక్కన ఉన్న గోడలు తైల వర్ణ చిత్రములతో అలంకరించబడ్డాయి మరియు దర్బార్ హాల్ లో ఒక భారీ ఏనుగు తల అతికించబడి ఉంటుంది.

చిత్రకృప : John Hoey

గోతిక్ రీతిలో

గోతిక్ రీతిలో

హాలులో ఒక వైపు గోతిక్ రీతిలో ఉన్న కిటికీలు ఉన్నాయి. పసుపు రంగు విస్తారంగా వాడబడింది మరియు హాలులోని సోఫా సెట్ పసుపు రంగుది. ఒక మూల ఉన్న తెర, మహిళలు ఏకాంతములో కూర్చుని సభా కార్యక్రమములను వీక్షించే స్థలాన్ని విడిగా ఉంచుతుంది. రాజా రవి వర్మ యొక్క తైలవర్ణ చిత్రములు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి.

చిత్రకృప : John Hoey

అందమైన పెయింటింగ్

అందమైన పెయింటింగ్

రాజప్రాసాదం లోపలి గోడలు కొన్ని గ్రీకు మరియు డచ్ పెయింటింగులతో సహా 19 శతాబ్దపు మధ్య భాగానికి చెందిన పురాతన పెయింటింగులతో అలంకరించబడ్డాయి. కొన్ని ఇతర ఆకర్షణలలో మైసూరు దివాన్, సర్ మిర్జా ఇస్మాయిల్ కు చెందిన ఒక డైనింగ్ టేబుల్ ఉంది.

చిత్రకృప : vhines200

ఫొటోగ్రాఫ్ లు

ఫొటోగ్రాఫ్ లు

ప్రస్తుతం ప్యాలెస్ లో ఉన్న 30,000 ఫోటోగ్రాఫులలో, సుమారు 1,000 సరిచేసి ప్రదర్శనకు ఉంచబడ్డాయి. రాజ కుటుంబం ఉపయోగించిన పట్టు మరియు ఇతర దుస్తులను ప్రదర్శించటానికి ఒక గది బోటిక్ గా మార్చబడింది.

చిత్రకృప : vhines200

టికెట్ ధరలు

టికెట్ ధరలు

ఈ రాజప్రాసాదమును సందర్శించటానికి స్థానికులు 210 రూపాయలు మరియు విదేశీయులు 410 రూపాయలు చెల్లించాలి. కెమెరా రుసుములు : స్టిల్ ఫోటోగ్రఫి కొరకు 675 రూపాయలు, వీడియో కెమెరా కొరకు 1000 రూపాయలు మరియు మొబైల్ కెమెరా 100 రూపాయలు.

చిత్రకృప : John Hoey

కచేరీలు

కచేరీలు

రాజప్రాసాదం చుట్టూ విస్తరించి ప్యాలెస్ గ్రౌండ్స్ గా ప్రసిద్ధి చెందిన మైదానములలో ఒకే సమయములో ఎక్కువ మంది ప్రజలు చేరటానికి అవకాశం ఉండటంతో ఇక్కడ బహిరంగ కార్యక్రమములకు మంచి వేదిక అయ్యాయి. ఈ మైదానములు ప్రసిద్ధ అంతర్జాతీయ బాండ్లతో సహా సంగీత కచేరీల నిర్వహణకు కూడా ఉపయోగించబడుతున్నాయి.

చిత్రకృప : Masaru Kamikura

షూటింగ్

షూటింగ్

బెంగళూరు ప్యాలెస్ లో అన్ని చిత్ర రంగాల సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. ఇప్పటివరకు వందల సంఖ్యలో సినిమా షూటింగ్లు ఇక్కడ నిర్వహించారు. బాలీవూడ్ : షాలిమార్, మార్డ్, బేతాబ్ మొదలైనవి; టాలీవూడ్ : వెంకటేష్ నటించిన మసాలా చిత్రం.

చిత్రకృప : Christine und Hagen Graf

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

ప్యాలెస్ సదాశివనగర్ మరియు జయమహల్ మధ్యన, బెంగళూరు నడిబొడ్డున కలదు. దేశంలోని అన్ని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీల నుండి బెంగళూరు చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలు అందుబాటులో కలవు. బెంగళూరు చేరుకున్నాక లోకల్ సిటీ బస్ లలో, క్యాబ్ లేదా టాక్సీలలో బెంగళూరు ప్యాలెస్ చేరుకోవచ్చు.

చిత్రకృప : Bikashrd

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more