India
Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు నుండి సకలేశ్ పూర్ రోడ్ ట్రిప్ జర్నీ !

బెంగళూరు నుండి సకలేశ్ పూర్ రోడ్ ట్రిప్ జర్నీ !

By Mohammad

దీపావళికి నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. మరి ఈ లాంగ్ వీకెండ్ లో ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటున్నారా ? అయితే సకలేశ్ పూర్ వెళ్ళిరండి. ఇది మీకు అన్ని విధాలా సూచించదగినది. బెంగళూరు నగరం నుండి, మైసూర్ నుండి రవాణా సౌకర్యాలు సులభంగా దొరుకుతాయి. సకలేశ్ పూర్ బెంగళూరు నుండి 220 కి. మీ ల దూరంలో కలదు.

ఉల్లాసాన్ని ఇచ్చే .. అవలబెట్ట యాత్ర !

కర్ణాటక రాష్ట్రంలోని సకలేశ్ పూర్ ఒక చిన్న హిల్ స్టేషన్. పశ్చిమ కనుమలలో ఇమిడిపోయి ఉన్న ఈ చిన్న పర్వత ప్రాంతం పర్యాటకులకు విహార స్థలంగా ఉన్నది. ఇక్కడికి వీకెండ్ లో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా సహచర ఉద్యోగులతో కలిసి రావచ్చు. ట్రిప్ కు బడ్జెట్ కూడా తక్కువగానే ఉంటుంది. లోయలలో కాఫీ, తేయాకు తోటల పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి.

కుమటా కోస్తా తీరం - మరువలేని అనుభూతి !

ప్రయాణం మొదలు

ప్రయాణం మొదలు

ముందుగా జర్నీని బెంగళూరు నుండి మొదలుపెడదాం. బెంగళూరు నుండి సకలేశ్ పూర్ 220 కిలోమీటర్ల దూరం ఉన్నది. ప్రయాణ సమయం ఐదు గంటలు. ప్రయాణం లో హస్సన్, శ్రావణబెళగొళ, బేలూర్ వంటి ప్రదేశాలను చూడవచ్చు.

చిత్రకృప : Arvind Krishnan

శ్రావణబెళగొళ

శ్రావణబెళగొళ

జర్నీ లో మొదటి పర్యాటక ప్రదేశం శ్రావణబెళగొళ. ఇది 17. 5 మీటర్ల ఎత్తున ఉన్న గోమఠేశ్వర విగ్రహానికి ప్రసిద్ధి. ప్రతి పుష్కరం నాడు విగ్రహానికి మహామస్తాభిషేకం జరుగుతుంది.

చిత్రకృప : RajuBabannavar

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

అక్కన మందిరం, భండారి బసడి దేవాలయం, కాళమ్మ దేవాలయం, చంద్రగిరి దేవాలయం, జైన మఠం, వింధ్యగిరి దేవాలయం మొదలుగునవి.

చిత్రకృప : HoysalaPhotos

హస్సన్

హస్సన్

హస్సన్ కర్ణాటక రాష్ట్ర శిల్పకళా రాజధాని. స్థానిక దేవత అయిన హస్సనాంబ పేరిట ఈ ప్రాంతానికి ఆ పేరొచ్చింది. హొయసల రాజవంశీయులు కళలు, సంస్కృతి నేటికీ జిల్లా అంతటా కనిపిస్తుంది. శివాలయం చూడవచ్చు.

చిత్రకృప : MANJESHK

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

లక్ష్మినరసింహ స్వామి గుడి, యగాచి డ్యామ్, ఓంబట్టు గుడ్డ మొదలుగునవి హస్సన్ ఆకర్షణలుగా ఉన్నాయి.

చిత్రకృప : Ravi S. Ghosh

బేలూర్

బేలూర్

బేలూరు యగాచి నది ఒడ్డున కలదు. ఇక్కడ ప్రాచీన, విశిష్టమైన దేవాలయాలు ఉండటం వలన దీనిని 'దక్షిణ కాశి' గా పిలుస్తారు. ఇది హొయసల సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇక్కడి ప్రసిద్ధ ఆలయం చెన్నకేశవ ఆలయం.

చిత్రకృప : Prof. Mohamed Shareef

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

దర్పణ సుందరి, గ్రావిటీ పిల్లర్, వీరనారాయణ ఆలయం, బిగ్ తట్యాంక్, కప్పే చేన్నిగరాయ దేవాలయం మొదలగునవి చూడదగ్గవి.

చిత్రకృప : Dineshkannambadi

హళేబీడు

హళేబీడు

హళేబీడు హొయసుల కాలంలో రాచరిక వైభవాలలో విలసిల్లింది. దీనిని అప్పట్లో 'ద్వారాసముద్రం' అని పిలిచేవారట. ఇక్కడ హొయసలేశ్వర మరియు శాంతాలేశ్వర ఆలయాలు ప్రసిద్ధి.

చిత్రకృప : Harsha K R

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

కేదారేశ్వర్ దేవాలయం, బసాది హళ్ళి , బెలవడి మొదలుగునవి హళేబీడు ఆకర్షణలుగా నిలిచాయి.

చిత్రకృప : Ashwin Kumar

కాఫీ మరియు టీ తోటలు

కాఫీ మరియు టీ తోటలు

సకలేశ్ పూర్ ప్రవేశంలోనే కాఫీ, టీ తోటల పరిమళాలు మిమ్మల్ని స్వాగతం పలుకుతాయి. ఇక్కడ బిస్లే రిజర్వ్ ఫారెస్ట్, పుష్పగిరి వైల్డ్ లైఫ్ సాంచురీ చూడవచ్చు.

చిత్రకృప : L. Shyamal

కుమార పర్వత

కుమార పర్వత

సాహస క్రీడలు ఆస్వాదించాలనుకొనేవారు ఈ కుమార పర్వత ట్రెక్కింగ్ కు వెళ్ళవచ్చు. సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని చూడవచ్చు.

చిత్రకృప : Vivekvaibhavroy

బిస్లే ఘాట్

బిస్లే ఘాట్

ఈ అడవి లో పులులు, పాములు, జింకలు మరియు వివిధ రకాల పక్షులు ఉంటాయి. ఈ విహార ప్రదేశం నుండి పర్యాటకులు కనులకు విందు చేసే అందమైన పడమటి కనుమల శ్రేణిని అంటే కుమార పర్వతం, పుష్ప గిరి, దొడ్డ బెట్ట మరియు పట్ట బెట్ట వంటివి చూడవచ్చు.

చిత్రకృప : snapper san

మంజరాబాద్ ఫోర్ట్

మంజరాబాద్ ఫోర్ట్

మంజరాబాద్ ఫోర్ట్, సకలేశ్ పూర్ మరో ప్రధాన ఆకర్షణ. ఈ కోటను మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ నిర్మించాడు. ఈ కోట ముస్లిం శిల్ప శైలి కళను ప్రదర్శిస్తుంది. దీని నుండి సముద్ర కోస్తా తీరాలను చూసి ఆనందించవచ్చు.

చిత్రకృప :Aravind K G

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X