Search
  • Follow NativePlanet
Share
» »మౌర్యులు కొండలను తొలిచి నిర్మించిన బరాబర్ గుహలు !

మౌర్యులు కొండలను తొలిచి నిర్మించిన బరాబర్ గుహలు !

By Mohammad

బరాబర్ గుహలు భారతదేశంలోని అతిపురాతన గుహలు. ఈ గుహలు మౌర్య రాజులకు చెందినవి. వాటిలో కొన్ని ప్రత్యేకించి అశోకుడుకు సంబంధించినవి. బీహార్ లోని జెహనాబాద్ జిల్లా, గయ కు 24 కిలోమీటర్ల దూరంలో బరాబర్ గుహలు ఉన్నాయి.

బుద్ధగయ ... బౌద్ధ మతం పరిఢవిల్లిన పుణ్య క్షేత్రం !!బుద్ధగయ ... బౌద్ధ మతం పరిఢవిల్లిన పుణ్య క్షేత్రం !!

గయ కు వెళ్లే ప్రతి పర్యాటకుడు ఈ గుహలను తప్పక చూసితీరాల్సిందే! గయ మరియు గయ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ద గయలో లో కూడా సందర్శించవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. గయ లో విష్ణుపాద్ మందిర్, బుద్ధ గయ లేదా బోధ్ గయ లో భోధి చెట్టు, మహాబోధి ఆలయం, దుంగేశ్వరి గుహాలయం, జమ మసీద్ చూడదగ్గవి.

గుహలు

గుహలు

మౌర్య రాజుల కాలానికి చెందినా బరాబర్ గుహలు, దేశంలోని అతి పురాతన రాతి కట్టడం. బరాబర్ వద్ద ఉన్న ఎక్కువ గుహలు ఎక్కువగా మేరుగుపెట్టిన అంతర్గత ఉపరితలం, ప్రతిధ్వని ప్రభావంతో, పూర్తిగా గ్రానైట్ తో మలచబడి, రెండు విభాగాలను కలిగిఉంటాయి.

చిత్రకృప : Photo Dharma

నిర్మాణ శైలి

నిర్మాణ శైలి

పురాతన కాలంలో చాలా అరుదైన ఉత్తమ వంపులు కలిగిన గుహలలో కరణ్ చౌపర్, లోమస్ రిషి, సుదామ, విశ్వ జోప్రి అనే నాలుగు గుహలు ఉన్నాయి. ఈ గుహలు రాతి కట్టడాల నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ.

చిత్రకృప : Photo Dharma

లోమస్ రిషి కేవ్

లోమస్ రిషి కేవ్

గుహ మూడు వైపు వంపులు తిరిగి ఉండి, విస్తృతమైన కలప నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. గుహ ఎంట్రెన్స్ మెలికలు తిరిగి ఉండటంతోపాటు స్థూప చిహ్నాల వైపు వెళ్ళే వరుస ఏనుగులతో అలంకరించబడి ఉంటుంది.

చిత్రకృప : Photo Dharma

సుధామ కేప్స్

సుధామ కేప్స్

సుధామ కేప్స్ క్రీ.శ.261 కాలానికి చెందిన మౌర్య రాజు అశోకుడు కు అంకితం చేయబడింది. సుధామ గుహ ఆర్చీలు విల్లు ఆకారంలో మలచబడి ఉంటాయి. మండపం మధ్యలో గోపురం గల గది ఉంటడం ఇక్కడి ప్రత్యేకత.

చిత్రకృప : Photo Dharma

కరణ్ చౌపర్ కేప్స్

కరణ్ చౌపర్ కేప్స్

పాలిష్ చేయబడిన ఉపరితలం కలిగిన ఒక దీర్ఘచతురస్త్రాకార గది ఉంది. క్రీ.పూ. 245 నాటి శాశనాలను ఇక్కడ భద్రంగా ఉంచారు.

చిత్రకృప : Photo Dharma

విశ్వ జోప్రి కేప్స్

విశ్వ జోప్రి కేప్స్

అశోకుడు కొండను తొలచి వెళ్లిన గుహలు ఇవి. ఈ గుహ రెండు దీర్ఘచతురస్త్రాకార గదులను కలిగి ఉంటుంది.

చిత్రకృప : Photo Dharma

నాగార్జున గుహలు

నాగార్జున గుహలు

నాగార్జున గుహలు బరాబర్ గుహల కన్నా నవీనమైనవి మరియు చిన్నవి. ఇవి క్రీ.పూ. 3 వ శతాబ్దం కాలం నాటివి మరియు బారాబర్ గుహలకు 1.6 కి. మీ ల దూరంలో ఉన్నాయి.

చిత్రకృప : Photo Dharma

ట్విన్ హిల్స్

ట్విన్ హిల్స్

బారాబర్ గుహలు 'ట్విన్ హిల్స్' గా పిలువబడే బరాబర్ (నాలుగు గుహలు) మరియు నాగార్జున (మూడు గుహలు) కొండలలో ఉన్నాయి.

చిత్రకృప : Photo Dharma

గోపి గుహలు

గోపి గుహలు

గోపి (గోపి- కా-కుభ) : ఇక్కడి శాశనాల ప్రకారం, క్రీ.పూ. 232 వ సంవత్సరంలో దశరథ రాజు ద్వారా ఆజీవక ఫాలోవర్స్ కు ఈ గుహ అంకితం చేయబడినది.

చిత్రకృప : Klaus-Norbert

విధిత గుహలు

విధిత గుహలు

విధిత -కా- కుభ కేవ్ (వేదతిక కుభ) : రాతితో ఏర్పడే పగులు ఉన్న ప్రదేశంలో ఈ గుహలు ఉన్నాయి.

చిత్రకృప : Photo Dharma

వాపియ గుహలు

వాపియ గుహలు

వాపియ -కా- కుభ కేవ్ (మీర్జా మండి): ఈ గుహలు కూడా దశరథ రాజు ద్వారా ఆజీవక ఫాలోవర్స్ కు అంకితం చేయబడినది.

చిత్రకృప : Photo Dharma

సందర్శించు సమయం

సందర్శించు సమయం

వారంలో అన్ని రోజులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకుల సందర్శనార్థం తెరిచే ఉంచుతారు. సుమారు 3 నుండి 4 గంటల పాటు గుహలను సందర్శించవచ్చు. టికెట్ తీసుకోవలసిన అవసరం లేదు. 'ఫ్రీ' గానే లోనికి వెళ్ళవచ్చు.

చిత్రకృప : Photo Dharma

ప్రకృతి ప్రేమికులు

ప్రకృతి ప్రేమికులు

బరాబర్ గుహలను సాహసాలంటే ఇష్టపడేవారికి, ,ఫొటోగ్రాఫర్లకు, చరిత్ర మీద మక్కువ ఉన్నవారు మరియు ప్రకృతి ప్రేమికులు సందర్శిస్తుంటారు.

చిత్రకృప : Artistically

ఎక్కడ ఉండాలి?

ఎక్కడ ఉండాలి?

బరాబర్ గుహల వద్ద ఉంటాడటానికి ఎటువంటి హోటళ్లు, లాడ్జీలు, రిసార్ట్ లు లేవు. కనుక 35 కి. మీ ల దూరంలో ఉన్న గయ అన్నివిధాలా సౌకర్యవంతమైనది.

చిత్రకృప : Photo Dharma

ఎక్కడ తినాలి ?

ఎక్కడ తినాలి ?

గుహల వద్ద తినటానికి ఎటువంటి స్టాల్స్, హోటళ్లు లేవు. కనుక మీరే ఆహార పొట్లాలను, త్రాగునీరు వెంట తీసుకెళ్లడం ఉత్తమం.

చిత్రకృప : Photo Dharma

ఎప్పుడు సందర్శించాలి ?

ఎప్పుడు సందర్శించాలి ?

బరబరా గుహలకు ఉత్తమ సందర్శన సమయం : అక్టోబర్ నుండి మార్చ్ వరకు.

చిత్రకృప : Photo Dharma

బరాబర్ గుహలకు ఎలా చేరుకోవాలి ?

బరాబర్ గుహలకు ఎలా చేరుకోవాలి ?

బరాబర్ గుహలకు సమీపాన 31 కి. మీ ల దూరంలో గయ విమానాశ్రయం కలదు.

బరాబర్ గుహలకు సమీపాన 23 కి. మీ ల దూరంలో గయ రైల్వే జంక్షన్ కలదు.

గయ నుండి ప్రతిరోజూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు, వాహనాలు గయ కు వెళుతుంటాయి.

చిత్రకృప : Photo Dharma

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X