Search
  • Follow NativePlanet
Share
» »నాలుగు నెలలు మాత్రమే భూమి పై కనిపించే విచిత్ర దేవాలయంలో స్వర్గానికి మెట్లు

నాలుగు నెలలు మాత్రమే భూమి పై కనిపించే విచిత్ర దేవాలయంలో స్వర్గానికి మెట్లు

బాతు కి లడి దేవాలయాలకు సంబంధించిన కథనం.

సువిశాల భారత దేశంలో తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా దేవతలు నివశించే హిమాలయ రాష్ట్రంగా పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ లో అటువంటి విషయాలు మరింత ఎక్కువ. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ రాష్ట్రంలో అడుగు అడుగుకు ఒక దేవాలయం సాక్షాత్కరిస్తుంది. అటువంటి దేవాలయాలు సాధారణంగా ఎత్తైన గుట్ట మీద లేదా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటాయి. అయితే ఒక దేవాలయం మాత్రం 8 నెలలు నీటి లోపల ఉండిపోయి నాలుగు నెలలు మాత్రం భూమి పై కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆవిధ:గా నీటి లోపల మునిగి పోవడానికి గల కారణం తదితర వివరాలన్నీ మీ కోసం....

సూర్యాస్తమయం తర్వాత మీరు ఇక్కడ ఉంటే ఏమౌతారో తెలుసాసూర్యాస్తమయం తర్వాత మీరు ఇక్కడ ఉంటే ఏమౌతారో తెలుసా

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

అత్యంత ప్రాచీనమైన దేవాలయం. దీనిని దేవాలయం అనడం కంటే దేవాలయాల సమూహం అనడం సమంజసంగా ఉంటుంది.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఈ దేవాలయాన్ని బాతూ కి లడి అని స్థానికంగా పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఈ దేవాలయం ఉంది.

వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ప్రస్తుతం ఈ దేవాలయం మహారాణా ప్రతాప్ సాగర్ డ్యాంలో జలసమాధిలో ఉంది. సుమారు 8 నెలల పాటు నీటిలో అలా మునిగిపోయి మనకు కనిపిస్తుంది.

కొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటాకొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటా

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
మిగిలిన నాలుగు నెలలు మాత్రం భూమి పై తేలి ఉంటుంది. ఈ దేవాలయాలను చూడటానికి పర్యాటకులు బోట్ లలో వెళ్లాల్సి ఉంటుంది.

భారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారాభారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారా

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
సుమారు 50 ఏళ్ల నుంచి ఇది అలా నీటిలోనే మునిగి ఉంది. స్థానికుల కథనం ప్రకారం ఈ దేవాలయాల్లోనే స్వర్గానికి మెట్ల దారి ఉందని చెబుతారు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
పాండవులు వన వాసంలో ఉంటూ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఈ దేవాలయాలను నిర్మించారని చెబుతారు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
పాండవులు వన వాసంలో ఉండగా అనేక శివాలయాలు నిర్మించారు. అయితే అదే పాండవులు ఈ దేవాలయాల మెట్ల మార్గం ద్వారానే స్వర్గానికి వెళ్లారని చెబుతారు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
అయితే చివరికి ధర్మరాజు ఒక్కడే ఆ స్వర్గానికి ప్రాణాలతో సహా చేరుకోగలిగాడని చెబుతారు. ఈ మెట్ల నిర్మాణం వెనుక కూడా ఒక పౌరాణిక కథ ప్రచారంలో ఉంది.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

ఇక్కడ పాండవులు స్వర్గానికి మెట్ల మార్గం నిర్మించడానికి వీలుగా ఆను నెలల కాలాన్ని ఒక రాత్రిగా మార్చాడు. దీంతో పాండవులు తమ పనిని మొదలు పెట్టారు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

ఈ మెట్లతో పాటు దేవాలయాన్ని నిర్మించే సమయంలో పాండవులు సూర్య కిరణాలను చూడకూడదని నియమం. ఒక వేళ సూర్యుడి వెలుగును చూస్తే పాండవులు నిర్మాణ పనులను ఆపేయాలని చెబుతాడు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
అందువల్లే ఆరునెలల సమయాన్ని ఒక రాత్రిగా మార్చాడని కథనం. పాండవులు ఒకవేళ ఆరునెలల కాలంలో దేవాలయాలతో పాటు మెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే తిరిగి ఆరునెలు వనవాసాన్ని చేయాలనేది షరత్తు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఈ నేపథ్యంలో పాండవులు తమ పనిని చికటిలోనే చేస్తుంటారు. దేవాలయాల నిర్మాణం పూర్తయ్యి మెట్లు నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంటూ ఉంటుంది.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఇంతలో ఇక్కడికి దగ్గరగా వచ్చిన మహిళ ఒక దీపం వెలిగిస్తుంది. దీంతో సూర్యోదయం అయ్యిందని భావించిన పాండవులు తమ పనిని అక్కడితో ఆపేస్తారు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
అందువల్లే మెట్ల నిర్మాణం పరిపూర్ణం కాలేదని చెబుతారు. అటు పై పాండవులు శ్రీ క`ష్ణుడికి ఇచ్చిన మాట ప్రకారం తమ వనవాసాన్ని కొనసాగిస్తారు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
బాతు అనే పేరుతో ఉన్న రాయి నుంచి ఈ దేవాలయాన్ని నిర్మించడం వల్ల ఈ దేవాలయాలకు బాతు కి లడి అని పేరువచ్చినట్లు చెబుతారు. మొత్తం 6 దేవాలయాలను మనం ఇక్కడ చూడవచ్చు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
బాతు అనే పేరుతో ఉన్న రాయి నుంచి ఈ దేవాలయాన్ని నిర్మించడం వల్ల ఈ దేవాలయాలకు బాతు కి లడి అని పేరువచ్చినట్లు చెబుతారు. మొత్తం 6 దేవాలయాలను మనం ఇక్కడ చూడవచ్చు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఇందులో చిన్నగా ఉన్న దేవాలయంలో విష్ణువు ప్రధాన దైవం కాగా, మిగిలిన వాటిలో శివుడు లింగ రూపంలో ఉంటాడు. వైజ్జానిక, వాస్తు పరంగా కూడా బాతు కి లడి ఎంతో ప్రాముఖ్యం కలిగినది.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
సూర్యుడి తుది కిరణాలు ఇక్కడి ప్రధాన దేవాలయంలోని శివుడి పాదాలను తాకుతాయి. భూమి పై ఉన్న నాలుగు నెలల్లో ప్రతి రోజూ సదరు సూర్య కిరణాలు ఇక్కడ ఆ పరమశివుడిని తాకుతాయి.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
పరమశివుడిని సూర్య కిరణాలు తాక కుండా అస్తమించడని చెబుతారు. ఇక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో భీముడు విసిర బండరాయి ఉందని చెబుతారు.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
ఆ రాయికి ఎవరై హాని చేయాలని పోతే ఆ బండ నుంచి రక్తం వస్తుందని చెబుతారు. వీటిని చేరుకోవడానికి చేసే బోటు ప్రయాణం ఎంతో హాయిని కలిగిస్తుంది.

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

బాతు కి లడి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలోని ఈ బాతు కి లడి చేరుకోవాలయంటే న్యూ ఢిల్లీ, చండీపూర్ నుంచి సుమారు 34 గంటల పాటు రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. విమానం ద్వారా ఇక్కడకు చేరుకోవాలంటే మాత్రం 5.45 నిమిషాలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X