Search
  • Follow NativePlanet
Share
» »పువ్వుల రాశిని దేవతా మూర్తిగా భావించే ఈ పండగ ఏదో తెలుసా?

పువ్వుల రాశిని దేవతా మూర్తిగా భావించే ఈ పండగ ఏదో తెలుసా?

బతుకమ్మ పండుగ గురించిన పూర్తి సమాచారం మీ కోసం

తెలంగాణ ప్రజలకు ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకొన్న తర్వాత ప్రభుత్వమే అధికారికంగా ఈ బతుకమ్మ పండుగను నిర్వహిస్తోంది. ఇందుకు కోట్లాది రుపాయలను విడుదల చేస్తోంది. ఇదిలా ఉండగా హిందూ సంప్రదాయంలో పువ్వులతో దేవతలను పూజిస్తాం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజచేయడం ఈ బతుకమ్మ ప్రత్యేకత. దసరాకు రెండు రోజుల ముందు ప్రారంభమయ్యే ఈ పండగ విశేషాలు మీ కోసం...

రాణి రుద్రమదేవి స్నానం చేసిన 'శృంగార బావి' రహస్యాలు మీకు తెలుసా?రాణి రుద్రమదేవి స్నానం చేసిన 'శృంగార బావి' రహస్యాలు మీకు తెలుసా?

ఈ క్షేత్రానికి కాకులకు బద్ధవిరోదం. అందువల్లే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శని చూపు పడదు.ఈ క్షేత్రానికి కాకులకు బద్ధవిరోదం. అందువల్లే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శని చూపు పడదు.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగల్లో బతుకమ్మ ఒకటి. తెలంగాణ సాంస్క`తికతకు ఈ పండుగ ప్రతీక. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చిన పువ్వుల చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube
ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మను చేస్తారు. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది.

ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

అప్పటికే వర్షాలతో చెరువులన్నీ బాగా నీటితో నిండి ఉంటాయి. ఇక రకరకాల పువ్వులు రంగు రంగులో ఆరుబయట పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా ఉంటాయి.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

ఇక బంతి, చేమంతి, నంది వర్ధనం వంటి పూలకు కూడా ఇదే మంచి సమయం. ఇక జొన్న పంట కోతకు సిద్ధంగా ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రక`తి సౌందర్యాన్ని అద్భుతమైన రంగు రంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకొంటారు.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

తెలంగాణ నేల పై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకొంటున్నారు. ఈ సంప్రదాయం ఎలా మొదలయ్యిందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో పురాణ, జానపధ నేపథ్య కథలు కూడా ఉన్నాయి.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

ముఖ్యంగా నవాబులు, భూ స్వాములు పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. ఆ పెత్తందార్లు మహిళలను చెరబట్టేవారు.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

ఇక పెత్తందార్ల ఆక`త్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. అలా ఆత్మహత్యలు చేసుకున్నవారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మ అంటూ పాటలు పాడే వారు.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉన్న మర్మం ఇదే నని చెబుతారు. బతుకమ్మ పండుగ ప్రక`తిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు ఎక్కువగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వస్తుంది.

మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిన ప్రాంతం మన తెలుగు రాష్ట్రాల్లోనే?మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిన ప్రాంతం మన తెలుగు రాష్ట్రాల్లోనే?

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

భూమితో జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకొంటుంది. ఈ సంబరాలు చేసుకునే మహిళలు బొడ్డెమ్మను అంటే మట్టితో దుర్గాదేవిని తయారు చేసి బతుకమ్మతో పాటు నిమజ్జనం చేస్తారు.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

ఇదిలా ఉండగా బతుకమ్మకు సంబంధించిన పురాణ, జానపథ కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన చోళ వంశ చక్రవర్తి భట్టు ధర్మాంగదుడు, భార్య సత్యవతి పుణ్యదంపతులకు బతుకమ్మ జన్మిస్తుంది.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

ఈమెకు చిన్నప్పటి నుంచే అతీత శక్తులు ఉంటాయి. సహచరులు కూడా బతుకమ్మను ఏమి కోరుకుంటే అది నెరవేరేలా వరాలు ఇచ్చేది. అప్పటి నుంచి యువతులు తమకు మంచి భర్తను ఇవ్వాలని కోరుతూ బతుకమ్మను కొలవడం అనవాయితీగా మారింది.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

మొత్తం తొమ్మిది రోజులపాటు కొనసాగే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మను చేస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను చేస్తారు. అదేవిధంగా రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను తయారు చేస్తారు.

బతుకమ్మ, తెలంగాణ

బతుకమ్మ, తెలంగాణ

P.C: You Tube

అదే విధంగా నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు సకినాల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్న ముద్దుల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను తయారు చేస్తారు.

బంగారంతో తయారు చేసిన అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తే సకల ఐశ్వర్యాలు మీ చెంతనే....బంగారంతో తయారు చేసిన అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తే సకల ఐశ్వర్యాలు మీ చెంతనే....

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X