Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటక బీచ్ లు... కళ్లు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యాలు!!

కర్నాటక బీచ్ లు... కళ్లు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యాలు!!

సూర్యుడి లేలేత కిరణాల వెలుగులో స్వచ్ఛంగా, నీలిరంగుతో మెరిసిపోయే జలాలు, బంగారంలా మెరిసిపోయే ఇసుక తిన్నెలు, పక్షులతో పోటీపడుతూ కెరటాల హోరు, ఆ కెరటాలపై ఎగిరెగిరి పడుతుండే పడవలు... ఇలా చెప్పుకుంటే అనంతమైన సముద్ర జలరాశుల సౌందర్యానికి అంతే ఉండదు. కళ్లు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యాన్ని తమలో నింపుకున్న సముద్ర తీరాలు దేశంలోను, ప్రపంచంలోను చాలా ఉన్నాయి.

కర్నాటక రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రదేశం గా గుర్తింపు పొందింది. ఇక్కడ అన్ని వర్గాల పర్యాటకులకు అవసరమైన అనేక ఆకర్షణలు కలవు. యాత్రికులకు, చరిత్ర ప్రియులు లేదా విశ్రాంతి సెలవులు కోరే వారు ఎవరైనా సరే ఈ రాష్ట్రం లో ఆనందించాల్సిందే!!.సముద్ర తీర సౌందర్యంలో కూడా ఏ మాత్రం తీసిపోని కర్ణాటకలో కూడా అనేక సముద్ర తీరాలు మనకు హాయిగా స్వాగతం పలుకుతున్నాయి. ఈ రాష్ట్రంలో 320 కిలోమీటర్ల నిడివితో అరేబియా సముద్ర తీరం అపురూప ప్రకృతి సంపదకు నెలవు. ఈ తీరం వెంబడి ఉన్న కొబ్బరి తోటల ఆహ్లాదంతోపాటు, ఆధ్యాత్మికతను కల్గించే పుణ్యక్షేత్రాలు బోలెడున్నాయి. కర్ణాటకలోని ముఖ్యమైన బీచ్‌లు ఏంటో ఇప్పుడు చూద్దామా..?

ఫ్రీ కూపన్లు: యాత్ర వద్ద హోటళ్లు బుక్ చేసుకోండి 50%+30% ఆఫర్ పొందండి

ఓం బీచ్‌

ఓం బీచ్‌

ఓం బీచ్‌ దీనినే గోకర్ణ అని పిలుస్తుంటారు. బెంగళూరు నగరానికి 525 కిలోమీటర్ల దూరంలోగల ఈ బీచ్‌ దేశ విదేశీ పర్యాటకులకు భూతల స్వర్గంలాంటిదేనని చెప్పవచ్చు. ఈ బీచ్‌లో సేదతీరేం దుకు విదేశీయులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ సముద్రం ఒడ్డునే పరమశివుడి ప్రాచీన ఆలయం మరో ప్రత్యేక ఆకర్షణ. ఆలయం నుంచి కొండల్ని దాటుకుని వెళ్లే ఓం ఆకారంలో రూపుదిద్దుకున్న బీచ్‌లో సేదతీరితే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని సందర్శకుల అభిప్రాయం.సింపుల్ గా వుండే ఈ బీచ్ మీకు జీవితంలో మరపురాణి అనుభవాలను అందిస్తుంది. ఇక్కడే కల కుడ్లు బీచ్, పారడైస్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ అన్నీ కూడా మీ సెలవు రోజులను పూర్తిగా ఆనందింప చేస్తాయి.

Photo Courtesy: ~zipporah~

కర్వార్‌ బీచ్‌

కర్వార్‌ బీచ్‌

విశ్వకవి రవీందన్రాథ్‌ ఠాగూర్‌కు స్ఫూర్తినిచ్చిన కర్వార్‌ బీచ్‌ అందాలు వర్ణణాతీతం. పట్టణానికి ఆనుకుని ఉండే ఈ బీచ్‌లో విహరిస్తుంటే కాలం ఎలా గడుస్తుందో తెలియనంతగా ఉంటుంది. సముద్రం ఒడ్డునే పర్యాటకులను మరింతగా ఆకర్షించే ఉద్యానవనం మరో అద్భుతం.ఈ బీచ్‌కు సందర్శకుల రద్దీ, పర్యాటకుల సంఖ్య అధికం కావటంతో దానికి సమీపంలోనే అనేక ప్రైవేట్‌ రిసార్టులు రూపుదిద్దుకున్నాయి. ఇవి అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉంటాయి. వీటితోపాటు గోకర్ణలో తక్కువ రేటులోనే గదులు లభ్యమవుతాయి. బెంగళూరు నుంచి గోకర్ణకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు... ప్రైవేట్‌ బస్సుల సదుపాయం కూడా ఉంది. అయితే ఈ బీచ్‌ లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పర్యాటకులు జాగ్రత్తలతో మసలుకోవటం శ్రేయస్కరం.

Photo Courtesy: Ayan Mukherjee

మురుడేశ్వర బీచ్‌

మురుడేశ్వర బీచ్‌

మురుడేశ్వర బీచ్‌ కర్ణాటలో మరో పేరెన్నికగల బీచ్‌. ఈ సముద్రం ఒడ్డునే ధ్యానముద్రలో ఉండే పరమేశ్వరుడి విగ్రహం సుదూరం నుంచే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి రాజగోపురం దేశంలోనే అతి ఎత్తైనదిగా రికార్డు సృష్టించింది. కర్ణాటకలోని ఇతర బీచ్‌లతో పోల్చినట్లయితే ఈ బీచ్‌ను అత్యంత సురక్షితమైనదిగా చెప్పవచ్చు. సముద్రంలో 40 అడుగుల వరకు వెళ్లినా ప్రమాదం ఉండదు కాబట్టి.. ఇక్కడికి వచ్చేందుకే పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. బెంగళూరు నుంచి 386 కిలోమీటర్ల దూరంలోని మురుడేశ్వరలో బస చేసేందుకు అతిథి గృహాలు, రిసార్టులు అందరికీ అందుబాటులో ఉంటాయి.

Photo Courtesy: Sunil

మంగళూరు బీచ్‌

మంగళూరు బీచ్‌

మంగళూరు బీచ్ ని పణంబూర్ బీచ్ అని కూడా పిలుస్తారు.ఇది ఇతర బీచ్‌లతో పోలిస్తే కాస్తంత ప్రమాదకరమైనదిగా చెబుతుంటారు. సముద్రం నుంచి అలల తాకిడి అధికంగా ఉండే ఈ బీచ్‌ను చూడాలని పర్యాటకులు తపించిపోతుంటారు. మంగళూరులో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఈ పణంబూర్‌ బీచ్‌ను సందర్శించకుండా వెళ్లరు. అయితే సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండే ఈ బీచ్‌ను ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నారు.

Photo Courtesy: spykster

మల్పె బీచ్‌

మల్పె బీచ్‌

మల్పె బీచ్‌ మరో కర్ణాటకలోని సుందరమైన బీచ్‌. ప్రముఖ ధార్మిక క్షేత్రం ఉడుపికి అత్యంత సమీపంలో ఉన్న ఈ మల్పె బీచ్‌లో విహరిస్తుంటే కాలమే తెలియదని చెబుతుంటారు. ఇటీవలనే ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ మరో ప్రత్యేక ఆకర్షణ. మల్పె బీచ్‌నుంచి సముద్రం లో 20 నిమిషాలు ప్రయాణిస్తే సెయింట్‌ మేరీస్‌ ద్వీపానికి చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి 392 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఉడుపి చేరుకోవచ్చు. బస చేసేందుకు ఇక్కడ హోటళ్లు, కృష్ణ మఠం అతిథి గృహాలు ఆశ్రయం కల్పిస్తాయి.ఇక్కడి పరమ శివుడి విగ్రహం దిగువ భాగంలోగల భూకైలాస్‌ ఘట్టాన్ని వివరించే విగ్రహాలు, ఉద్యానవనం పర్యాట కులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అరేబియా సముద్రం మాటుకు దాగిపోయే సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తపిస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ కల ప్రకృతి అందాలు మీ ఇంద్రియాలను ఫ్రెష్ అప్ చేస్తాయి.

Photo Courtesy: Siddarth.P.Raj

కౌప్ బీచ్

కౌప్ బీచ్

కౌప్ బీచ్ మరొక ప్రధాన బీచ్. ఇది ఉడుపి జిల్లాలో కలదు. చల్లటి గాలులు, పచ్చటి ప్రదేశాలు కల కౌప్ బీచ్ కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులతో కలసి విహరించేందుకు అనువుగా వుంటుంది. ఈ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు కలదు. ఇక్కడ కల లైట్ హౌస్ మరొక ప్రధాన ఆకర్షణ. కౌప్ బీచ్ లో అనేక సినిమా షూటింగ్ లు కూడా జరుగుతూంటాయి.

Photo Courtesy: Subhashish Panigrahi

మరావంతే బీచ్

మరావంతే బీచ్

మరావంతే ఒక అద్భుతమైన బీచ్. మరావంతే బీచ్ ఉడుపి సమీపంలో కలదు. పర్యాటకులకు గొప్ప ఆకర్షణ. ఇక్కడ కోడచాద్రి హిల్స్ నేపధ్యం , వాటి నుండి చూసే అరేబియన్ మహాసముద్రం దృశ్యాలు, పక్కనే కల సుపర్నిక నది గల గలలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. సూర్యుడి బంగారు కిరణాలు ఉదయం వేళ లో మీకు ఎంతో ఆనందం కలిగిస్తాయి. ఈ బీచ్ లో సూర్యాస్తమయం, ఫిషింగ్ బోటు లో ఐలాండ్ ట్రిప్, వంటివి ప్రత్యేకం. విశ్రాంతి సెలవులకు మరావంతే బీచ్ సరైనది.

Photo Courtesy: Ashwin Kumar

సెయింట్ మేరీ ఐలాండ్

సెయింట్ మేరీ ఐలాండ్

సెయింట్ మేరీ ఐలాండ్ మాల్పే బీచ్ కు 6 కి. మీ. ల దూరంలో అరేబియన్ సముద్రం లో వుంటుంది. ఇక్కడ క్రీ.శ. 1498 లో వాస్కో డా గామా తన స్వహస్తాలతో ఉంచిన ఒక శిలువ కూడా కలదు. ఇక్కడ కల ఉప్పు నీటి కయ్యాలు, పర్యాటకులకు, శాస్త్రవేత్తలకు మంచి ఆసక్తిని కలిగిస్తాయి.

Photo Courtesy: Man On Mission

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X