Search
  • Follow NativePlanet
Share
» »ఉత్తర భారతదేశంలో మీకు తెలీని 30 హిల్ స్టేషన్ లు !!

ఉత్తర భారతదేశంలో మీకు తెలీని 30 హిల్ స్టేషన్ లు !!

హిల్ స్టేషన్ లకు వెళ్ళాలంటే అక్కడి అందాలు తనివి తీరా ఆనందించడం అంటే ఎవరికి ఇష్టం వుండదు. అందులోనూ, ఈ హిల్ స్టేషన్ లకు కుటుంబ సమేతంగా వెళితే... వావ్ ... మరువలేని అనుభూతులు, ఏడాది పొడవునా గుర్తు ఉండిపోయే ఆనందాలకు కొదువలేదు. మరి సాధారణంగా హిల్ స్టేషన్ లకు వెళ్ళేవారు ప్రసిద్ధి చెందిన అందరకూ తెలిసిన హిల్ స్టేషన్ లకు వెళ్లేందుకు మొగ్గు చూపుతారు. భారత దేశంలో అందమైన హిల్ స్టేషన్ లు అనేకం కలవు.

వాటిలో కొన్ని ఉత్తర భారత దేశంలోనూ, మరికొన్ని దక్షిణ భారత దేశం లోను కలవు. ప్రస్తుత ఈ వ్యాసం, ఉత్తర భారత దేశం లోని హిల్ స్టేషన్ లు, అది కూడా చాలా మందికి తెలియని అందమైన హిల్ స్టేషన్ లను ఇక్కడ పొందు పరుస్తున్నాం. చిత్ర సహితంగా చూసి ఆనందించండి. తదుపరి మీ పర్యటనలో ప్రణాళిక చేయండి.

అందాల గనులు...అంతు చిక్కని హిల్ స్టేషన్ లు

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

ఝీరూ : ఈశాన్య భారత దేశంలో కల అరుణాచల ప్రదేశ్ లోని సుభాన్సిరి జిల్లా లో కల ఝీరూ ఒక చిన్న మరియు అద్భుత పర్వత నగరం. గత కొన్ని సంవత్సరాలుగా పర్యాటకులు ఈ ప్రదేశానికి అధికంగా వస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుండి 150 కి. మీ. లు కలదు.

ఫోటో క్రెడిట్: MUKESH JAIN

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

తవాంగ్ : అరుణాచల ప్రదేశ్ లోని మరొక అందమైన హిల్ స్టేషన్ తవాంగ్ సముద్ర మట్టానికి సుమారు పది వేల మీ. ల ఎత్తున కల ఈ హిల్ స్టేషన్ దక్షిణ టిబెట్ లోకి వస్తుంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను గావిస్తాయి.

ఫోటో క్రెడిట్: rajkumar1220

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

చిరిమిరి : చత్తీస్ ఘర్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో కల చిరిమిరి ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ కల ప్రసిద్ధ ప్రకృతి దృశ్యాలు ఈ హిల్ స్టేషన్ ను బాగా ప్రాచుర్యంలోకి తెస్తున్నాయి.

ఫోటో క్రెడిట్: Vikassahu60

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

పావగడ : ఇది కర్ణాటకలోని పావగడ కాదు సుమా ! ఈ అందమైన హిల్ స్టేషన్ గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లాలో కలదు.

ఫోటో క్రెడిట్ : Phso2

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

సపూతర : అందమైన ఈ హిల్ స్టేషన్ గుజరాత్ రాష్ట్రంలోని డాంగ్ జిల్లాలో కలదు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి సుమారు వేయి మీ. ల ఎత్తున కలదు. దీని పేరుని బట్టి ఇది ఒక పాముల ప్రదేశం అంటారు. ఇక్కడి స్థానికులు సర్ప ఆకారంలో కల ఈ నది ని పూజిస్తారు.

ఫోటో క్రెడిట్: Mayur.thakare

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

విల్సన్ హిల్స్ : గుజరాత్ లోని మరొక హిల్ స్టేషన్ ఇది. వల్సాడ్ జిల్లాలో కల ఈ హిల్ స్టేషన్ గురరాట్ లోని ప్రసిద్ధ సూరత్ పట్టణం కు సమీపం.

ఫోటో క్రెడిట్: Asim Patel

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

బదోగ్ : హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో కల అతి చిన్న హిల్ స్టేషన్ ఇది. ఈ ప్రదేశం లో నేరో గేజ్ పై ప్రయాణించే కలకా - సిమ్లా రైలు ప్రయాణిస్తుంది. ప్రయాణ అనుభూతులు అందిస్తుంది.

ఫోటో క్రెడిట్: Vishmak

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

చంబా : హిమాచల్ ప్రదేశ్ లోని చంబ జిల్లాలో కల చంబా హిల్ స్టేషన్ ఒక పురాతన పట్టణం. ఇక్కడ ప్రవహించే రావి నదీ ప్రవాహ అందాలు పర్యాటకులను అబ్బుర పరుస్తాయి.

ఫోటో క్రెడిట్: Vjdchauhan

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

చైల్ : హిమాచల్ ప్రదేశ్ లో ఇది ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి సుమారు 2444 మీ. ల ఎత్తున కలదు. ఇక్కడ కనపడే ప్రదేశం ప్రపంచంలో అతి ఎత్తైన ఒక క్రికెట్ గ్రౌండ్

ఫోటో క్రెడిట్: Georgian Chail

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

ఖజ్జియార్ : హిమాచల్ ప్రదేశ్ లోని స్విట్జార్లాండ్ కు స్వాగతం. అవును ...అంతులేని పచ్చదనం కల ఈ ప్రదేశం ఈ పేరు తోనే పిలువబడుతుంది.

ఫోటో క్రెడిట్: Sandeep Brar Jat

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

ఖజ్జియార్ : హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో కల ఈ హిల్ స్టేషన్ చేరుటకు బస్సు లు తరచుగా లేవు. స్వంత వాహనాలలో వెళ్ళుట ఉత్తమం. ఇక్కడ కల వసతి సౌకర్యాలకు ఫారెస్ట్ డిపార్టుమెంటు వారి ముందస్తు అనుమతులు కావాలి.

ఫోటో క్రెడిట్: SriniG

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

కుఫ్రి : హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా జిల్లా లో ఇది ఒక చిన్న హిల్ స్టేషన్. స్థానిక భాష లో కుఫ్రి అంటే సరస్సు అని అర్ధం చెపుతారు. ఇక్కడ కల ఒక సరస్సు కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది.సిమ్లా పట్టణం నుండి కేవలం 13 కి. మీ. ల దూరం మాత్రమే.

ఫోటో క్రెడిట్: Shahnoor Habib Munmun

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

రేవల్సర్ : రేవల్సర్ హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ లోని మంది జిల్లా లో కలదు. సముద్ర మట్టానికి 1360 మీ. ల ఎత్తులో కల ఈ ప్రదేశం మంది పట్టణానికి 25 కి. మీ. ల దూరం మాత్రమే. బౌద్ధ, హిందూ, సిఖ్ మత ధర్మాలు ఇక్కడ బాగా కనపడతాయి.

ఫోటో క్రెడిట్: John Hill

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

పత్ని టాప్ : జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని ఉదంపూర్ జిల్లాలో ఈ హిల్ స్టేషన్ కలదు. ఈ హిల్ స్టేషన్ పారా గ్లైడింగ్ క్రీడలు ప్రసిద్ధి చెందినది.

ఫోటో క్రెడిట్: Extremehimalayan

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

ఆరు : జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంత నాగ్ జిల్లాలో కల ఆరు మరొక అందమైన హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ పహల్గాం పట్టణానికి 12 కి. మీ. ల దూరం మాత్రమే.

ఫోటో క్రెడిట్: Cyberhaider

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మలై మహాదేస్వర కొండలు : కర్నాటక రాష్ట్రంలోని చామరాజ నగర జిల్లా లో కల మలై మహాదేస్వర కొండలు ఆధ్యాత్మిక పరంగానే కాక ఒక చల్లని పర్వత నగరం గా కూడా ప్రసిద్ధి కెక్కాయి. ఈ ప్రదేశం బెంగుళూరు నుండి 212 కి. మీ. లు, మైసూరు నుండి 150 కి. మీ. ల దూరం లో కలదు. ఇక్కడ కల ఈశ్వరుడి ఆలయం బాగా ప్రసిద్ధి చెందినది.

ఫోటో క్రెడిట్: Tumkurameen

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

చిన్న కణాల్: కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కల ఈ చిన్న హిల్ స్టేషన్ అనేక జలపాతాలను కూడా కలిగి, ఒక శక్తి కేంద్రంగా పిలువా బడుతోంది.

ఫోటో క్రెడిట్: Augustus Binu

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

రానిపురం : రానిపురం హిల్ స్టేషన్ కేరళ లోని కాసర్గోడ్ జిల్లాలో కల ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడి వాతావరణం పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది.

ఫోటో క్రెడిట్: Bibu Raj

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

గవి : కేరళ రాష్ట్రంలోని పాతానం తిట్ట జిల్లాలో కల ఈ చిన్న హిల్ స్టేషన్ చాలా అందమైనది. కొల్లం మరియు తమిళనాడు లోని మదురై మార్గం లో కల వండి పెరియార్ అనే ఊరి నుండి ఇది 28 కి. మీ. ల దూరంలో కలదు.

ఫోటో క్రెడిట్: Arun Suresh

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

పచ్చ మారి : సాత్పూరా పర్వత శ్రేణులలో కల మధ్య ప్రదేశ్ లోని ఈ హిల్ స్టేషన్ "సాత్పూరా కి రాణి" అని పిలువ బడుతుంది. ఎన్నో సుందర దృశ్యాలతో పాటు ఇక్కడ కొన్ని గుహలు కూడా కలవు. ఈ గుహలను పాండవులు తమ వనవాస సమయంలో నిర్మించారనే ప్రతీతి కలదు.

ఫోటో క్రెడిట్: Abhayashok

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

పచ మరి : మహాభారత కాలం నాటి పాండవులచే నిర్మించబడిన గుహలు

ఫోటో క్రెడిట్: LRBurdak

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మల్షేజ్ ఘాట్ : పచ్చని గ్రామాన్ని తలపించే మల్షేజ్ ఘాట్ ను - దీని గుండా ప్రవహించే నదులు, దేశ సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించే చారిత్రిక కోటలు, వర్షాకాలంలో స్వాగతం పలుకుతున్నట్టు ఉండే ఇక్కడి జలపాతాలు, అభాయారణ్యాల్లో అందమైన పుష్పాలు, వివిధ వృక్ష జాతులు ప్రత్యేకంగా కనబడతాయి. ఇది మహారాష్ట్రలోని పూనే జిల్లాలో కలదు.

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

జోవాయి : మేఘాలయ రాష్ట్రంలోని జయంతియా హిల్స్ జిల్లాలో ఈ ప్రసిద్ధ హిల్ స్టేషన్ కలదు. దీని చుట్టూ పట్ల అనేక పర్యాటక ఆకర్షణలు కలవు.

ఫోటో క్రెడిట్: Psihrishi

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

చంపి : ఈశాన్య భారత దేశంలోని మిజోరం రాష్ట్రంలో ఈ అందమైన హిల్ స్టేషన్ కలదు. ఇండియా మరియు మయన్మార్ దేశాల సరిహద్దు ప్రాంతంగా ఇది కలదు.

ఫోటో క్రెడిట్: Bogman

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

కొహిమా : ఈశాన్య భారత దేశంలోని ఒక రాష్ట్రమైన నాగ లాండ్ రాజధాని కొహిమా ఒక సుందరమైన హిల్ స్టేషన్. ఈ రాష్ట్రం బర్మా దేశంతో సరిహద్దు కలిగి వుంది.ఇక్కడ నాగా లాండ్ రాష్ట్ర కార్యాలయాలు కూడా కలవు.

ఫోటో క్రెడిట్: PP Yoonus

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

కొహిమా: కొహిమా మార్కెట్ వీధులలో వ్యాపారం చేసే ఒక సాంప్రదాయక మహిళా. కంటికి ఇంపు అయిన ఎర్రని మేరప కాయలు

ఫోటో క్రెడిట్: PP Yoonus

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

కోరాపుట్ : ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఒక అందమైన పట్టణం. ఇది అక్కడ కల జగన్నాధ దేవాలయానికి ప్రసిద్ధి. ఇది పూరి జగన్నాధ ఆలయం నిర్మాణం పోలి వుంటుంది. ఇక్కడ అన్ని మతాల వారికి ప్రవేశం కలదు.

ఫోటో క్రెడిట్: MKar

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

లా చుంగ్ సిక్కిం రాష్ట్రం లో కల ఒక హిల్ స్టేషన్ లాచుంగ్. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడువేల మీ. ల ఎత్తున కలదు. ఇది లాచేన్ మరియు లాచుంగ్ నదుల సంగమ ప్రదేశంలో కలదు.

ఫోటో క్రెడిట్: Jaiprakashsingh

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

సిరుమలై : ఈ హిల్ స్టేషన్ తమిళనాడు లోని దిండిగల్ పట్టణానికి సుమారు 25 కి. మీ. ల దూరం లో కలదు. ఈ హిల్ స్టేషన్ లో అనేక ఎత్తైన కొండలు చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Harish Kumar Murugesan

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

మీకు తెలియని హిల్ స్టేషన్ లు !!

ఔలి : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణులలో కల అందమైన ఈ ఔలి హిల్ స్టేషన్ లో ఎపుడూ మంచు కురుస్తూ చల్లగా వుండి ఆహ్లాదంగా వుంటుంది.

ఫోటో క్రెడిట్: Mandeep Thander

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X