Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తమిళనాడులో గత వైభవ నిర్మాణాలు చాలానే ఉన్నాయి. ఇది వరకే మనం ఆలయాల గురించి తెలుసుకున్నాం.

By Venkatakarunasri

తమిళనాడులో గత వైభవ నిర్మాణాలు చాలానే ఉన్నాయి. ఇది వరకే మనం ఆలయాల గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అక్కడి ప్రసిద్ధి గాంచిన రాజభవనాలు ఎలా నిర్మించారు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం ..! ప్రస్తుతం కొన్ని రాజభవనాలు, చారిత్రక కట్టడాలు మాత్రమే చూడటానికి అనుకూలంగా ఉన్నాయి ఇవే ఇప్పుడు తమిళనాడు పర్యాటక రంగానికి ప్రసిద్ధ చారిత్రక కట్టడాలుగా ఉన్నాయి.

చరిత్ర ప్రకారం గమనిస్తే, తమిళనాడు రాష్ట్రాన్ని రాజ్యం) పూర్వం ఎన్నో రాజవంశాలు పరిపాలించినాయి. వాటిలో చోళ, పాండ్య, పల్లవ మరియు చేర రాజవంశాలు ముఖ్యమైనవి మరియు ప్రధానమైనవి కూడా. తమిళనాడు చరిత్ర మొత్తం చాలా వరకు ఈ నాలుగు రాజవంశీయుల చుట్టే తిరుగుతుంది.

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తిరుమలై నాయకర్ మహల్

తిరుమలై నాయకర్ మహల్ మధురై నగరంలో కలదు. దీనిని 16 వ శతాబ్ధంలో ఇండో - సార్సెనిక్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ప్యాలెస్ యొక్క సీలింగ్ పై విష్ణు మరియు శివుని జీవిత గాథలు చెక్కబడి ఉంటాయి. దీనిలో 58 అడుగుల ఎత్తు గల 248 స్తంభాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ప్యాలెస్ యొక్క శిల్ప శైలి ఒక అద్భుతం అనే చెప్పాలి.

చిత్ర కృప : Srikant Kuanar

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

పద్మనాభపురం ప్యాలెస్

క్రీ. శ. 1601 లో కట్టిన పద్మనాభపురం ప్యాలెస్ కన్యాకుమారి పట్టణంలో కలదు. ఈ ప్రదేశాన్ని ట్రావేన్కోర్ వంశీయులు పరిపాలించడం చేత ఈ ప్యాలెస్ కేరళ స్టైల్ లో కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ లో గల విభాగాలు : రాణి మాత ప్యాలెస్, కౌన్సిల్ చాంబర్ మొదలైనవి.

చిత్ర కృప : Aviatorjk

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

చెట్టినాడు మాన్షన్

చెట్టినాడు మాన్షన్ ఒక హెరిటేజ్ భవనం. దీనిని కరైకుడి లో చెట్టినార్లు క్రీ.శ. 1902 వ సంవత్సరంలో నిర్మించారు. ఈ మాన్షన్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ పర్యాటకులకు అతిథి గృహంగా సేవలందిస్తున్నది. ఇక్కడ ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ మరియు పుస్తకాలతో కాలక్షేపం చేయటానికి లైబ్రెరీ వంటి సౌకర్యాలు కలవు.

చిత్ర కృప : Jean-Pierre Dalbéra

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

ఫర్న్ హిల్స్ ప్యాలెస్

ఊటీ లోని ఫర్న్ హిల్స్ ప్యాలెస్ మైసూర్ మహారాజులకు వేసవి విడిదిగా ఉండేది. క్రీ.శ. 1844 వ సంవత్సరం లో స్విస్ ఛలెట్ నిర్మాణ శైలి లో దీనిని నిర్మించారు. పచ్చని కొండల్లో నిర్మించిన ఈ రాజభవనం చూడటానికి అందంగా ఉంటుంది. ఈ భవనాన్ని పరిశీలిస్తే నాటి రాజుల జ్ఞాపకాలు అనేకం గుర్తుకువస్తాయి.

చిత్ర కృప : Ascidian

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తముక్కుం ప్యాలెస్

తముక్కం ప్యాలెస్ మధురై జిల్లాలో కలదు. నాయక్ వంశానికి చెందిన రాణి మంగమ్మాళ్ కి ఈ భవనం వేసవి విడిదిగా ఉండేది. కొలోనియల్ పాలిస్తున్న సమయంలో దీనిని పరిపాలన భవనంగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ భవనాన్ని మహాత్మా గాంధీ మ్యూజియంగా మార్చారు.

చిత్ర కృప : Avionsuresh

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తమిళనాడు చారిత్రక కట్టడాలు !

తంజావూర్ ప్యాలెస్

తంజావూర్ మరాఠా ప్యాలెస్ క్రీ.శ. 1674 - 1855 వరకు పాలించిన భోంస్లే వంశానికి చెందినది. కానీ అంతకు ముందే దీనిని నాయక్ వంశానికి చెందిన వారు కట్టించినట్లు ఆధారాలు లభించినాయి. ఈ ప్యాలెస్ ను 'అరంమనై' అని కూడా పిలుస్తారు. ఇది తంజావూర్ లో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉన్నది.

చిత్ర కృప : Melanie M

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X