Search
  • Follow NativePlanet
Share
» »ఈ ఘాండ్రిపులు, కిలకిల రావాలు విన్నారా?

ఈ ఘాండ్రిపులు, కిలకిల రావాలు విన్నారా?

తమిళనాడులోని అభయారణ్యాలకు సంబంధించిన కథనం

తమిళనాడు టూర్ కు వెళ్లామన్న తక్షణం మన ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే ప్రశ్న ఏ ఏ దేవాలయాలు చూశారు. అవునా కాదా? అయితే తమిళనాడులో దేవాలయాలే కాదు ప్రకృతి అందాలకు నిలయమైన ఎన్నో పక్షి, జంతు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అయితే చాలా మంది తెలియక తమిళనాడును తమ టెంపుల్ టూరిజం కోసమే ఎంపిక చేసుకొంటారు. అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచూర్యం పొందిన అన్నా జూ, వేదాంతగల్ పక్షి సంరక్షణ కేంద్రం, ఇందిరాగాంధీ అభయారణ్యం తదితర ఎన్నో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఈ తమిళనాడులో ఉన్నాయి. వీటిలో ఉదయం, సాయంత్రం సమయంలో ఎలిఫెంట్, లయన్ సఫారీలు కూడా అందుబాటులో ఉండటం విశేషం ఈ నేపథ్యంలో ఉత్తమమైన 5 అభయారణ్యాలకు సంబంధించిన కథనం మీ కోసం...

ఇందిరాగాంధీ వన్యప్రాణి అభయారణ్యం

ఇందిరాగాంధీ వన్యప్రాణి అభయారణ్యం

P.C: You Tube

తమిళనాడులోని ప్రముఖ పట్టణమైన కొయంబత్తూర్ నుంచి 93 కిలోమీటర్ల దూరంలో ఈ ఇందిరాగాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనిని అన్నామలై అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏనుగులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, జింకలు, ఎగిరే ఉడతలు, అడవి పిల్లులు ఒకటేమిటి ఎన్నో రకాల జంతువులను ఇక్కడ మనం చూడవచ్చు. అదే విధంగా 315 జాతుల సీతాకోక చిలుకలు కూడా ఇక్కడ మన చుట్టూనే ఎగురుతూ కనిపిస్తాయి. 250 జాతుల పక్షులకు నిలయం ఈ వన్యప్రాణి అభయారణ్యం. రెండువేల జాతులు వ`క్షాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు.

సందర్శనకు ఉత్తమ సమయం....డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ

సమయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ

మదుమలై వన్యప్రాణి అభయారణ్యం

మదుమలై వన్యప్రాణి అభయారణ్యం

P.C: You Tube

దక్షిణ భారత దేశంలో ఏనుల సంరక్షణ కేంద్రానికి ప్రఖ్యాతి గాంచిన అభయారణ్యంలో మదుమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంటుంది. ఇక్కడ కేవలం ఏనుగులనే కాకుండా చిరుతలు, జింకలు, తదితరాలను కూడా దగ్గర నుంచి చూడవచ్చు. ఇక్కడి ఎలిఫెంట్ సఫారీ మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. తెప్పకాడు వద్ద ప్రారంభమయ్యే సఫారా దాదాపు గంటపాటు కొనసాగుతుంది.

సందర్శనకు ఉత్తమమైన సమయం....డిసెంబర్ నుంచి జులై వరకూ

సమయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకూ

ఎలిఫెంట్ సఫారీ...ఉదయం ఏడు గంటల నుంచి 8 గంటల వరకూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ

అన్నా పార్క్

అన్నా పార్క్

P.C: You Tube

చెన్నై రైల్వే స్టేషన్ నుంచి అన్నా జూ పార్క్ కేవలం 38 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. భారత దేశంలోని ఉత్తమమైన జూ పార్కుల్లో అన్నా జూ పార్క్ మొదటి వరుసలో ఉంటుంది. మొత్తం 602 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నా ఈ పార్క్ లో 138 జాతుల జంతువులను చూడవచ్చు. ఇక్కడ అంతరించే స్థితికి చేరుకున్న 46 జాతుల జంతువులను, పక్షులను సంరక్షిస్తున్నారు. లయన్, ఎలిఫెంట్ సఫరీ ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ ఉన్న గ్రంధాలయంలో మనం జంతు సంరక్షణకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను చూడవచ్చు.

సందర్శనకు ఉత్తమ సమయం...నవంబర్ నుంచి ఫిబ్రవరి

సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ, మంగళవారం సెలవు.

వేదాంత గల్ పక్షి సంరక్షణ కేంద్రం

వేదాంత గల్ పక్షి సంరక్షణ కేంద్రం

P.C: You Tube

భారత దేశంలోని అతి ప్రాచీన పక్షి సంరక్షణ కేంద్రాల్లో ఈ వేదాంతగల్ పక్షి సంరక్షణ కేంద్ర కూడా ఒకటి. పక్షుల సహజ ఆవాస స్థలాల్లోనే వాటిని వీక్షించవచ్చు. దాదాపు 30 హెక్టర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యంలో దాదాపు లక్ష పక్షుల కిలకిల రావాలను ఏక కాలంలో వినడం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. ఈ సంరక్షణ కేంద్రంలోనే ఉన్న రెండు వాచ్ టవర్ల ద్వారా పక్షులను చూడటానికి అవకాశం ఉంది. చెన్నైకు అతి దగ్గరగా ఉన్నా పక్షి సంరక్షణ కేంద్రం ఉంటుంది.

సందర్శనకు ఉత్తమ సమయం....నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ

సమయం....ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ

కోడిక్కరై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

కోడిక్కరై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

P.C: You Tube

తమిళనాడులోని తంజావూర్ కు దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఈ కోడిక్కరై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడకు ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఫ్లెమింగో, నోటి కొంగలు వంటి వలస పక్షులు వస్తాయి. దాదాపు 21.47 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎలుగుబంట్లు, మచ్చల జింకలకు ఆవాసకేంద్రం కూడా. ఇక్కడికి దగ్గర్లోనే సముద్ర తీర ప్రాంతం ఉంది. అక్కడ మనకు డాల్ఫిన్స్ ను కూడా చూసే అవకాశం ఉంటుంది.

సందర్శనకు ఉత్తమ సమయం నవంబర్ నుంచి జనవరి

సమయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X