» »మతేరన్ లోని అందమైన సైట్ సీఇంగ్ ప్రదేశాలు

మతేరన్ లోని అందమైన సైట్ సీఇంగ్ ప్రదేశాలు

Written By: Venkatakarunasri

అన్ని హిల్ స్టేషన్ లాగే మతేరన్ లో కూడా చూడవలసిన ప్రదేశాలు అధికంగానే ఉన్నాయి. వాటిలో వ్యూ పాయింట్లు ప్రత్యేకం. ఇవి సుమారు 40 వరకు ఉన్నాయి. మతేరన్ చుట్టుపక్కల ప్రదేశాలు ఎంతో ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా ఉంటాయి. పురాతన భవనాలు, వారసత్వ సంపద లు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలే. ఇక్కడ పక్షులను తిలకించడం, బోట్ షికారు వంటి వాటితో కాలక్షేపం చేయవచ్చు.

మతేరన్, మహారాష్ట్రలోని అద్భుత పర్యాటక ప్రదేశం. పశ్చిమ కనుమలలోని పర్వత ప్రాంతంలో గల ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 2560 మీటర్ల ఎత్తున కలదు. పూణే, ముంబై పట్టణాలకు సమీపంలో ఉండటంవల్ల వారాంతంలో, సెలవుదినాలలో ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. మతేరన్ అంటే తల మీది అడవి అని అర్థం.

చార్లొట్టే సరస్సు

చార్లొట్టే సరస్సు

చార్లొట్టే సరస్సు మతే రన్ లో గల ప్రసిద్ధ విహార కేంద్రం. ఇక్కడ పక్షులను తిలకించడం, ప్రియమైనవారితో లేదా కుటుంబసభ్యులతో కలిసి సరదాగా ఒడ్డున నడవటం, బోట్ షికారు వంటి కాలక్షేపాలు చేపట్టవచ్చు. సరస్సుకు కుడివైపున పురాతన పిసర్నాథ్ దేవాలయాన్ని సందర్శించవచ్చు.

హార్ట్ పాయింట్

హార్ట్ పాయింట్

ఒడిదుడుగులు ఉండే నగరజీవితం నుండి ప్రశాంత వాతావరణాన్ని కావాలనుకునేవారు ఈ ప్రదేశాన్ని తిలకించవచ్చు. ఎత్తున ఉండే ఈ ప్రదేశం నుండి పశ్చిమ కనుమల పర్వత శ్రేణులను వీక్షించవచ్చు.

పార్క్యూ పైన్ పాయింట్

పార్క్యూ పైన్ పాయింట్

మతేరన్ లో పర్యాటకులను ఆకట్టుకొనే మరో ప్రదేశం పార్క్యూ పైన్ పాయింట్. పార్క్యూ పైన్ అనే పిట్ట ను పోలి ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. క్కడ దగ్గరగా కనబడే కథేడ్రల్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రబల్ ఘడ్ కోట, సూర్యాస్తమయ దృశ్యం ఇక్కడి నుండి ఎంతో అధ్భుతంగా కనబడతాయి.

శివాజీ నిచ్చెన

శివాజీ నిచ్చెన

శివాజీ నిచ్చెన తప్పక చూడవలసిన ప్రాంతం. మతేరన్ లో ని అనేక ఆకర్షణీయ ప్రాంతాలలో వన్ ట్రీ హిల్ పాయింట్ ఒకటి. ఇక్కడ ప్రధాన ఆకర్షణ శివాజీ నిచ్చెన. మతేరన్ లోయకు కలిపే ఈ ప్రాంతం నిచ్చెన మెట్ల ఆకారం కల్గి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. శివాజీ మహారాజు ఈ మార్గాన్ని వేటకు, వ్యాహ్యాళి కి వాడేవారని చరిత్ర తెలుపుతుంది.

ప్రాబల్ కోట

ప్రాబల్ కోట

చారిత్రిక ప్రాముఖ్యం వున్న ప్రబల్ కోట మరాఠా, ముఘల్ కాలం నాటిది. ఇది మతేరన్ లో ఉంది. ఈ పురాతన కట్టడం భారతీయ సంప్రదాయంఫై మరాఠా నిర్మాణ, సాంస్కృతిక ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. కోట శిఖరప్రాంతంలో ఒక చిన్న కృత్రిమ చెరువు ఉంది.

పర్వతారోహకులకు

పర్వతారోహకులకు

మతేరన్ ప్రాంతం భూలోక స్వర్గాన్ని తలపిస్తూ ఉన్నందున, ఈ ప్రాంతం కూడా దిగ్బ్రమ పరిచే జలపాతాలు, పచ్చదనం కల్గి ఉండటం ఆశ్చర్యం కల్గించే విషయం కాదు.ఇది పర్వతారోహకులకు సాహసకృత్యాలు చేసేవారికి వ్యక్తిగతంగా ఎంతో ప్రియమైనది.

కోతులు

కోతులు

మతే రన్ దట్టమైన అడవి ప్రాంతంలో విస్తరించి ఉన్నందున పర్యాటకులు కొన్ని ప్రదేశాలలో చొరబడటానికి వీలుపడదు. కోతులు దారిపొడవునా స్వేచ్ఛగా విహరిస్తూ దర్శనం ఇస్తుంటాయి. కోతులు పాస్టిక్ వస్తువులను లాక్కొని వెళ్తాయి కనుక ఇక్కడ వాటిని తీసుకురావటాన్ని నిషేధించారు.

మతేరన్ ఎలా చేరుకోవాలి ?

మతేరన్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం :

ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ మతేరన్ నుండి కేవలం 100 కి. మీ ల దూరంలో కలదు.

రైలు మార్గం :

మతేరన్ కు 11 కిలోమీటర్ల దూరంలో నేరాల్ రైల్వే స్టేషన్ కలదు.

రోడ్డు మార్గం :

ముంబై, పూణే మరియు ఇతర చుట్టుపక్కల ప్రాంతాల నుండి మతేరన్ కు లగ్జరీ బస్సులు మరియు పలు ప్రవేట్ మరియు ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.