Search
  • Follow NativePlanet
Share
» »ఈ పర్యాటక నగరాల్లో బిర్యానీ రుచులు వేరయా?

ఈ పర్యాటక నగరాల్లో బిర్యానీ రుచులు వేరయా?

భారత దేశంలో అత్యంత రుచికరంగా ఉండే బిర్యానీలకు సంబంధించిన కథనం.

బిర్యానీ అన్న తక్షణం మనకు హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే బిర్యానీకి, హైదరాబాద్ కు అవినాభావ సంబంధం అటువంటిది. అయితే ఒక్క హైదరాబాద్ లో బాస్మతీ బీయ్యంతో వండే బిర్యానీ రుచికి ఏ మత్రం తీసిపోకుండా కొన్ని నగరాల్లో బిర్యానీ ఘుమ ఘుమలు బిర్యానీ ప్రేమికులను ఆహ్వానిస్తున్నాయి. అటువంటి విభిన్న బిర్యానీ రుచుల సమహారం మీ కోసం. ఎప్పుడైన పర్యాటకంలో భాగంగా అక్కడికి వెళ్లినప్పుడు ఈ బిర్యానీ రుచులను కూడా చూసేయండి.

అంబూర్ స్టార్ బిర్యానీ, చెన్నై

అంబూర్ స్టార్ బిర్యానీ, చెన్నై

Top: You Tube

చెన్నైలోని వేలాచెర్నీలో దొరికే అంబూర్ స్టార్ బిర్యానీ కోసం నగరంలో చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. సాంబా రైస్ తో చికెన్, మటన్ బిర్యానీ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇద్దరికి రూ.450 ఖర్చవుతుంది.

యా మోయినుద్దీన్ బిర్యానీ సెంటర్

యా మోయినుద్దీన్ బిర్యానీ సెంటర్

Top: You Tube

చెన్నైలోని ఆర్.సీ చర్చ్ స్ట్రీట్ లో యా మోయినుద్దీన్ బిర్యానీ కోసం పెద్ద క్యూ ఉంటుంది. కనీసం అరగంట వేచిచూస్తేకాని మనకు టేస్టీ టేస్టీ బిర్యానీ దొరకదు. ఇక్కడ చికెన్ మటన్ బిర్యానీకి వంకాయచెట్నీ ఇవ్వడం ప్రత్యేకత.

తుండే కాబాబీ, లక్నో

తుండే కాబాబీ, లక్నో

లక్నో లోని తుండే కాబాబీ లో దొరికే బిర్యానీ చాలా ఫేమస్. అసలు సిసలైన బిర్యానీ రుచి కోసం ఇక్కడికి వెళ్లాల్సిందే. రైతాతో పాటు బిర్యానీ తింటూ ఉంటే చెబుతుంటే నోనూరుతోంది కదూ? ఇద్దరికి రూ.300 ఖర్చవుతుంది.

వాహిద్ బిర్యానీ, లక్నో

వాహిద్ బిర్యానీ, లక్నో

Top: You Tube

దాదాపు 55 రకాల దినుసులతో వండే వాహిద్ బిర్యానీ కోసం ప్రజలు ఎగబడుతూ ఉంటారు. లక్నోకు పర్యాటకానికి వెళ్లిన వారిలో ఈ వాహిద్ బిర్యానీ తినకుండా ఎవరూ వెనుదిరగరు. ఇద్దరికి రూ.300 ఖర్చవుతుంది.

కరీమ్స్, న్యూ ఢిల్లీ

కరీమ్స్, న్యూ ఢిల్లీ

Top: You Tube

న్యూ ఢిల్లీలో కరీమ్స్ రెస్టోరెంట్ లో దొరికే బిర్యానీ ఘుమ ఘుమలు మరెక్కాడ దొరకవు. అందుకే నిజాముద్దీన్ లోని ఈ రెస్టోరెంట్ కు బిర్యానీ లవర్స్ క్యూ కడుతూ ఉంటారు. ఇద్దరికి రూ.800 ఖర్చవుతుంది.

కఫే నూరాని, ముంబై

కఫే నూరాని, ముంబై

Top: You Tube

ముంబైలో అత్యంత ప్రాచూర్యం చెందిన బిర్యానీ పాయింట్ కఫే నూరాని. చికెన్ టిక్కా బిర్యానీ ఇక్కడ ప్రత్యేకం. దీని కోసం ఎంత సేపైనా వేచి చూస్తారు. ఇద్దరు ఇక్కడ బిర్యానీ తినడానికి రూ.750 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అర్సాలన్, కొలకత్తా

అర్సాలన్, కొలకత్తా

Top: You Tube

కొలకత్తాలో చాలా మంది బిర్యానీ లవర్స్ అర్సాలన్ కే తమ ఓటు వేస్తారు. ఇక్కడ మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది. దాదాపు ఇద్దరు ఇక్కడ బిర్యానీ తినడానికి రూ.700 ఖర్చవుతుంది.

బవాచీ, హైదరాబాద్

బవాచీ, హైదరాబాద్

Top: You Tube

బిర్యానీ అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది బవాచీ. అయితే హైదరాబాద్ లో బిర్యానీ అంటే చాలా మంది ఓటు మాత్రం బవాచీనే. ఇక్కడ బిర్యానీ కోసం క్యూలో నిలబడి ఉంటారు. ఇద్దరు బిర్యానీ తినడానికి రూ750 చెల్లించాల్సి ఉంటుంది.

ప్యారడైజ్

ప్యారడైజ్

Top: You Tube

ప్రస్తుతం ప్యారడైజ్ బిర్యానీ హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కూడా దొరుకుతుంది. ఇక్కడ బిర్యానీ కొంత ఖరీదైనదే. అయితే రుచి కూడా అంతే బాగుంటుంది. అందువల్లే బెంగళూరులో ఉన్న వారిలో ఎక్కవ మంది బిర్యానీ తినాలంటే ఇక్కడికే వెలుతుంటారు. ఇద్దరు బిర్యానీ తినడానికి రూ.1000 ఖర్చు చేయాలి.

షాబాద్, హైదరాబాద్

షాబాద్, హైదరాబాద్

Top: You Tube

హైదరాబాద్ లోని షాబాద్ లో ఫిష్, ప్రాన్ బిర్యానీ చాలా బాగుంటుంది. హై కోర్టు రోడ్డులో ఉన్న ఈ రెస్టోరెంట్ ఎప్పుడూ బిర్యానీ లవర్స్ తో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇద్దరు ఇక్కడ తినడానికి రూ.850 ఖర్చవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X