Search
  • Follow NativePlanet
Share
» »ఏనుగుమ్మ ఏనుగు మీ ఊరొచ్చామమ్మా, మా వినోదం ఎక్కడమ్మా?

ఏనుగుమ్మ ఏనుగు మీ ఊరొచ్చామమ్మా, మా వినోదం ఎక్కడమ్మా?

భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏనుగుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల గురించిన కథనం.

By Kishore

జంతు ప్రేమికులైన మీకు ఈ కథనం నచ్చుతుందని అనుకుంటున్నాం. విశాల భారత దేశంలో విభిన్న భౌగోళిక పరిస్థితులు మనకు కనిపిస్తాయి. అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ జంతు, వృక్షజాలం మనుగడ సాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే భారత దేశంలో అతి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సృష్టి అద్భుత జంతుజీవిలో ఒకటిగా చెప్పబడే ఏనుగులు మనుగడ సాగిస్తున్నాయి. ఈ ఏనుగులు పురాణ కథల్లో కూడా మనకు కనిపిస్తాయి. అటువంటి ఏనుగులకు నిలయమైన పెరియార్ నేషనల్ పార్క్, జైపూర్, జోర్హత్, పున్నత్తూర్ కొట్టా, కబిని వంటి కొన్ని ప్రాంతాల గురించి ఇక్కడ వివరించాము. పర్యాటకంలో భాగంగా ఆయా ప్రాంతాల వద్దకు వెళ్లినప్పుడు తప్పక ఆ సంరక్షణ కేంద్రాలకు వెళ్లి రండి.

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

పెరియార్ నేషనల్ పార్క్, కేరళ

P.C: You Tube

పెరియార్ నేషనల్ పార్క్ కేరళలో ఉంది. అంతరించిపోయే స్థితిలో ఉన్న అనేక జంతువులు, పక్షులను ఈ అభయారణ్యంలో సంరక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏనుగుల ఆహారానికి అవసరమైన వెదురు, పనస వంటి చెట్లు, నీటి కుంటలు వంటివి ఎన్నో ఉన్నాయి. ఇందులో కొన్ని సహజసిద్ధంగా ఏర్పడినవి కాగా, మరికొన్ని స్థానిక అటవీశాఖ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసినవి. అందువల్ల ఇక్కడ ఏనుగు సంతతి బాగా పెరుగుతూ ఉంది. పర్యాటకులు ఈ పెరియార్ నేషనల్ పార్క్ లో ఎంతసేపైనా గడపడానికి అవకాశం కల్పిస్తారు. అందువల్ల ఒక రోజు మొత్తం ఏనుగు దినచర్యను గమనించడానికి వీలుకలుగుతుంది. ఇందుకు ముందస్తు అనుమతి అవసరం.

జైపూర్, రాజస్థాన్

జైపూర్, రాజస్థాన్

P.C: You Tube

రాజస్థాన్ లోని జైపూర్ నగర శివారుల్లో ఏనుగు సంరక్షణ గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఏనుగులను చూడటమే కాకుండా మీరు ఒక వాలెంటీర్ గా మారి వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవచ్చు. అంటే వాటికి ఆహారం తినిపించడం, స్నానం చేయించడం వంటి కార్యక్రమాలు చేయవచ్చు. అంతేకాకుండా ఏనుగుల తలకు ఆయిల్ మసాజ్ కూడా చేయవచ్చు. భారత దేశంలో ఏనుగులతో ఇంత సన్నిహితంగా గడిపే అవకాశం మరెక్కడా దొరకదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

జోర్హాత్, అస్సాం

జోర్హాత్, అస్సాం

P.C: You Tube

ఇక్కడ అంతగా ప్రాచూర్యంలోనికి అభయారణ్యం ఉంది. దాని పేరే హొలాన్ గాపర్ గిబ్బన్ అభయారణ్యం. ఇక్కడ ఉన్నటు భౌగోళిక పరిస్థితులు ఏనుగు సంతతి అభివ`ద్ధికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఇక్కడకు వెళితే మనం ఎక్కువ ఏనుగులను చాలా దగ్గర నుంచి చూడవచ్చు.

పున్నత్తూర్ కొట్టా, కేరళ

పున్నత్తూర్ కొట్టా, కేరళ

P.C: You Tube

కేరళలోని త్రిషూర్ జిల్లాలోని కొట్టపాడిలో పున్నత్తూర్ కోట ఉంది. కేరళలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గురువాయూర్ దేవాలయానికి చెందిన ఏనుగులను ఇక్కడ సంరక్షిస్తుంటారు. అంతేకాకుండా వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి దేవాలయాలకు సంబంధించిన ఉత్సవాల్లో పాల్గొనేలా చేస్తారు. దాదాపు 60 ఏనుగులను ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు. ఇక్కడ వెళ్లిన పర్యాటకులు ఆ ఏనుగులను చూడటమే కాకుండా వాటి వెనుక ఉన్న అనేక కథలను తెలుసుకోవడానికి వీలవుతుంది.

ఏనుగుల పరిరక్షణ కేంద్రం

ఏనుగుల పరిరక్షణ కేంద్రం

P.C: You Tube

ఆగ్రాకు దగ్గరగా ఉన్న ఏనుగుల పరిరక్షణ కేంద్రంలో స్మగ్లర్స్ నుంచి రక్షించబడిన ఏనుగులను ఉంచుతారు. అంతేకాకుండా ప్రమాదాలకు లోనయ్యి శరీర అవయవాలను పోగొట్టున్న ఏనుగులకు అవసరమైన చికిత్సలు కూడా ఇక్కడ నిపుణుల పర్యవేక్షణలో జరుపుతుంటారు. ఇక్కడ కూడా ఏనుగులను చాలా దగ్గర నుంచి చూడటానికి వీలువుతుంది. పూర్తిగా కోలుకొన్న ఏనుగులకు తిండి తినిపించడం, స్నానం చేయించడం నిపుణుల పర్యవేక్షణలో చేయవచ్చు.

కబిని, కర్నాటక

కబిని, కర్నాటక

P.C: You Tube

కర్నాటకలోని కబిని అబయారణ్యంలో ఎక్కడ చూసినా ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ పర్యాటకులకు ఆనందం కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కబినీ నదీ బ్యాక్ వాటర్ లో చిలిపిగా జలకాలడటం చూడటానికి ముచ్చటగా ఉంటుంది. అదువల్లే ఇక్కడ ఏనుగులను చూడటానికి భారత దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X