Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతి ఏడు కొండల చుట్టూ మరో ఐదు పర్వత శిఖరాలను చూశారా?

తిరుపతి ఏడు కొండల చుట్టూ మరో ఐదు పర్వత శిఖరాలను చూశారా?

తిరుపతికి దగ్గరగా ఉన్న ఆరు ప్రముఖ పర్వత శిఖరాలకు సంబంధించిన కథనం.

తిరుపతి అన్న తక్షణం మనకు లడ్డూ, వేంకటేశ్వరుడు, ఏడు కొండలు గుర్తుకు వస్తాయి. ఆ ఏడు కొండలను ఎన్ని వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోవడంతో ఆధ్యాత్మిక, ధార్మిక పర్యాటకం ముగుస్తుంది. అయితే ఆ ఏడు కొండల చుట్టూ, తిరుపతికి మనసుకు ఆహ్లాదం కలిగించే మరో ఐదు పర్వత శిఖరాలు కూడా ఉన్నాయి. ఇవి ట్రెక్కింగ్ కు, పిక్నిక్ స్పాట్లుగా కూడా ప్రాచూర్యం చెందినాయి. అటువంటి ఐదు హిల్ స్టేషన్లకు సంబంధించిన కథనం మీ కోసం...

నగరి హిల్స్

నగరి హిల్స్

P.C: You Tube

చిత్తూరు జిల్లాలోనే ఉండే ఈ నగరి హిల్స్ స్థానికులు ఎంచుకొనే అత్యుత్తమ పిక్ నిక్ స్పాట్ లలో ఒకటి. దీనిని నగరి మూరకొండ అని కూడా పిలుస్తారు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్న వారికి ఈ నగరి హిల్స్స్వర్గధామం. కుశస్థలి నది ఒడ్డున ఉన్న ఈ నగరి హిల్ వర్షాకాలంలో కొత్త అందాలతో పర్యాటకులను రారమ్మని ఆహ్వనిస్తూ ఉంటుంది.

తిరుపతి నుంచి 65 కిలోమీటర్లు

తిరుపతి నుంచి 65 కిలోమీటర్లు

P.C: You Tube

ఇక్కడి పర్వత లోయ అందాలతో పాటు జలపాతాల హొయలను చూస్తూ సమయాన్ని ఇట్టే గడిపేయవచ్చు. చిన్నపటి ట్రెకింగ్ కు కూడా ఇది చాలా అనుకూలమైన ప్రాంతం. తిరుపతి నుంచి 65 కిలోమీటర్ల దూరందగ్గర్లో చూడదగిన ప్రాంతాలు...కైలాసకోన, నగరి నోస్, ఇక్కడ వసతి సౌకర్యం కోసం హొటల్స్ అందుబాటులో ఉన్నాయి.

హర్ల్సీ హిల్స్

హర్ల్సీ హిల్స్

P.C: You Tube

తిరుపతికి దగ్గర్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ హిల్ స్టేషన్లలో హర్ల్సీ హిల్స్ కూడా ఒకటి. ఇది సముద్ర మట్టానికి 4100 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి అందాలు మనలను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గంగోత్రి పేరుతో ఉన్న చిన్న సరస్సు, చిన్నచిన్న జలపాతాలు మనలను అడుగడుగునా పలకరిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ హార్ల్సీ హిల్స్ ప్రముఖ హనీమూన్ డెస్టినేషన్ కూడా.

తిరుపతి నుంచి 130 కిలోమీటర్లు

తిరుపతి నుంచి 130 కిలోమీటర్లు

P.C: You Tube

తిరుపతికి 130 కిలోమీటర్ల దూరంలో హర్ల్స్ హిల్స్ ను చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తయాలను చూడవచ్చు. కౌటిన్య అభయారణ్యం, మల్లమ్మ దేవాలయం, గాలిబండ. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహణలోని హరిత హిల్ రిసార్ట్ లో వసతి సౌకర్యం బాగుంటుంది.

ఎలగిరి

ఎలగిరి

P.C: You Tube

సముద్రమట్టానికి 3,460 అడుగుల ఎత్తులో ఉన్న ఎలగిరి 14 చిన్న చిన్న గ్రామాల కలయికతో కూడిన హిల్ స్టేషన్. ఎలగిరిలో కనుచూపుమేరలో మనకు పచ్చటి మైదానాలు, పర్వత లోయలు కనిపిస్తాయి. ఇక్కడ అనేక పురాణ ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా మనకు కనిపిస్తాయి. అదే విధంగా అడుగడుగునా నీటి తెంపరలను మన మీదకు వెదజల్లే జలపాతాలకు కూడా ఇక్కడ మనకు కొదువ లేదు.

తిరుపతి నుంచి 200 కిలోమీటర్లు

తిరుపతి నుంచి 200 కిలోమీటర్లు

P.C: You Tube

తిరుపతి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగిరి హిల్ స్టేషన్ వద్ద ఉన్న పుంగనూరు సరస్సులో బోటింగ్ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అదే విధంగా వేలవాన్ దేవాలయం, జలగం పరయ్ జలపాతం ఇక్కడ చూడదగిన మరికొన్ని పర్యాటక స్థలాలు

నంది హిల్స్

నంది హిల్స్

P.C: You Tube

వీకెండ్ సమయంలో హిల్ స్టేషన్ లేదా ట్రెక్కింగ్ అంటే తిరుపతితో పాటు బెంగళూరు వాసులకు గుర్తుకు వచ్చే ఒకే ఒక ప్రాంతం నంది హిల్స్. ఇక్కడ పర్వత శిఖరం పైకి చేరుకొన్న వెంటనే మేఘాలు మన
చెంపలను ముద్దాడుతాయి. ఇక పిల్లగాలులు మనకు చెక్కిలిగింతలు పెడుతాయి. ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామమైన ఈ నంది హిల్స్ ప్రముఖ శైవక్షేత్రం కూడా

తిరుపతి నుంచి 200 కిలోమీటర్లు

తిరుపతి నుంచి 200 కిలోమీటర్లు

P.C: You Tube

తిరుపతి నుంచి 240 కిలోమీటర్ల దూరంలో నంది హిల్స్ ఉంటుంది. బెంగళూరు నుంచి నిత్యం ఇక్కడకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు వస్తుంటాయి. టిప్పు సమ్మర్ ప్యాలెస్, టిప్పు డ్రాప్ పాయింట్, నంది దేవాలయి ఇక్కడ చూడదగిన పర్యాటక కేంద్రాలు.

నల్లమలా హిల్స్

నల్లమలా హిల్స్

P.C: You Tube

తిరుపతికి దగ్గరగా, అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణ లో కూడా విస్తరించిన నల్లమలా కొండలు, అటవీ ప్రాంతం ఈ వర్షాకాలంలో సరికొద్ద అందాలను సంతరించుకొని పర్యాటకులను ఆహ్వానిస్తూ పచ్చటి తివాచిని పరుస్తున్నాయి. నదీ, పర్వత లోయలతో కలగలిసిన ఈ కొండ ప్రాంతం ట్రెక్కింగ్ కు ఇప్పుడిప్పుడే ప్రాచూర్యం పొందుతోంది.

తిరుపతి నుంచి 200 కిలోమీటర్లు

తిరుపతి నుంచి 200 కిలోమీటర్లు

P.C: You Tube

తిరుపతికి 249 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నల్లమల కొండల పరిసర ప్రాంతాల్లో జ్యోతిర్లంగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. అదే విధంగా నాగార్జున సాగర్, పులుల అభయారణ్యం, తీర్థం జలపాతం ఇక్కడ చూడదగిన మరికొన్ని పర్యాటక స్థలాలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X