Search
  • Follow NativePlanet
Share
» »బీచ్‌లే కాదు.. గోవాలో చూడాల్సినవి చాలానే ఉన్నాయి..

బీచ్‌లే కాదు.. గోవాలో చూడాల్సినవి చాలానే ఉన్నాయి..

గోవాలో ఉన్న మ్యూజియంలకు సంబంధించిన కథనం.

By Karthik Pavan

బీచ్‌లకు కేరాఫ్‌ గోవా. నైట్‌ లైఫ్‌, సాహస క్రీడలు, సీ ఫుడ్స్‌.. ఇలా ట్రావెల్‌ అంటే ఇష్టపడేవాళ్లందరికీ గోవా ఖచ్చితంగా నచ్చితీరుతుంది. అయితే, గోవా పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున బీచ్‌లు మాత్రమే గుర్తుకువస్తాయి. దీనితో పాటు వివిధ దేశాలకు చెందిన మద్యం, వంటకాలు కూడా అదరి మదిలో మెదులుతాయి. ఇంకాస్త చెప్పమంటే మాత్రం గోవాలో కూడా అక్కడక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయని చెబుతారు. బీచ్‌లు కాకుండా గోవాలో చూడదగ్గ ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మన నాగరికతను తెలియజేసే మ్యూజియంలకు నిలయం గోవా. ఈ నేపథ్యంలో ఆ మ్యూజియం వివరాలు మీ కోసం...

మ్యూజియం ఆఫ్‌ క్రిస్టియన్‌ ఆర్ట్‌

మ్యూజియం ఆఫ్‌ క్రిస్టియన్‌ ఆర్ట్‌

P.C: You Tube

గోవా వెళ్లినవాళ్లు తప్పకుండా చూసితీరాల్సిన ప్రదేశం ..మ్యూజియం ఆఫ్‌ క్రిస్టియన్‌ ఆర్ట్‌. ఓల్డ్‌ గోవాలోని కాన్వెంట్‌ ఆఫ్‌ సెయింట్‌ మోనికాలో ఉన్న ఈ మ్యూజియం.. ఆసియాలోనే ప్రత్యేకమైనదిగా చెప్తారు. 1994లో నిర్మించబడిన ఈ మ్యూజియంలో అత్యంత పురాతనమైన ఫర్నీచర్‌, పెయింటింగ్స్‌, దుస్తులు, లోహాలతో చేసిన పనిముట్లు చూడచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ప్రదర్శనకు పెట్టిన వాటిలో చాలావరకు హిందూ కళాకారులు తయారుచేసినవే!

గోవా స్టేట్‌ మ్యూజియం

గోవా స్టేట్‌ మ్యూజియం

P.C: You Tube

పనాజీలో ఉన్న మ్యూజియంను రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలగా వ్యవహరిస్తారు. గోవాకు సంబంధించి అలనాటి వారసత్వ సంపద ప్రతిబింబించేలా ఇక్కడ కళాఖండాలు ఉంటాయి. అప్పటి శిల్పాలు, కమ్మలు, పెయింటింగ్స్‌, రాతప్రతులు, ఎక్కడా దొరకని నాణ్యాలను కూడా మనం చూడవచ్చు. ఆర్ట్‌ గ్యాలరీ, పెయింటింగ్‌ హిస్టరీ గ్యాలరీ, గోవా స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన విశేషాలతో గ్యాలరీ, క్రిస్టియన్‌ ఆర్ట్‌ గ్యాలరీ.. ఇలా రకరకాల గ్యాలరీల్లో కళాఖండాలు కనువిందుచేస్తాయి. గుప్తుల కాలంనాటి పురాతన మహావిష్ణువు విగ్రహం ఇక్కడ స్పెషల్‌ అట్రాక్షన్‌. అయితే, పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా 2018 మే నెల నుంచి దీన్ని మూసివేశారు అధికారులు.

నేవల్‌ ఏవియేషన్‌ మ్యూజియం

నేవల్‌ ఏవియేషన్‌ మ్యూజియం

P.C: You Tube

వాస్కోడగామాకు అత్యంత సమీపంలోని బోగ్‌మాలో ఏర్పాటుచేసిన నేవల్‌ ఏవియేషన్‌ మ్యూజియం.. గోవాలో మరో స్పెషల్‌ అట్రాక్షన్‌. భారత రక్షణ రంగంలోని నేవల్‌ ఆర్మీ వింగ్‌కు సంబంధించిన మిలిటరీ మ్యూజియం ఇది. భారత నేవీ ఉపయోగించిన వస్తువులు, వాటి రూపాలను ఇక్కడ చూడచ్చు.

ఆర్కియలాజికల్‌ మ్యూజియం అండ్‌ పోర్‌ట్రెయిట్‌ గ్యాలరీ

ఆర్కియలాజికల్‌ మ్యూజియం అండ్‌ పోర్‌ట్రెయిట్‌ గ్యాలరీ

P.C: You Tube

భారత పురాతత్వ శాఖ నిర్వహిస్తున్న మరో మ్యూజియం ఆర్కియలాజికల్‌ మ్యూజియం అండ్‌ పోర్‌ట్రెయిట్‌ గ్యాలరీ. గోవాకు చరిత్ర సవివరంగా తెలుసుకోవాలంటే ఇక్కడకు ఖచ్చితంగా వెళ్లితీరాల్సిందే. అరేబియన్‌, పర్షియన్‌ రాతప్రతులు, హీరో స్టోన్స్‌, గోవాను అప్పట్లో పాలించిన పోర్చుగీసుల ఆయుధాలు ఇక్కడ చూడచ్చు.

గోవా చిత్ర మ్యూజియం

గోవా చిత్ర మ్యూజియం

P.C: You Tube

గోవాలోని బెనౌలియంలో ఉన్న ఈ మ్యూజియంలో అక్కడి వ్యవసాయ అంశాలకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవచ్చు. చాలా ఏళ్లుగా అక్కడి రైతులు అవలంబిస్తున్న విధానాలు, పద్ధతులు తెలిపే విధంగా ఏర్పాటుచేసిన దాదాపు నాలుగువేల కళాఖండాలు అద్భుతమైన సమాచారాన్ని రేపటి తరాలకు అందిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X