Search
  • Follow NativePlanet
Share
» »రానున్న జూన్ లో ఈ ప్రాంతాల్లో పర్యాటకం కోసం సమాయత్తం అవుతున్నారా?

రానున్న జూన్ లో ఈ ప్రాంతాల్లో పర్యాటకం కోసం సమాయత్తం అవుతున్నారా?

జూన్ లో సందర్శనకు అనుకూలమైన పర్యాటక ప్రాంతాల గురించి కథనం.

సువిశాల భారత దేశంలో ఒక వైపున ఎతైన కొండలు, మరోవైపున లోతైన సముద్రాలు. మరోవైపున తెల్లటి మంచుపర్వతాలు, మరో చివర ఇసుక తిన్నెలు. ఇలా విభిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులతో ఉన్న ఈ భారత వానిలో పర్యాటక ప్రాంతాలకు కొదువులేదు. సంవత్సరంలోని ఒక్కొక్క నెలలకు కొన్ని పర్యాటక ప్రాంతలు సందర్శనకు అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జూన్ మాసంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రత్యేక ఉత్సవాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే భారత దేశం మొత్తం దాదాపు 30 ప్రాంతాలు ఈ నెలలో పర్యాటకానికి అనుకూలంగా ఉంటాయి. ఇందులో కూడా అతి ముఖ్యమైన ఐదు ప్రాంతాలను మీకు అందిస్తున్నాం. ఇందులో మీకు ఇష్టమైన ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడకు వెళ్లండి

1. మనాలి, హిమాచల్ ప్రదేశ్

1. మనాలి, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ఏడాదిలో ఎప్పుడైనా చూడటానికి బాగానే ఉంటుంది. అయితే జూన్ మాసంలో ఇక్కడి వాతావరణం పర్యటాకులకు ఎంతగానో నచ్చుతుంది. ముఖ్యంగా హనీమూన్ కపుల్స్ నుంచి మొదలుకొని అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇఫ్టపడేవారి కోసం మనాలి ఎప్పుడూ రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఎతైన మంచుకొండలు, వాటిని తాకుతూ వెళ్లే పొగమంచును చూస్తూ ఇట్టే మనం సమయాన్ని గడిపేయవచ్చు.

2. గాంగ్ టక్, సిక్కిం

2. గాంగ్ టక్, సిక్కిం

భారతదేశంలో ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో గ్యాంగ్ టక్ ఒకటి. ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా జూన్ మాసంలో పర్యాటకులు ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఇక్కడి బౌద్ధారామాలు పర్యాటకులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షిస్తున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఇక్కడి కాంచన్ జంగ్ పర్వత అందాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

కూర్గ్, కర్నాటక

కూర్గ్, కర్నాటక

కర్నాటకలోని కూర్గ్ లో కనుచూపుమేర విస్తరించిన కాఫీ, సుగంధ ద్రవ్యాల తోటలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాల వారు జూన్ మాసంలో ఈ పర్యాటక కేంద్రాన్ని సందర్శించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కూర్గ్ ట్రెక్కింగ్ కు కూడా చాలా అనుకూలమైన ప్రదేశం. ట్రెక్కింగ్ దారి వెంబడి గలగల పారే సెలయేళ్లు, వివిధ జాతుల పక్షుల కువ కువలు మీ మనస్సును స్వరలోకపు అంచుల దాకా తీసుకెలుతాయి.

డార్జిలింగ్, పశ్చిమబెంగాల్

డార్జిలింగ్, పశ్చిమబెంగాల్

సముద్రమట్టానికి దాదాపు 6700 అడుగుల ఎత్తులో ఉన్న డార్జిలింగ్ జూన్ మాసంలో మరింత అందాలను సంతరించుకొంటుంది. ముఖ్యంగా హనిమూన్ జంటలకు ఈ ప్రాంతం స్వర్గధామం. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత ఎప్పుడూ 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ను దాటదు. అయితే జూన్ మాసంలో ఈ ఉష్ణోగ్రత మరింత కిందికి దిగజారుతుంది. అందువల్ల హనీమూన్ జంటలు జూన్ మాసంలో ఈ డార్జిలింగ్ కు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

లడక్,

లడక్,

సుందరమైన సరస్సులు, మంత్రముగ్దులను చేసే ప్రక`తి అందాలు, రంగురంగుల వీధులు ఇవన్నీ లడక్ సొంతం. ముఖ్యంగా జూన్ మాసంలో ఇక్కడ జరిగే కొన్ని ప్రత్యేక ఉత్సవాలను చూడటానికి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు. పర్వతోరోహణ, బైక్ రైడింగ్, వంటివి ఇష్టపడే పర్యాటకులకు ఈ ప్రాంతం ఖచ్చితంగా నచ్చుతుంది. హిమాలయల పర్వత ప్రాంతాలకు చెందిన ఈ లడక్ సముద్ర మట్టానికి 9800 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడకు హనీమూన్ జంటలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X