Search
  • Follow NativePlanet
Share
» » బిజాపుర వెలితే వీటిని చూడటం మరిచిపోవద్దు

బిజాపుర వెలితే వీటిని చూడటం మరిచిపోవద్దు

బిజాపూర్ లో చూడదగిన ప్రాంతాలకు సంబంధించిన కథనం.

చాళుక్యరాజులు వేసిన పునాదులతో నిర్మించబడిన బిజాపురను గతంలో విజయపుర అని పిలిచేవారు. అయితే ఆదిల్ షా ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం మొదలు పెట్టిన తర్వాత అది బిజాపురగా మార్పు చెందింది. పేరు ఏది అయినా ఈ బిజాపుర పర్యాటక రంగంలో తనదైన ముద్రను వేసింది. ఈ బిజాపురతో పాటు చుట్టు పక్కల అనేక చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన వివరాలు మీ కోసం...

గోల్ గుంబాద్

గోల్ గుంబాద్

P.C: You Tube
ఇది బిజాపూర్ సుల్తాన్ అయిన మహ్మద్ ఆదిల్ షా సమాధి. దీనిని యాకూబ్ అనే ఆర్కిటెక్షర్ దీనిని 1656లో నిర్మించాడు. ఇది దక్కన్ సుల్తానుల నిర్మాణానికి ఒక మంచి ఉదాహరణ. గోల్ గుంబాద్ అనగా గులాబీ గుమ్మటం అని అర్థం. మొత్తం 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణం చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇబ్రహీం రౌజా

ఇబ్రహీం రౌజా

P.C: You Tube
తాజ్ మహల్ ను మాదిగా తీసుకొని దీనిని నిర్మించారు. ఇది ఇబ్రహీం ఆదిల్ షా 2, ఆయన భార్య సమాధి అని చెబుతారు. ఇది పర్షియన్ వాస్తుశైలికి అద్దం పడుతుంది. ఇక్కడ ప్రతి గోడ లతలు, డోమ్ లతో చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టు ఉన్న తోట కూడా మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

మాలిక్ కి మదీన్

మాలిక్ కి మదీన్

P.C: You Tube
బిజాపూర్ కోట పై భాగంలో ఉన్న ఫిరంగికే మాలిక్ కి మదీన్ అని పేరు. ఇది ఆలయంలో పెద్ద, గొప్ప ఆయుధం. దీనిని కోట పై పెట్టడానికి దాదాపు 10 ఏనుగులు, 400 ఎద్దులు, వందల మంది సైనికులను ఆకాలంలో వినియోగించారు. దీని బరువు 55 టన్నులు. దీనితో పాటు కోట అందాలను కూడా వీక్షించవచ్చు.

 జామీ మసీదు

జామీ మసీదు

P.C: You Tube
ఈ మసీదును ఆలీ ఆదిల్ షా నిర్మించారు. రాక్షస తంగడి వద్ద విజయన నగరం పై విజయాన్ని సాధించినదానికి గుర్తుగా ఈ మసీదును నిర్మించినట్లు చెబుతారు. ఇది దక్షిణ భారత దేశంలోనే అత్యంత విశాలమైన మసీదుగా చెబుతారు. మొత్తం విస్తీర్ణం 1,16,300 చదరపు అడుగులు.

ఉప్లి బుర్జ్

ఉప్లి బుర్జ్

P.C: You Tube

ఉప్లి బుర్జ్ అన్నది ఒక వాచ్ టవర్. దీనిని హైదర్ ఖాన్ నిర్మించాడు. మొత్తం ఎత్తు 24 అడుగులు. దీనిని ఎక్కితే విజయపుర మొత్తం కనిపిస్తుంది. అంతేకాకుండా సూర్యోదయం సూర్యాస్తమయాలు కూడా ఈ వాచ్ టవర్ నుంచి అత్యంత అందంగా కనిపిస్తాయి.

ఆమె చనిపోయిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్లినవారు లేరుఆమె చనిపోయిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్లినవారు లేరు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X