Search
  • Follow NativePlanet
Share
» »మేఘాలయ పర్యటన - మబ్బుల్లో ప్రయాణం !

మేఘాలయ పర్యటన - మబ్బుల్లో ప్రయాణం !

ఈశాన్య భారత దేశం లోని మేఘాలయ రాష్ట్రంలో ఆకర్షణీయమైన ఎన్నో పర్యాటక ప్రదేశాలు కలవు. దీనికి తగినట్లు ఈ ప్రదేశంలో సంవత్సరం పొడవునా ఆహ్లాదకర వాతావరణం వుంటుంది. అమాయకులైన స్థానిక తెగల ప్రజలు పర్యాటకులకు చక్కని ఆతిధ్యం ఇస్తారు. ఒక వైపు ఆధునికత, మరోవైపు సాంప్రదాయ ఆచార వ్యవహారాలతో కూడిన మేఘాలయ తప్పక ఆనందించదగిన ప్రదేశం. మేఘాలయ పర్యటనకు అనువైన కొన్ని ప్రదేశాలు చిత్ర సహితంగా చూడండి.

మబ్బుల్లో ప్రయాణం !

మబ్బుల్లో ప్రయాణం !

ఉమియం సరస్సు

గౌహతి నుండి షిల్లాంగ్ వెళ్ళే మార్గంలో పర్యాటకుడు మొట్ట మొదటగా చూసేది ఉమియం లేక్. ఈ సరస్సు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇది రి భాయి జిల్లాలో కలదు.

మబ్బుల్లో ప్రయాణం !

మబ్బుల్లో ప్రయాణం !

ఉమియం నది పై ఒక డాము నిర్మించి ఇక్కడ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ స్థాపించారు. నేడు ఈ సరస్సు గొప్ప పర్యాటక ప్రదేశంగా మారింది.

మబ్బుల్లో ప్రయాణం !

మబ్బుల్లో ప్రయాణం !

ఈ సరస్సులో అనేక నీటి క్రీడలు ఆచరిస్తారు. కయాకింగ్, వాటర్ సైక్లింగ్, షూటింగ్, బోటింగ్ మొదలైనవి ప్రసిద్ధి.

మబ్బుల్లో ప్రయాణం !

మబ్బుల్లో ప్రయాణం !

ఎంతో అందమైన ఈ సరస్సును ఈ సరస్సును బారా పాణి అని కూడా పిలుస్తారు. నీటి క్రీడలు ఆచరించని వారు, సరస్సు ఒడ్డున నేచర్ వాక్ చేసి ఆనందించవచ్చు.

 మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

మావ్ లీనోంగ్
మావ్ లీనోంగ్ గ్రామం, ఆసియా ఖండంలోనే అతి స్వచ్చమైన గ్రామం. ఇక్కడి ప్రజల జీవనం వ్యవ సాయం పై సాగుతుంది. వెదురు తో చేయబడిన డస్ట్ బిన్ లు గ్రామం అంతా చూడవచ్చు.

 మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయారు. బుట్ట్టలలో సేకరించిన చెత్తను ఒక గోతిలో కప్పి పెట్టి తర్వాత దానిని పంటలకు ఎరువుగా వాడతారు.
Pic Credit: Ashwin Kumar

 మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

నొహ్ కాలికాయ్ జలపాతాలు
నొహ్ కాలికాయ్ జలపాతాలు చిరపుంజి సమీపంలో కలవు. ఇవి ఇండియా లో అత్యధిక ఎత్తునుండి పడే జలపాతాలు. చిరపుంజి లో పడే వర్షాలు ఈ జలపాతాలకు ఆధారం.

 మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

సరిగ్గా జలపాతాల కింద పచ్చటి రంగులో కల నీటితో ఒక పెద్ద చెరువు వుంటుంది. దీనింకి స్థానిక ఇతిహస్సం మేరకు ఒకబాలిక పేరు అయిన కా లికాయ్ అనే పేరు పెట్టారు. ఈ బాలిక పక్కనే కల కొండ పై నుండి కింద పది మరణించిన దని చెపుతారు.
Pankaj Kaushal

 మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

ఏనుగు జలపాతాలు
షిల్లాంగ్ లో ఈ జలపాతాల ప్రదేశం గొప్ప పర్యాటక ఆకర్షణ. స్థానికులు ఈ జలపాతాలను 'కా కశైద్ లాయి పటేంగ్ కాశీ ' అని పిలుస్తారు. అంటే, మూడు దశల లో పారే జలపాతాలు అని అర్ధం.

 మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

ఇక్కడ ఏనుగు ఆకారంలో ఒక రాయి వుండటంచే, బ్రిటిష్ వారు ఈ జలపాతాలకు ఏనుగు జలపాతాలు అని పేరు పెట్టారు.

 మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

మబ్బుల్లో ప్రయాణం - మనసులో ఆహ్లాదం!!

అయితే, ఈ రాతిలో చాలాభాగం 1897 లో వచ్చిన అతి పెద్ద భూ కంపానికి ధ్వంసం అయ్యింది. ఈ జలపాతాల నీరు స్వచ్చంగా, తెల్లగా వుంది నల్లని రాళ్ళపై పారుతూ వుంటుంది.

Pic Credit: Ashwin Kumar

మబ్బుల్లో ప్రయాణం ...మనసులో ఆహ్లాదం!

మబ్బుల్లో ప్రయాణం ...మనసులో ఆహ్లాదం!

లివింగ్ రూట్ బ్రిడ్జి లు
మేఘాలయ లోని చిరపుంజి లో రబ్బరు చెట్లు అధికం. ఈ చెట్ల వెళ్ళు పొడవు సాగి పోతూ వుంటాయి. అవి పది నుండి పదిహేను సంవత్సారాల కాలంలో బాగా బలపడి అల్లుకొనే పెద్దవి అవుతాయి.
Pic Credit: Ashwin Kumar

మబ్బుల్లో ప్రయాణం ...మనసులో ఆహ్లాదం!

మబ్బుల్లో ప్రయాణం ...మనసులో ఆహ్లాదం!

చివరకు ఈ వేళ్ళు నదులు, లోయలలో బ్రిడ్జి లు గా ఉపయోగపడతాయి. కొన్ని ఏళ్ళ కాలంలో సహజంగా సాగే ఈ ప్రక్రియ చూసేందుకు పర్యాటకులు ప్రపంచ వ్యాప్తంగా వస్తారు.

మబ్బుల్లో ప్రయాణం ...మనసులో ఆహ్లాదం!

మబ్బుల్లో ప్రయాణం ...మనసులో ఆహ్లాదం!

నార్హియాంగ్
అతి చల్లగా వుండే నార్తియాంగ్ ప్రదేశం ఒకప్పుడు జైంతియా రాజుల వేసవి విడిదిగా వుండేది. రాచ విడిది అయిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తారు.

మబ్బుల్లో ప్రయాణం ...మనసులో ఆహ్లాదం!

మబ్బుల్లో ప్రయాణం ...మనసులో ఆహ్లాదం!

ఇక్కడ కల దుర్గ మాత దేవాలయం ఇక్కడి రాజ్యం పై కల హిందూ మత ప్రభావం చూపుతుంది. నేడు దేవాలయ మూల స్వరూపం మారి పోయింది. అయినప్పటికీ విగ్రహాలు, గర్భ గుడి, కత్తులు అన్నీ ఆనాటి విగా చూడవచ్చు. ఇక్కడ ఒక శివాలయం కూడా కలదు.

మబ్బుల్లో ప్రయాణం ...మనసులో ఆహ్లాదం!

మబ్బుల్లో ప్రయాణం ...మనసులో ఆహ్లాదం!

గుహలు
ఇండియా లో అతి పొడవైన గుహలు జయంతియా కొండల లో కలవు. మవసమాయ్, కరెం డాం, కరెం కొత్సతి, కరెం లాశింగ్, కరెం మావ్ లోహ్, కరెం స్వీప్, సైజు అనే గుహలు పర్యాటకులు తేలికగా చూడవచ్చు. ఈ గుహలు స్టాలగ్ మైట్ మరియు స్తాలచ్సైట్ లతో ఏర్పదతంచే చీకటిలో వాటిపై లైట్ పడితే చాలు మెరుస్తూ వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X