Search
  • Follow NativePlanet
Share
» »డార్జీలింగ్ -భారతదేశ 'టీ' స్వర్గం !

డార్జీలింగ్ -భారతదేశ 'టీ' స్వర్గం !

By Mohammad

యాత్రికులను ప్రకృతి అందాల నడుమ అత్యద్భుతంగా ఉండే పర్వత శ్రేణుల గుండా తీసుకువెళ్ళే ఏకైక సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశం డార్జీలింగ్. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో ఉండే డార్జీలింగ్ పర్వత ప్రాంతం మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలతో అలరారుతూ, దిగువ హిమాలయ శ్రేణులలో ఒక నిజమైన స్వర్గసీమగా వెలుగొందుతుంది. ఈ పర్వత ప్రాంతం కలకత్తా కు 613 కి.మీ. దూరంలో కలదు.

ఇది కూడా చదవండి : ఇండియాలోని నాలుగు ప్రధాన తేయకు తోటలు !

డార్జీలింగ్ లో చూడటానికి ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు అనేకం ఉన్నాయి. హిమాలయన్ రైల్వే టాయ్ ట్రైన్ లో ప్రయాణిస్తూ తేయాకు తోటలను, వాటి నుండి వెలువడే సువాసనభరిత పరిమళాన్ని ఆనందించవచ్చు. రెగ్యులర్ గా ఏదో ఒక సినిమా షూటింగ్ ఇక్కడ చిత్రీకరిస్తుంటారు. ఇక్కడ గల టీ సువాసనలు ప్రపంచంలో ఖ్యాతి గడించాయి. దేశానికే 'టీ స్వర్గం' గా ఈ ప్రదేశం పేరుగాంచింది. మరి ఆ టీ రుచిని ఆస్వాదిస్తూ ... ఇక్కడి ప్రదేశ అందాలను తిలకిద్దాం పదండి ..!

తేయాకు తోటలు

తేయాకు తోటలు

డార్జీలింగ్ లో తేయాకు తోటల సందర్శన అస్సలు మరవకండి. ఇక్కడి 'టీ' రుచి ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. ఈ టీ లలో బ్లాక్, గ్రీన్, వైట్ మరియు ఊలోంగ్ వంటి వివిధ రకాలైన టీ ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. వీలైతే టీ తోటలు, టీ ఎస్టేట్ లలో నడక సాగిస్తూ .. తేయకు సువాసన లను ఆస్వాదించవచ్చు.

చిత్ర కృప : Samko Pamko

టాయ్ ట్రైన్

టాయ్ ట్రైన్

డార్జీలింగ్ టాయ్ ట్రైన్ ఇండియా లోని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో చే గుర్తింపు పొందింది. చారిత్రాత్మకమైన ఈ టాయ్ ట్రైన్ దేశంలోని ఒకే ఒక మినీ ట్రైన్ గా పేరు పొందింది.

చిత్ర కృప : Matanya

టాయ్ ట్రైన్

టాయ్ ట్రైన్

ఇది న్యూ జలపాయగురి నుండి డార్జీలింగ్ కు, అదే మార్గంలో వెనక్కూ ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ పర్యాటకులకు ఆనందకరవిహారం అందిస్తోంది. ప్రయాణంలో చూసే అందమైన తోటలు, ప్రకృతి దృశ్యాలు వర్ణించేందుకు మాటలు చాలవు. డార్జిలింగ్ వెళ్ళినపుడు, ఈ టాయ్ ట్రైన్ ఆనందించటం మరువకండి.

చిత్ర కృప : telugu native planet

కేబుల్ కార్

కేబుల్ కార్

డార్జీలింగ్ నుండి రంజిత్ వాలీ కి తీసుకెళ్లటానికి పట్టణం బయట 3 కి. మీ. దూరంలో అద్భుతమైన రోప్ వే ఉంది. భారతదేశంలోనే పురాతన కేబుల్ కార్ గా ప్రసిద్ధి చెందిన ఈ రోప్ వే పై రైడ్ చెయ్యకపోతే మీ డార్జీలింగ్ పర్యటన పూర్తి కాదు. ప్రయాణంలో ఎన్నెన్నో ప్రకృతి దృశ్యాలను ఆనందించవచ్చు.

చిత్ర కృప : Shakib Ally

దిర్డమ్ దేవాలయం

దిర్డమ్ దేవాలయం

దిర్డమ్ దేవాలయం శివునికి అంకితం చేయబడ్డ హిందూ దేవాలయం. డార్జీలింగ్ లో టాయ్ ట్రైన్ స్టేషన్ కింద ఉన్న ఈ ఆలయంను నేపాల్ రాజు కట్టించాడు. ఆలయం లో తెల్లని రంగులో శివుని విగ్రహం ఉంటుంది. ఆలయ పై కప్పు టిబెట్ మఠాల ను గుర్తుచేస్తుంది.

చిత్ర కృప : Manfred Sommer

టైగర్ హిల్

టైగర్ హిల్

డార్జీలింగ్ లో ఎత్తైన ప్రదేశం టైగర్ హిల్. ఇదొక వ్యూ పాయింట్. డార్జీలింగ్ నుండి కేవలం 11 కి. మీ. దూరంలో ఉంది. మంచుచే కప్పబడిన కంచనగంగా (ప్రపంచంలోనే మూడవ ఎత్తైన శిఖరం) శిఖరాల నుండి అద్భుతమైన సూర్యోదయాన్ని చూడటానికి ఇదే ఉత్తమైన స్పాట్.

చిత్ర కృప : telugu native planet

పీస్ పగోడా

పీస్ పగోడా

డార్జీలింగ్ లో మరొక ఆకర్షణ అయిన జపానీయుల పీస్ పగోడా లో బుద్ధుడి నాలుగు అవతారాలు చూపబడతాయి. ఈ నిర్మాణం శాంతికి చిహ్నంగా నిప్పొంజన్ మయోహిజి అజ్ఞానుసారం నిర్మించారు.

చిత్ర కృప : Malaya K Pradhan

జూలాజికల్ పార్క్

జూలాజికల్ పార్క్

జూలాజికల్ పార్క్ లో మంచు చిరుత పులి, సైబీరియన్ పులులు, హిమాలయ బ్లాకు బేర్, టిబెటన్ తోడేలు మొదలైనవి చూడవచ్చు. ఇక్కడ కల చిరుత పులి సంతానోత్పత్తి కేంద్రం, కుటుంబ సమేత విహార కేంద్రం. రెడ్ పండా కూడా తప్పక చూడండి.

చిత్ర కృప : Matthieu Aubry

బతసియా లూప్

బతసియా లూప్

బతసియా లూప్ ఒక యుద్ధ స్మారక ప్రదేశం. ఇది డార్జీలింగ్ కు 5 కి. మీ. దూరంలో ఉంటుంది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీర మరణం పొందిన గూర్ఖా సైనికులు ఇందులో విశ్రాంతి తీసుకుంటుంటారు.

చిత్ర కృప : telugu native planet

ల్లోయాడ్స్ బొటానికల్ గార్డెన్

ల్లోయాడ్స్ బొటానికల్ గార్డెన్

ల్లోయాడ్స్ బొటానికల్ గార్డెన్ సుమారు 80 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. గార్డెన్ అరుదైన వృక్షాలు, జాతి మొక్కలు, పచ్చిక బయళ్లు, రంగురంగుల పుష్పాలతో నిండి ఉంటుంది. ఇక్కడ పూలు తెంపడం నిషేధం. అవసరమనుకుంటే అక్కడి దుకాణాల్లో పూలను కొనుక్కోవచ్చు.

చిత్ర కృప : telugu native planet

మ్యూజియం

మ్యూజియం

ఇక్కడి మ్యూజియాన్ని ప్రభుత్వానికి చెందినది. ఈ మ్యూజియం లో బెంగాల్ వన్య ప్రాణుల, హిమాలయాన్ వృక్ష వృక్ష సంపద నమూనాలను సుమారు 4300 పైగా చూడవచ్చు. బెంగాల్ చరిత్ర ను ప్రతిబింబించే పెయింటింగ్ చిత్రాలను ప్రజల సందర్శనార్థం ఉంచారు.

చిత్ర కృప : telugu native planet

టెస్టీ వంటకాలు

టెస్టీ వంటకాలు

మొమోస్ (కుడుములు) ఇక్కడి స్థానిక వంటకం. వెజ్, నాన్- వెజ్ లలో లభించే ఈ మొమోస్ లను వేడి సాస్ తో అందిస్తారు. నూడిల్స్, స్పైసీ రైస్ లు స్ట్రీట్ ఫుడ్ లు గా ఉన్నాయి.

చిత్ర కృప : young shanahan

డార్జీలింగ్ ఎలా చేరుకోవాలి ?

డార్జీలింగ్ ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - సిలిగురి విమానాశ్రయం(94 కి.మీ)

సమీప రైల్వే స్టేషన్ - డార్జీలింగ్ మరియు ప్రధాన రైల్వే స్టేషన్ జల్పైగురి స్టేషన్ (88 కి.మీ)

రోడ్డు మార్గం - సిలిగురి ప్రధాన బస్ స్టాండ్. ఇక్కడి నుండి నిత్యం డార్జీలింగ్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి. కలకత్తా నుండి కూడా వోల్వా, రాకెట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Anup L

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X