Search
  • Follow NativePlanet
Share
» »జౌంపూర్ పోదాం .. సాహసాలు చేద్దాం !

జౌంపూర్ పోదాం .. సాహసాలు చేద్దాం !

By Mohammad

జౌంపూర్ పట్టణం గురించి పర్యాటకులకు అంత పెద్దగా ఎవరికీ తెలిసి ఉండదు. అయినా ఈ పట్టణం, మహర్షి జమదగ్ని పేరు మీద వచ్చి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. అయివుండవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతం వేదకాలం నాటిదని, బుద్ధుడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడని ఇంకొందరి అభిప్రాయం.

ఇది కూడా చదవండి : తీపి వంటకాల రాజధాని : లక్నో !

జౌంపూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక నగరం. క్రీ.శ. 1359 నాటి సమయంలో ఈ ప్రాంత చరిత్ర ప్రకారం షీరాజ్

హింద్ అని పిలేచేవారు. ఇది ఫిరోజ్ షా తుగ్లక్ చే స్థాపించబడింది. జౌంపూర్ పర్యాటక స్పోర్ట్స్ ఏడాది పొడవునా సందర్శకులను ఆకర్షిస్తాయి. అంతే కాకుండా చారిత్రాత్మక మరియు పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి.

జౌంపూర్ కోట

జౌంపూర్ కోట

కరార్ ఫోర్ట్ లేదా జౌంపూర్ కోటగా కూడా పిలవబడే షాహి ఖిల్లా ఒక చరిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. దీనిని క్రీ.శ. 13 వ శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ మిర్మించాడు. ఈ కోట గోమతి నదిపై ఉన్న షాహి వంతెనకు దగ్గరగా ఉన్నది. కోట లోని ప్రధాన ద్వారం, రాజభవనం, కోట మసీదు, స్నానశాల చూడదగ్గవి.

చిత్ర కృప : Khansaadyameena

ఆటలా మసీద్

ఆటలా మసీద్

క్రీ. శ. 13 వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ మూడవ ఫిరోజ్ షా తుగ్లక్ దీనిని నిర్మించెను. మొదట ఆటలా దేవికి అంకితం చేసిన ఒక హిందూ మత ఆలయం ఉండేది. దానిని ధ్వంసం చేసి అప్పుడు ఆ ప్రదేశంలో మసీదును నిర్మించారు. మసీద్ ఎత్తు వెయ్యి అడుగులు.

చిత్ర కృప : Varun Shiv Kapur

షాహీ వంతెన

షాహీ వంతెన

షాహి బ్రిడ్జ్ ను మొఘల్ బ్రిడ్జ్, అక్బరి బ్రిడ్జ్ లేదా మునిమ్ ఖాన్ బ్రిడ్జ్ అని వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ ను మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో జౌంపూర్ యొక్క రాష్ట్ర గవర్నర్ అయిన మునిమ్ ఖాన్ నిర్మించారు. ఈ వంతెన, గోమతీ నది మీద నిర్మించబడింది. వంతెన మద్యలో చదరంగా ఉండే వేదిక మీద ఏనుగు మీద దాడి చేస్తున్న సింహం శిల్పం ఉంటుంది.

చిత్ర కృప : Faizhaider

ఝంఝరి మసీదు

ఝంఝరి మసీదు

గోమతీ నదీ తీరంలో నిర్మించబడిన ఝంఝారి మసీదును ఇబ్రహీం నిర్మించాడు. ఇబ్రహీంతో సన్యాసులు, శిష్యులు, పండితులు మరియు గజ సైనిక దళం ఇందులో ఉండేవారు.ఇందులో ఒక ఎత్తైన ఆర్చి ఉంది. మసీదులోని రాళ్ళను షాహి వంతెన నిర్మాణానికి వాడారు.

చిత్ర కృప : telugu native planet

లాల్ దర్వాజా మసీదు

లాల్ దర్వాజా మసీదు

లాల్ దర్వాజా మసీదు లేదా రూబీ గేట్ మసీదును క్రీ.శ.14 వ శతాబ్దంలో సుల్తాన్ మహ్ముద్ షార్కీ రాణి అయిన బిబి రజ్యి నిర్మించెను. దీనిని మౌలానా సయ్యద్ ఆలీ దావూద్ కుతుబ్బుదిన్ కు అంకితం చేశారు. లాల్ దర్వాజా మసీదు నిర్మాణంలో ఎక్కువ భాగం హిందూ మతం రాజ భవనాలు, ఆలయాల మెటిరియాల్ తో నిర్మించారు.

చిత్ర కృప : telugu native planet

జమా మసీదు

జమా మసీదు

జమా మసీదును షర్క్వి కాలంలో ఇబ్రహీం చేత ప్రార,భించబడి పలు మార్పులు చేయబడి హుస్సైన్ చేత పూర్తిచేయబడింది. ఇది షాగజ్ రోడ్డు పురానీ గంజ్ లోని మదియాహు వద్ద ఉంది. మసీదుకు 4 ద్వారాలు ఉన్నాయి. మసీదు ఈజిప్షియన్ శైలిలో అలంకరించబడింది.

చిత్ర కృప : Anabeel12

జౌంపూర్ ఎలా చేరుకోవాలి ?

జౌంపూర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు/ బస్సు మార్గం : ఢిల్లీ, లక్నో, వారణాసి తదితర ప్రాంతాల నుండి జౌంపూర్ కు బస్సులు నడుస్తాయి.

రైలు మార్గం : జౌంపూర్ లో రైల్వే జంక్షన్ కలదు. ఇక్కడికి ఢిల్లీ, వారణాసి, అలహాబాద్ ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

వాయు మార్గం : జౌంపూర్ కు సమీపాన 50km ల దూరంలో వారణాసి ఎయిర్ పోర్ట్, 90 km ల దూరంలో అలహాబాద్ ఎయిర్ పోర్ట్ కలదు.

చిత్ర కృప : Arunimshah08

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X