Search
  • Follow NativePlanet
Share
» »నాగౌర్ లో సందర్శించవలసిన ఉత్తమ పర్యాటక ప్రదేశాలు !

నాగౌర్ లో సందర్శించవలసిన ఉత్తమ పర్యాటక ప్రదేశాలు !

By Mohammad

రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ ఒక చారిత్రక నగరం. దీనిని నాగ వంశీయులు కనుగొన్నారు. ఇది జోధ్‌పూర్ మరియు బికనీర్ పట్టణాల మధ్య ఉన్న ప్రసిద్ద పర్యాటక ప్రదేశం. ఈ నగరం జోధ్‌పూర్ కు 145 కిలోమీటర్ల దూరంలో, బికనీర్ కు 116 కిలోమీటర్ల దూరంలో మరియు రాష్ట్ర రాజధాని జైపూర్ కు 232 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

నాగౌర్ లో సందర్శించవలసిన ఉత్తమ పర్యాటక ప్రదేశాలు

నాగౌర్ లో ప్రసిద్ధి చెందిన పర్యాటక స్థలం నాగౌర్ కోట. ఈ కోటను క్రీ.శ. 2 వ శతాబ్ధంలో నాగ వంశీయులు ఇసుకతో కట్టించినారు. కోట లోపల అందమైన భవనాలు, ఫౌంటైన్ లు, తోటలు ఉన్నాయి. పర్యాటకులు కోటతో పాటుగా జైన గాజు మందిరం, రాజభవనాలు, ఆలయాలు మొదలైనవి సందర్శించవచ్చు.

ఇది కూడా చదవండి : జోధ్‌పూర్ - రాచరికపు విలాసాల నగరం !

చరిత్రలో నాగౌర్

నాగౌర్ చరిత్ర విషయానికి వస్తే, ఈ ప్రదేశం మహా భారత కాలం నాటిదని చెప్పవచ్చు. అహిచ్ఛత్రపుర రాజ్యంలో నాగౌర్ లోని కొన్ని ప్రాంతాలు రాజుల ఏలుబడిలో ఉండేవి. పురాణాల ప్రకారం, అర్జునుడు అహిచ్ఛత్రపుర రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని తన గురవైన ద్రోణాచార్యులకి కానుకగా ఇచ్చాడని తెలుస్తుంది.

హాది రాణి మహల్, నాగౌర్

హాది రాణి మహల్, నాగౌర్

హాది రాణి మహల్, నాగౌర్ లో అందంగా నిర్మించబడ్డ రాజభవనాలలో ఒకటి. ఈ రాజ భవనం యొక్క గోడలు, పై కప్పు అంతా అందమైన చెక్కడాలు, శాశనాల తో అలంకరించబడి ఉంటుంది. పర్యాటకులు రాజ భవనం లోపల సేకరించబడిన అందమైన కూడ్య చిత్రాలను చూడటానికి వస్తుంటారు.

చిత్ర కృప : Sreekumar Menon

జైన గాజు ఆలయం, నాగౌర్

జైన గాజు ఆలయం, నాగౌర్

జైన గాజు మందిరం, నాగౌర్ నగరంలోని కమ్లా టవర్ వెనుక ఉంది. ఈ ఆలయం దేశంలో ఉన్న అన్ని జైన మందిరాలలో ప్రత్యేకమైనది కారణం ఈ ఆలయం మొత్తం గాజుతో చేయబడింది. పర్యాటకులు ప్రాచీన కళను ప్రతిబింబించే ఆకర్షణీయమైన గాజు పనితనాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ మందిరం లోపలి భాగం తోరణాలతో, అందమైన చలువరాతితో అలంకరించబడి ఉంటుంది.

చిత్ర కృప : Srainywall

నాగౌర్ కోట, నాగౌర్

నాగౌర్ కోట, నాగౌర్

నాగౌర్ నగరంలో నే కాక, రాజస్థాన్ రాష్ట్రంలో కూడా బాగా ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆకర్షణ నాగౌర్ కోట. ఈ కోటని ఇసుకతో క్రీ.శ. 2 వ శతాబ్ధంలో నిర్మించారు. ఎత్తైన గోడలు, భారీ ప్రాంగణం కల్‌గిీ ఉన్న ఈ కోటలో భవనాలు, ఫౌంటైన్ లు, తోటలు, అటస్థలాలు ఉన్నాయి. ఈ కోటకి మొత్తం మూడు ప్రధాన ద్వారాలు ఉంటాయి. వీటిని శత్రువుల బారినుండి రక్షించుకొనేందుకు ఇనుము మరియు కలపతో తయారుచేశారు.

చిత్ర కృప : Richard Mortel

దీపక్ మహల్, నాగౌర్

దీపక్ మహల్, నాగౌర్

దీపక్ మహల్, నాగౌర్ లోని మరో అందమైన రాజభవనం. ఇక్కడ కూడా రాజభవన గోడలు చిత్రాలు, శాసనాల రూపంలో ప్రత్యేక పూల నమూనాతో అలంకరించబడి ఉంటాయి.

చిత్ర కృప : Sreekumar Menon

రాణి మహల్, నాగౌర్

రాణి మహల్, నాగౌర్

రాణి మహల్, నాగౌర్ లోని అందమైన రాజభవనాల్లో ఒకటి. ఇక్కడ నాగౌర్ రాజులు, రాణులు నివసించేవారని స్థానికులు చెబుతారు. పర్యాటకులు రాజభవనం లోపల ఈత కొలను ను కూడా చూడవచ్చు.

చిత్ర కృప : wandermelon

టర్కీన్ దర్గా, నాగౌర్

టర్కీన్ దర్గా, నాగౌర్

నాగౌర్ నగరంలో ఉన్న టర్కీన్ దర్గా ప్రధాన ధార్మిక కేంద్రం. అజ్మీర్ దర్గా తర్వాత ముస్లిం లు ఎక్కువగా ఈ దర్గాను దర్శించుకుంటారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి ప్రధాన శిష్యులలో ఒకడైన ఖ్వాజా హమిదుద్దిన్ నాగౌరి కి గుర్తుగా టర్కీన్ దర్గా ను నిర్మించారు.

చిత్ర కృప : Syed Zohaibullah

సైజి కా టాంకా , నాగౌర్

సైజి కా టాంకా , నాగౌర్

శ్రీ సైజి మహారాజు సాధు సమాధికి పేరుగాంచిన ఈ సైజి కా టాంకా, నాగౌర్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ సాధువు అతని జీవిత౦ మొత్తాన్నీ భగవంతుని ధ్యానంలో గడిపాడని స్థానికుల నమ్మకం. రాజపుత్ర వంశానికి చెందిన ఠాకూర్ వంశీయులు దుష్ట ఆత్మల నుండి నాగౌర్ ను రక్షించడానికి సైజి సాధువుని పిలిపించారు అని స్థానికులు చెబుతారు. సాధువుకు ప్రార్ధన చేసే౦దుకు ఈ ప్రదేశానికి అనేకమంది భక్తులు వస్తారు.

చిత్ర కృప : tagore

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

అలాగే నాగౌర్ ను సందర్శించే పర్యాటకులు అక్బారీ మహల్, అమర్ సింగ్ రాథోర్, వంశీవాలా ఆలయం, నాథ్ జి కి చాత్రి, బర్లీ సమాధులను కూడా చూడవచ్చు.

చిత్ర కృప : Prem Sukh Didel

నాగౌర్ చేరుకోవటం ఎలా ??

నాగౌర్ చేరుకోవటం ఎలా ??

నాగౌర్ చేరుకోవడానికి వాయు, రైలు మరియు బస్సు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవి

వాయు మార్గం

నాగౌర్ కు సమీపంలోని విమానాశ్రయం జోధ్‌పూర్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ఢిల్లీ, ముంబై, జైపూర్ వంటి ప్రధాన నగరాల కు అనుసంధానించబడింది. అంతర్జాతీయ పర్యాటకులు ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జోధ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడి నుండి క్యాబ్ ద్వారా నాగౌర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

నాగౌర్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ జోధ్‌పూర్, బికనీర్, జైపూర్ మరియు ఢిల్లీ వంటి ఇతర ప్రధాన నగరాల నుండి రైళ్లతో చక్కగా కలుపబడింది.

రోడ్డు మార్గం

నాగౌర్ కు దేశ రాజధాని ఢిల్లీ నుండి రోజువారి బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే అజ్మీర్, జైపూర్, జోధ్‌పూర్ మరియు బికనీర్ వంటి ప్రాంతాల నుండి నిత్యం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు, ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : suresh pareek

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X