Search
  • Follow NativePlanet
Share
» »త్రివేండ్రం వీకెండ్ ఇలా?

త్రివేండ్రం వీకెండ్ ఇలా?

త్రివేండ్రం చుట్టు పక్కల చూడదగిన ప్రాంతాలు.

కేరళలోని ప్రముఖ పర్యాటక కేంద్రం తిరువనంతపురం. సాధారణంగా ఈ తిరువనంతపురానికి స్నేహితులు, కుటుంబం సభ్యులతో వెలుతుంటారు. అదే విధంగా కేరళలోని తిరువనంతపురం ప్రముఖ హనిమూన్ డెస్టినేషన్ కూడా. కేవలం తిరువనంతపురమే కాకుండా చుట్టు పక్కల అనేక ప్రాంతాలు పర్యాటకపరంగా పేరు ప్రఖ్యాతలు సంతరించుకొన్నాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురం చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం మీ కోసం...

కన్యాకుమారి

కన్యాకుమారి

P.C: You Tube

తిరువనంతపురం నుంచి సుమారు 102 కిలోమీటర్ల దూరంలో కన్యాకుమారి ఉంది. ఇది భారత దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రం. ఏడాది మొత్తం ఇక్కడ పర్యాటకులు వస్తూనే ఉంటారు. కన్యాకుమరి వద్ద మూడు సముద్రాలు కలుస్తాయి.

ఎంతో అందంగా

ఎంతో అందంగా

P.C: You Tube

అవి బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం. ఈ మూడు సముద్రాలు కలిసే ప్రాంతం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక కన్యాకుమారిలో వివేకానందుడి విగ్రహం, గాంధీమహాత్ముడి మెమోరియల్ తదితర ప్రదేశాలు ఎన్నో చూడటానికి చాలా బాగుంటాయి.

థన్‌మాలా

థన్‌మాలా

P.C: You Tube

తిరువనంతపురం చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాల్లో థన్‌వాలా అత్యంత సుందరమైన ప్రదేశం. దీనిని ఐదు భాగాలుగా విభజించారు. సాహస వలయం, జింకల పార్కు, సాంస్క`తిక ప్రదేశం, పోర్ట్, విరామ ప్రాంతం.

అన్నివయస్సులవారు

అన్నివయస్సులవారు

P.C: You Tube

దీంతో ఇక్కడ అన్ని వయస్సుల వారు ఎంజాయ్ చేయడానికి అనువైన పర్యాటక ప్రాంతంగా దీనికి పేరుంది. ఈ థన్‌మాలా దేశీయ పర్యాటకులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఎక్కవ సంఖ్యలో ఆకర్షిస్తోంది.

కుమారకోమ్

కుమారకోమ్

P.C: You Tube

తిరువనంతపురం నుంచి సుమారు 159 కిలోమీటర్ల దూరంలో కుమార కోమ్ ఉంది. కేరళలోని ఈ పర్యాటక కేంద్రం ఏ సమయంలోనైనా కనుచూపుమేర పచ్చగా కనిపిస్తుంది. దీంతో ఒక్కసారి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే మరళా మరళా సందర్శించాలనిపిస్తుంది.

కొబ్బరి, ఖర్జురపు చెట్లు

కొబ్బరి, ఖర్జురపు చెట్లు

P.C: You Tube

కొబ్బరి, ఖర్జురపు చెట్ల సౌందర్యం ఇక్కడ పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది. అందువల్లే దేశ విదేశాల నుంచి ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఇక్కడకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు.

మున్నార్

మున్నార్

P.C: You Tube

తిరువనంతపురం నుంచి 274 కిలోమీటర్ల దూరంలో మున్నార్ ఉంది. మున్నార్ ప్రముఖ హిల్ స్టేషన్. చుట్టూ పర్వతాలు వాటి గుండా వెళ్లే తెల్లని మంచు తెరలు చూస్తూ ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటు వంటి అనేక జలపాతాల అందాలను కనులారా చూడాల్సిందేకాని వర్ణించడానికి వీలుకాదు.

హనిమూన్ డెస్టినేషన్

హనిమూన్ డెస్టినేషన్

P.C: You Tube

ఇది కూడా హనీమూన్ డెస్టినేషన్. అందువల్లే పెళ్లైన కొత్త జంటలు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. అందువల్లే ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.

కొచ్చి

కొచ్చి

P.C: You Tube

తిరువనంతపురం నుంచి 211 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కొచ్చి చేరుకోవచ్చు. ప్రక`తిలో మామేకం కావడానికి కొచ్చికి మించిన ప్రదేశంలేదని చెబుతారు. అందువల్లే ప్రక`తిని ఆరాధించేవారు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

వీకెండ్ సమయంలో

వీకెండ్ సమయంలో

P.C: You Tube

ఇక తిరువనంతపురం నుంచి వీకెండ్ సమయాన్ని సరదాగా గడపాలనుకొనేవారు ఈ ఐదు పర్యాటక కేంద్రాలకు తరుచుగా వెలుతూ ఉంటారు. తిరువనంతపురం నుంచి టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X