Search
  • Follow NativePlanet
Share
» »మీలో కాముడికి ఆరంభమే, అంతం ఉండదు?

మీలో కాముడికి ఆరంభమే, అంతం ఉండదు?

అండమాన్ లో హనీమూన్ కు అత్యంత అనుకూలమైన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు ఇవే.

హనీమూన్ కు వెళ్లాలనుకొనేవారికి మొదట గుర్తకు వచ్చేది అండమాన్ నికోబార్ దీవులే. హనీమూన్ కు ఈ దీవులు స్వర్గధామం లాంటివి. ప్రశాంత వాతావరణం, రొమాంటిక్ అలలు, అందమైన రిసార్టులు, అత్యంత రుచికరమైన ఆహార పదార్థాలు కొత్తగా పెళ్లైనవారికి మరిచిపోలేని గుర్తులుగా మిగిలిపోతాయి. అంతేకాకుండా వారిలోని వెచ్చటి కోరికలను రెచ్చగొడుతాయి. ఈ నేపథ్యంలో అండమాన్ లో హనీమూన్ కు అత్యంత అనుకూలమైన పర్యాటక ప్రాంతాలతో సాధారణ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం మీ కోసం...

కాబిన్స్ కోవ్ బీచ్

కాబిన్స్ కోవ్ బీచ్

P.C: You Tube

నగర కేంద్రం నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఈ బీచ్ ఉంటుంది. అండమాన్ లోని రొమాంటిక్ ప్రాంతాల్లో కాబిన్స్ కోవ్ బీచ్ ముందు వరుసలో ఉంటుంది. నీలి రంగులో మెరిసే సముద్ర తీరం వెంబడి కొబ్బరి, పామ్ చెట్ల లో నడుచుకొంటూ వెళుతూ మీ భాగస్వామి తో చిలిపి పనులు చేయడానికి అత్యంత అనువైన ప్రాంతం ఈ కాబిన్స్ కోవ్ బీచ్.

ఎలిఫెంటా బీచ్

ఎలిఫెంటా బీచ్

P.C: You Tube

ఎలిఫెంట్ బీచ్ ను చేరుకోవడానికి సుమారు 40 కిలోమీటర్ల దూరం బోటులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సైక్లింగ్ మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఇక్కడి ప్రశాంతి వాతావరణం ప్రక`తి ప్రేమికులకు ఎంతగానో నచ్చుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ ప్రాంతం స్వర్గధామమే.

నీల్ ద్వీపం

నీల్ ద్వీపం

P.C: You Tube

అండమాన్ లో మరో అత్యంత రొమాంటిక్ ప్రాంతం నీల్ ద్వీపం. మిగిలిన ప్రాంతాల కంటే ఈ నీల్ ద్వీపం భిన్నంగా ఉంటుంది. చిన్న అడవి గుండా ప్రయాణం మిమ్ములను ప్రక`తిలో మమేకం చేస్తుందనండంలో సందేహం లేదు. కొత్తగా పెళ్లైవారికి ఇక్కడ కాలమే తెలియదు.

బిడియా తపూ

బిడియా తపూ

P.C: You Tube

అండమాన్ లో హనీమూన్ కోసం వెళ్లే బీచ్ లలో బిడియా తపూ అత్యంత ఆహ్లాదకరమైన ప్రాంతం. ఇది ప్రధాన పట్టణం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటాయి.

ఎప్పుడు వెళ్లాలి

ఎప్పుడు వెళ్లాలి

P.C: You Tube

అండమాన్ లో ఉన్న వాతావరణ పరిస్థితులను అనుసరించి అక్కడికి అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో వెళ్లడం సబబుగా ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ జలక్రీడలు కూడా అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఈ సమయంలోనే ఇక్కడకు వెళ్లడం సబబుగా ఉంటుంది.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

P.C: You Tube

అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లడానికి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, విశాఖపట్టణం, కొలకత్తా తదితర నగరాల నుంచి మొదట పోర్ట్ బ్లెయిర్ కు వెళ్లాలి. అటు పై బోటులో అండమాన్ లో మనకు నచ్చిన ప్రాంతాలకు బోటులో వెళ్లవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X