Search
  • Follow NativePlanet
Share
» »జంటలకు హనీమూన్ ఆనందాలను మరింత పెంచే అండమాన్ నికోబార్ ఐలాండ్స్

జంటలకు హనీమూన్ ఆనందాలను మరింత పెంచే అండమాన్ నికోబార్ ఐలాండ్స్

By Venkatakarunasri

మనిషి సాధారణంగా ఎంతో కాలం నుండి నీటితో కూడిన బీచ్ విహారాలంటే దూరంగానే ఉంటున్నాడు. ఆ బీచ్ బ్రెజిలియా అమెజాన్ లేదా ఇబిజా దేశంది అయినప్పటికి గుంపులు లేని ఒంటరి విహారాలు పర్యాటకుడికి ఎపుడూ ఎంతో ప్రశాంతతను అందిస్తాయి. మరి అటువంటి గుంపులు లేని ఒంటరి విహార ప్రదేశాలు మీకు కావాలంటే, అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలకు వెళ్ళి తీరాల్సిందే మరియు ఆనందించాల్సిందే.

ఈ సెలవుల విహార ప్రదేశం సుమారు 8000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం కలిగి అనేక ప్రకృతి దృశ్యాలతో మీ రాకకై ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది. ఈ ప్రదేశం భారతదేశానికి దక్షిణ దిశగా చివరి భాగంలో ఉండటమే కాదు, బంగాళా ఖాత సముద్రంలో మనకు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటూ అతి పెద్ద కోస్తా తీరం కలిగి ఉంది.

అండమాన్ మరియు నికోబార్ అనే ఈ రెండు ద్వీపాలు పది డిగ్రీల ఉత్తర అక్షాంశంచే వేరు చేయబడుతూ రెండు విడి విడి ద్వీపాలుగా ఉన్నాయి. మరి ఈ ద్వీపాలను చేరాలంటే, పోర్ట్ బ్లెయిర్ లోని ప్రత్యేక విమానాశ్రయం ద్వారా వెళ్ళవలసిందే. ద్వీపాలన్నిటిలోను పోర్ట్ బ్లెయిర్ అధిక జనసాంద్రత కలిగి ఉంటుంది.

పోర్ట్ బ్లెయిర్ నుండి మీరు ఏ రకమైన రవాణా అయినా సరే చేపట్టవచ్చు. ఉత్తరం నుండి దక్షిణ దిశగా ఈ ద్వీపాలు నీటిలో ఎత్తైన పర్వత శ్రేణులతో సుమారు 800 కిలో మీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. పోర్ట్ బ్లెయిర్ కు వెళ్ళాలంటే, తూర్పు కోస్తాలో కల భారతీయ ఓడరేవులైన చెన్నై లేదా మద్రాస్ మరియు కోల్ కటా లేదా కలకత్తాలనుండి కూడా ఫెర్రీలో చేరుకోవచ్చు.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

ఆదిమానవులున్నారు అంటే నమ్ముతారా?

ఆదిమానవులున్నారు అంటే నమ్ముతారా?

మనం అనుకుంటాం.కొట్ట టెక్నాలజీ రోజురోజుకూ వస్తూనేవుంది. ప్రపంచమంతా డెవలప్మెంట్ పెరిగిపోతూ వుంది. ఎక్కడచూసినా ఇండస్ట్రీస్.మనుషులేప్పుడో పని చేయటం మానేసారు. ఇప్పుడంతా యాప్ లు, రాబోట్ లే పనిచేస్తాయి. ఇంత డెవలప్మెంట్ లో ఇంకా ఆదిమానవులున్నారు అంటే నమ్ముతారా?అవును.వున్నారు.

ఎక్కడున్నారు?

ఎక్కడున్నారు?

ఈరోజు భారతదేశ సముద్ర తీరప్రాంతంలో ఇంకా నివసిస్తున్న ఆదిమానవుల గురించి తెలుసుకుందాం. భారతదేశానికి,మలేషియాకి మధ్యలో వున్న బే ఆఫ్ బెంగాల్ లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర నార్త్ సెంటినల్ ద్వీపం ఈ ద్వీపంలో ఇంకా ప్రపంచాన్ని చూడని ఒక ఆదిమానవుల తెగ వుంది. ఈ తెగలో 50నుంచి 500దాకా జనాభా వుండవచ్చును. వీళ్ళ గురించి మనకు చాలా తక్కువ తెలుసు.

సెంటినెల్స్ అంటే ఎవరు?

సెంటినెల్స్ అంటే ఎవరు?

ప్రపంచంలో ఇలాంటి తెగలు సుమారు 100వుండొచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ ద్వీపంలో వున్న జనాభాని సెంటినెల్స్ అంటారు.వీరింకా మంటని పుట్టించుటకి రాళ్లనే వుపయోగిస్తారు.ఆదిమానవుల లాగే ఇంకా వారు వేటాడే ఆహారాన్ని తింటున్నారు.

వ్యవసాయం పైన వీరికి అవగాహన వుందా?

వ్యవసాయం పైన వీరికి అవగాహన వుందా?

వీళ్ళకసలు వ్యవసాయం పైనే అవగాహన లేదు. వీళ్ళతో మాట్లాడుదామని కలుద్దామని మనోళ్ళు చాలాసార్లు ట్రైచేసారు. వీళ్ళు బాణాలతో మరియు రాళ్ళతో కొట్టి మరీ వెనక్కి పంపించేసారు.ఈ సెంటినెల్స్ తెగ డైరెక్ట్ గా ఆఫ్రికాలో వుండే ఆదిమానవుల దగ్గర నుంచి వచ్చినవారైవుంటారనేది అందుకే వారలవాట్లు ఇప్పటికీ అదే విధంగా వుంటున్నాయని అంటున్నారు.

వీరు ఆహారాన్ని ఎలా తింటారు?

వీరు ఆహారాన్ని ఎలా తింటారు?

వాళ్లిప్పటికీ ఉరుముల కోసం ఎదురు చూసి వాటివల్ల మంటమండితే ఆ మంటని అలాగే వుంచి వారు ఆహారాన్ని వేడి చేసుకోవడం,ఎక్కడికి వెళ్ళినా గుంపులుగా వెళ్ళటం ఇలా ఇంకా మనం సినిమాల్లో చూసే ఆదిమానవులలాగే వుండిపోయారు.

చేపలు పట్టేవారు

చేపలు పట్టేవారు

ఒకసారి ఏమైందంటే ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు ఈ ఐలాండ్ చుట్టుపక్కలా చేపలు పట్టేడానికి వెళ్ళారు. దారి పొడవునా ఎక్కువతాగేసి బోట్లోనే పడుకుండిపోయారు. తెల్లారిలేచి చూస్తే వాళ్ళ బోట్

సెంటినల్ ఐలాండ్ దగ్గర వుంది.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

ఈ బోట్ లో వీళ్ళిద్దరినీ చూసిన సెంటినలిస్ట్ వాళ్ళిద్దరినీ వారి ఆయుధాలతో కొట్టి చంపేసారు. కొన్ని రోజుల తర్వాత మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళిద్దరినీ హెలికాఫ్టర్ లో వెదకటం ప్రారంభించారు.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

అప్పుడు వాళ్ళు రెండు డెడ్ బాడీలను గుర్తించారు. వాళ్ళను తీస్కెళ్ళడానికి హెలికాఫ్టర్ లాండింగ్ కోసం ట్రై చేస్తుంటే సెంటినలిస్ట్ వాళ్ళపై బాణాలు, రాళ్ళతో విరుచుకుపడ్డారు.దీంతో ఏంచెయ్యాలో అర్ధంకాక వెనక్కొచ్చేసారు.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

మరో విషయం ఏంటంటే ఈ సెంటినల్ ఐలాండ్ చుట్టూతా ఎన్నో ద్వీపాలున్నాయి. వాటన్నిట్లో ఎన్నో తెగలుకూడా వున్నాయి. వాళ్ళల్లో ఎవరితోనూ వీరు మాట్లాడరు. ఎవరితోనూ వీరు కలవరు.

సెంటినలిస్ట్ మాట్లాడుకునే భాష వేరే ఐలాండ్ వారితో సంబంధం వుండదు.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

దానిని ఎవరుకూడా అర్ధం చేసుకోలేరు. వాళ్ళిలా వుండటానికి కారణం ఇంకొకటి కూడా వుంది.మన భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్ళు పాలిస్తున్నప్పుడు ఈ ఐలాండ్ వాళ్ళని కలవడానికి ప్రయత్నించారు.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

ఈ ఐలాండ్ ని ఆక్రమించుకోవటానికి కొంతముందుగా ఈ తెగలోని కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని వాళ్ళ కెంప్ కి తీసికెళ్ళి వాళ్లకి బహుమతులనిచ్చి వారి ఐలాండ్ ని ఆక్రమిద్దామని ఆలోచించారు.వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా సెంటినల్ ఐలాండ్ కి వెళ్లి ఆ తెగలో ఇద్దరు ముసలివాళ్లను,నలుగురి పిల్లల్ని కిడ్నాప్ చేసి అండమాన్ కి తీసుకువెళ్ళారు.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

కానీ కొన్నిరోజుల్లోనే ఇద్దరు ముసలివాళ్ళు చనిపోయారు. ఇది చూసి బ్రిటీష్ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ తాతయ్య,అమ్మమ్మని చంపేసినతర్వాత వాళ్ళు మన మాటనేంవింటారని ఆ పిల్లల్ని సెంటినల్ లో వదిలివెళ్లిపోయారు.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

ముసలివాళ్ళు ఎందుకు చనిపోయారో బ్రిటీష్ వారికి అర్ధంకాలేదు.కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ఇన్ని సంవత్సరాలు ఎవ్వరితోను,కాంటాక్ట్ లో లేకపోవడం.వాళ్ళ ముసలివాళ్ళకి రోగనిరోధకశక్తి కొన్ని వేల సంవత్సరాలనాటిదనిఅందుకే కొత్త ప్రపంచంలోని ఏ జబ్బునీ వీళ్ళు తట్టుకోలేక చనిపోయారని చెప్తున్నారు.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

మన భారత దేశ గవర్నమెంట్ కూడా వీళ్ళనలా వదిలేయటం మంచిదని.వాళ్ళ ద్వీపానికీ ఎవరూ వెళ్ళకుండా,ఎవరూ ప్రయాణించకుండా ఒక చట్టాన్ని చేసింది. ఒక వేళ ఎవరైనా కాదని అక్కడకు వెళ్ళటానికి ప్రయత్నిస్తే వాళ్లకి జైలుశిక్ష వుండేలా ఆ చట్టాన్ని తయారుచేసింది.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

ఈ తెగని చివరి సారిగా చూసింది 2004లో సునామి వచ్సినతర్వాత అప్పుడు మన ఇండియన్ నేవీ వీళ్లుబానే వున్నారా?అని చూట్టానికి ఒక హెలికాఫ్టర్ పంపింది.

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

INDIA లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త !!!!!

కానీ ఎప్పట్లానే హెలికాఫ్టర్ పై రాళ్ళు, బాణాలు వచ్చిపడ్డాయి.దీంతో వీళ్ళు బానే వున్నారని మన హెలికాఫ్టర్ తిరిగి వచ్చేసింది. మనం వున్న భూమిమీద ఇంకా ఇలాంటివారు వున్నారంటేనే ఆశ్చర్యంగా వుందికదా

అండమాన్ మరియు నికోబార్ దీవులు సందర్శనలో మీరు ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

అండమాన్ మరియు నికోబార్ దీవులు సందర్శనలో మీరు ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

అండమాన్ మరియు నికోబార్ దీవులు ఒక అంతు లేని పరిశుభ్రమైన ఇసుక కల బీచ్ ల సముదాయాలుగా ఉంటాయి. మీరు స్కూబా డైవింగ్ లేదా నీటి లోపలి లోతులను అన్వేషించాలన్నా లేదా అక్కడ కల మొక్కలు, జంతువుల సంపదలను అన్వేషించాలన్నా ఈ దీవులు సందర్శించి అంతులేని ఆనందాలు, ఎన్నో ఆశ్చర్యాలు పొందాల్సిందే. మీకు మరో లబ్దిగా ఈ దీవులు ఇటీవలే, పర్యావరణ స్నేహప్రదేశాలుగా గుర్తించబడి ప్రకటించబడ్డాయి.

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

మీకు లభించే ఆకర్షణలు అంతూ పొంతూ లేని బీచ్ లు చూడటంతో ముగిసిపోవు. లేదా స్కూబాతో సరిపోవు. ఈ దీవులలో అతి విశాలమైన దట్టమైన అరణ్యాలు కూడా ఉన్నాయి.

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

వీటిలో వందలాది విభిన్న జాతుల పక్షులు, పూలు వంటివి ప్రత్యేకించి జంటలకు హనీమూన్ ఆనందాలు మరింత పెంచుతాయి. పర్యాటకుల కొరకు స్ధానికులు చేసే ఏర్పాట్లు పర్యావరణ స్నేహపూరితంగా ఉండి, నగరాలనుండి దూరంగా మీరు పొందగల కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు మొదలైనవి అందిస్తాయి.

 ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

అండమాన్ మరియు నికోబార్ దీవులు ఎంత ప్రత్యేకం అని పర్యాటకులకు తెలుపాలంటే, ఇప్పటికి ఇక్కడి అడవులలో సుమారు 2200 మొక్క జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో సుమారు 1300 జాతులవరకు మన భారత ప్రధాన భూభాగం కలిగి ఉంది.

 ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

అండమాన్ మరియు నికోబార్ దీవులు అలంకరణకు ప్రసిద్ధి గాంచిన షెల్ ఫిష్ లేదా ఓస్టర్లకు అతి పెద్ద మార్కెట్.ఇక భవిష్యత్తులో వేసవి సెలవులకు ఈ ద్వీపాలు ప్రధాన విశ్రాంతి నిలయాలుగా భారత దేశంలో పేరు తెచ్చుకోనున్నాయి.

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

హేవ్ లాక్ ద్వీపంలోని రాధానగర్ బీచ్ ను పేరొందిన టైమ్ మేగజైన్ వారు ఇటీవల ఆసియాలోనే అతి గొప్పదైన బీచ్ గా వర్ణించారు. హేవ్ లాక్ బీచ్ తన సుందరమైన నీలను నీటి ప్రవాహాలతో అనేక జలచరాలతో ఎంతో ఆకర్షణీయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

అండమాన్ లో విశ్రాంతి సెలవులు అంటే చాలు పర్యాటకులు జాలీబాయ్ చూసేందుకు ఇష్టపడతారు. జాలీబాయ్ ద్వీపం పక్కనే కల హేవ్ లాక్ దీవి మరియు సింకే దీవి లతో కూడా కలిపి మహాత్మ గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ గా చెపుతారు.

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

ఈ పార్క్ నే వాండూర్ మెరైన్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. కాలుష్యం ఏ మాత్రం లేకుండా నియంత్రణ చేయటం వలన, స్వచ్ఛమైన మరియు నిర్మలమైన వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకుల స్వర్గంగా చెప్పవచ్చు. ఇక్కడి జలచరాల జీవనం, స్వచ్ఛమైన అనేక పగడపు దిబ్బలు, మొక్క మరియు జంతు శ్రేణులు వంటివి ఈ ప్రాంతంలో మరెక్కడా లభించవు.

 మరి ఇంత అందమైన, అనేక విశిష్టతలు కల ఈ ద్వీపాలను చేరుకోవటం ఎలా?

మరి ఇంత అందమైన, అనేక విశిష్టతలు కల ఈ ద్వీపాలను చేరుకోవటం ఎలా?

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలను చేరుకోవటం చాలా తేలిక. భారతదేశంలోని అనేక ఎయిర్ లైన్ సంస్ధలు పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం అయిన వీర సావర్కార్ విమానాశ్రయానికి కోల్ కటా, భుమనేశ్వర్ మరియు చెన్నై లనుండి తమ విమానాలను నడుపుతున్నాయి.

 ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

ఖ్యాతిగాంచిన ఓడ రవాణా సంస్ధ షిప్పింగ్ కార్బోరేషన్ ఆఫ్ ఇండియా ఎం.వి. నాన్కోవరీ అనే ఓడను చెన్నై మరియు పోర్ట్ బ్లెయిర్ ల మధ్య నెలకు రెండు సార్లు మరియు విశాఖ పట్లణం నుండి పోర్ట్ బ్లెయిర్ కు మూడు నెలలకు ఒక సారి నడుపుతోంది.

అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం ఎలా?

అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం ఎలా?

అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలైన ధాయ్ లాండ్ మరియు సింగపూర్ ల వలెనే పెద్ద మార్పులు లేకుండా సంవత్సరమంతా ఒకే విధమైన వాతావరణం కలిగి ఉంటుంది.

అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం ఎలా?

అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం ఎలా?

ఈ దీవులను సందర్శించాలంటే అక్టోబర్ నుండి మే వరకు అనుకూలం. ఈ సమయంలో ఇక్కడ వార్షిక పర్యాటక ఉత్సవాలు జరుగుతాయి. అంతే కాక ఈ సమయంలో చక్కటి వర్షాలు పడి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. బీచ్ లో ఒక రోజు గడపాలంటే ఏ మాత్రం వేడిగా ఉండదు.

అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం ఎలా?

అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం ఎలా?

ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు సాధారణంగా 24 డిగ్రీలనుండి 32 డిగ్రీ సెల్షియస్ వరకు మారుతూంటాయి. చలికాలంలో ఒకటి లేదా రెండు డిగ్రీలు తగ్గుతాయి. వాతావరణం ఏదైనప్పటికి అండమాన్ నికోబార్ దీవులలో తేమ అధికంగా ఉంటుంది.

రూట్ మ్యాప్

రూట్ మ్యాప్

విమాన మార్గం ద్వారా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి కేవలం 4గంటలలో అండమాన్ నికోబార్ దీవులను చేరవచ్చును .

PC:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more