Search
  • Follow NativePlanet
Share
» »ఈ వింటర్ సీజన్లో బెంగళూరు సమీపంలో చూడదగ్గ అద్భుతమైన ప్రదేశాలు

ఈ వింటర్ సీజన్లో బెంగళూరు సమీపంలో చూడదగ్గ అద్భుతమైన ప్రదేశాలు

కొన్ని ప్రదేశాలు చూడాలంటే ఆయా సీజన్ల వెళితేనె చాలా బాగుంటుంది. ముఖ్యంగా వింటర్ సీజన్ అనగానే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పండగ సీజన్లు, క్రిస్మస్, న్యూ ఇయర్ హడావిడి మొదలవుతుంది. ఈ సీజన్లో సెలవులు క

కొన్ని ప్రదేశాలు చూడాలంటే ఆయా సీజన్ల వెళితేనె చాలా బాగుంటుంది. ముఖ్యంగా వింటర్ సీజన్ అనగానే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పండగ సీజన్లు, క్రిస్మస్, న్యూ ఇయర్ హడావిడి మొదలవుతుంది. ఈ సీజన్లో సెలవులు కూడా ఎక్కువే. సెలబ్రేషన్స్ జరుపుకునే వారు తప్పని సరిగా బయట ప్రదేశాలను చూడటానికి ఇష్టపడుతుంటారు. పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి శీతాకాలం ప్రయాణికులకు మరింత ప్రత్యేకమైనది. ఈ సీజన్లో ప్రకృతి అందాలు మరింత ఆకర్షిస్తాయి.

ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో సంవత్సరం మొత్తం కంటే ఈ వింటర్ సీజన్లో లవ్లీ వెదర్ ఉంటుంది. గ్రీన్ సిటిగా పిలువబడే బెంగళూరు శీతాకాల అందాలు మరింత బ్యూటిఫుల్ గా కనబడుతాయి. అంతే కాదు, బెంగళూరు చుట్టూ ఉన్న ప్రదేశాలు కూడా చాలా అందంగా ఆకర్షిస్తుంటాయి. మరి ఈ వింటర్ సీజన్లో మరీ ముఖ్యంగా జనవరి నెలలో బెంగళూరు చూట్టూ ఉన్న ఈ ప్రదేశాలను మీరు తప్పకుండా సందర్శించి, ప్రకృతి అందాలను ఆశ్వాదించండి.

1. కూర్గ్:

1. కూర్గ్:

దక్షిణ భారతదేశ కాశ్మీర్, స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా..ఇలా అనేక విధాలుగా పేరుపొంది కూర్గ్ లేదా కొడుగు చల్లని వాతావరణానికి పెట్టింది పేరు. ఏడాది పొడవునా అందమైన, పచ్చని కొండలు, విశాలమైన ప్రకృతి దృశ్యాలను కూర్గ్ లో చూడవచ్చు. శీతాకాలంలో పర్యాటకులు తక్కువగా ఉండటం వల్ల ప్రశాంతంగా వాతావరణంలో పచ్చనిప్రకృతి మద్య తేలికపాటి మేగాలు భుజాల మీద వాలిపోతున్నట్లు కనబడే అందాల ఒక్కసారిగా మనస్సును హత్తుకుంటాయి. అంతే కాదు, కూర్గ్ లో అబ్బే జలపాతం, మల్లాల్లి జలపాతం, మడికెరి కోట, ఇరుప్పు జలపాతాలు, దుబరే ఏనుగుల శిక్షణ శిబిరం మరియు హొన్నామనా వంటి పవిత్రమైన ప్రదేశాలను ఈ సెలవుదినాల్లో సందర్శించడం వల్ల మీరు ఆనందకరమైన అనుభూతిని పొందుతారు.
Tadiandamol Photo Courtesy: Jyotirmoy

2. చిక్ మంగళూరు:

2. చిక్ మంగళూరు:

ఈ శీతాకాలం, చిక్కమగళూర్ చుట్టు ప్రక్కల ప్రదేశాల ప్రకృతి అందాలను చూడగానే మైమరిచిపోతారు. ప్రశాంతమైన ఆధ్యాత్మికతతో నీలం కొండలు మరియు పచ్చని లోయల ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. చిక్క మగళూర్ లోని కలర్ ఫుల్ సీనరీస్ సంవత్సరం పొడవును మీకు గుర్తుండుపోయేలా చేస్తాయి. సెలవుదినాల్లో ప్రశాంతంగా గడపడానికి ఒక చక్కట ప్రదేశం ఇది. ప్రకృతి అందాలకు మాత్రమే కాదు చిక్ మంగళూరులో శారదాంబ టెంపుల్ మరియు ఇనామ్ దత్తాత్రేయ పీఠం వంటి మత స్థలాలకు చిక్కమగళూరు ప్రసిద్ది.
PC: Vikram Vetrivel

3.బండిపూర్ నేషనల్ పార్క్ :

3.బండిపూర్ నేషనల్ పార్క్ :

ఈ వింటర్ సీజన్లో నిజమైన వృక్షజాలం మరియు జంతుజాలం మధ్య విశ్రాంతికి మంచి ప్రదేశం ఏదైనా ఉంది అంటే బెంగళూరులో ఉండే బండిపూర్ నేషనల్ పార్క్. పిల్లలు, పెద్దలు హాయిగా ఒక రోజంతా ఎంచెక్కా తిరిగి రావడానికి అనువైన ప్రదేశం ఇది. బండిపూర్ నేషనల్ పార్క్, వన్యప్రాణుల ప్రేమికులకు స్వర్గదామం, ఈ పార్క్ లో మీరు అనేక రకాల అడవి జంతువులను చూడవచ్చు. అంతే కాదు, వివిధ రకాలైన జంతువులను మీరు మీ కెమరాలను బందించి తీపిజ్ఝాపకాలుగా ఉంచుకోవచ్చు. ఇక కుద్రేముఖ్ హిల్ స్టేషన్ బెంగళూరు నుండి గ్రేట్ వింటర్ ట్రిప్ కు అనువైన ప్రదేశం. కదంబి ఫాల్స్ మరియు బద్రటైగర్ సాక్చురీ చూడదగ్గ ప్రదేశాలు .
Nagarhole National Park Photo Courtesy: Sankara Subramanian

4. షిమోగ:

4. షిమోగ:

చాలా సుందరమైన ప్రదేశాలలో షిమోగా ఒకటి. సుదీర్ఘ శీతాకాలపు సెలవు దినాలను ఆస్వాదించడానికి అద్భుతమైన ప్రదేశం షిమోగ. రెండు మూడు రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి ఈ ప్రదేశం చాలా అనువైనది. ఎందుకంటే షిమోగ మరియు ఆ చుట్టు ప్రక్కల చూడవల్సిన అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఆనకట్టలు, సవారీలు, పర్వతాలు, జలాశయాలు, ప్రదేశాలు, జలపాతాలు మరియు దేవాలయాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. షిమోగా పర్యటనకు వెళ్ళినప్పడు జోగ్ జలపాతాలు సందర్శించడానికి మర్చిపోవద్దు.
Photo Courtesy: Kiran

5.కుడ్లే బీచ్:

5.కుడ్లే బీచ్:

గోకర్ణ పక్కన ఉన్న కుడ్లే బీచ్ భారతదేశ పశ్చిమ తీరంలో అత్యంత ప్రశాంతమైన బ్రాంచీలలో ఒకటి. దాని స్వచ్ఛమైన ఇసుక మరియు అందమైన సుదీర్ఘ వాతావరణం ఈవెనింగ్ వాక్ చేసేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాదు, ఈ ప్రదేశం నుండి మీరు చాలా గంభీరమైన సూర్యాస్తమయం చూడవచ్చు. కుడ్లే బీచ్ కు చాలా దగ్గరలో ఓం బీచ్ కూడా ఉంది, ఇది ట్రెక్కింగ్ ప్రియులకు అందమైన ప్రదేశం .
Photo Courtesy: Infoayan

6. మురుడేశ్వర:

6. మురుడేశ్వర:

ప్రపంచంలోనే అతి పెద్ద శివ విగ్రహాల్లో రెండవ విగ్రం మురుడేశ్వరలో నిర్మితమైనది. మురుడేశ్వర్ భారతదేశంలోని అత్యంత సుందరమైన యాత్రా స్థలాలలో ఒకటి. సముద్రపు తీరాన సువిశాలమైన ప్రదేశంలో అతి పెద్ద శివ విగ్రహం, ఒక గోపురంతో ఉన్న మురుడేశ్వర్ ప్రకృతి అందాలు శీతాకాంలో మరింత ఆకర్షణీయంగా కనబడుతాయి.
Photo courtesy: Thamarai Krishnamoorthi

7. హంపి:

7. హంపి:

విజయనగర సామ్రాజ్య స్థాపను గుర్తుచేయడానికి అత్యద్భుతంగా చారిత్రక శిథిలాలకు ప్రసిద్ది చెందిన ప్రర్యాటక ప్రదేశం హింపి. వింటర్ సీజన్లో హంపిని సందర్శించడం వల్ల మరింత అందంగా కనబడుతుంది. ఇటువంటి అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించడానికి వింటర్ కంటే మరో మంచి సీజన్ ఉండదనే చెప్పవచ్చు. ఈ సమయంలో హంపి పర్యటన ఒక రాజశకంను గుర్తుచేసేలా ఉంటుంది. మరి వింటర్ డెస్టినేషన్స్ ఏంటో తెలుసుకున్నారు కదా ఆలస్యం చేయకుండా సందర్శించి ప్రకృతి అందాలను కెమెరాల్లో బందిచేసి ఆశ్వాదించండి.
PC:Harshap3001

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X