Search
  • Follow NativePlanet
Share
» »ఊటిలో మీరు ఈ ప్రాంతాలను ఖచ్చితంగా చూసి ఉండరు

ఊటిలో మీరు ఈ ప్రాంతాలను ఖచ్చితంగా చూసి ఉండరు

ఊటీ చుట్టూ ఉన్నా పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం.

ఊటి...వేసవి సెలవుల్లో చాలా మంది వెళ్లే ప్రముఖ పర్యాటక కేంద్రం. దక్షిణాది రాష్ట్రాల పైకి అత్యధికమంది పర్యాటకులు వెళ్లే పర్యాటక కేంద్రంగా ఊటికి పేరొంది. అక్కడి ప్రకృతి అందాలను పలకరించడానికి విదేశీయులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఉన్న చల్లని వాతావరణం వల్ల ఈ హిల్ స్టేషన్ పర్యాటకులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షిస్తోంది. అయితే చాలా మంది ఊటి అన్న తక్షణం అక్కడి బొటానికల్ గార్డెన్, సరస్సులో బోటు ప్రయాణం, టీ మ్యూజియం వంటి మాత్రమే చూసి వెనక్కు తిరుగుతూ ఉంటాయి. అయితే ఊటీతో పాటు చుట్టు పక్కల ఉన్న మరెన్నో ప్రాంతాలు మిమ్ములను రారమ్మని పిలుస్తున్నాయి. అందులో పైకార సరస్సు, మదుమలై, వ్యాక్స్ మ్యూజియం వంటివి ఎన్నో ఉన్నాయి. వాటి వివరాలు ఈ కథనంలో మీ కోసం

చర్మవాధులను దూరం చేసి...సంతాన ప్రాప్తిని కలిగించే 'ఆది'రంగడుచర్మవాధులను దూరం చేసి...సంతాన ప్రాప్తిని కలిగించే 'ఆది'రంగడు

శుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులుశుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులు

1. పైకార

1. పైకార

సమయం...వారంలో అన్ని రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకూ

కెమరా రుసుం....ఉచితం

బోటింగ్....ఎంపిక చేసుకొన్న బోటును అనుసరించి గంటకు రూ.750 నుంచి


వాటర్ ఫాల్ ఫీజ్...ఒక్కొక్కరికి రూ.10

దగ్గరగా ఉన్న చూడదగిన ప్రాంతాలు...మధుమలై, బైసన్ వ్యాలీ

పైకార్ అన్నది ఒక గ్రామం, చిన్న సరస్సు. ఇది ఊటీ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అందం మనలను మైమరిపించేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ పైకార్ సరస్సులో బోట్ హౌస్ ప్రయాణం ఎప్పటికీ మరిచిపోలేము.

2. మదుమలై

2. మదుమలై

వ్యాన్, ఎలిఫెంట్ సఫారీ....ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ

ఫీజులు..వ్యాన్ సఫారీ ఒక్కక్కరికి రూ.50, ఎలిఫెంట్ సఫారీ ఒక్కొక్కరికి రూ.100

ప్రవేశ రుసుం....ఉచితం

కెమరా ఫీజు....స్టిల్ కెమరా రూ.50, వీడియో రూ.250
దగ్గర్లో చూడదగిన ప్రాంతాలు...పైన్ ఫారెస్ట్, పైకార

ఎంత దూరం....ఊటి నుంచి దాదాపు 46 కిలోమీటర్లు

మదుమలై అన్నది ఎలిఫెంట్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఫిబ్రవరి నుంచి మే అటు పై సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకూ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ వాహనాలను తప్ప ప్రైవేటు వాహనాలను ఈ అభయారణ్యంలోకి అనుమతించరు.

3. దొడ్డబెట్ట

3. దొడ్డబెట్ట

సమయం....వారంలో అన్ని రోజులూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ

ప్రవేశ రుసుం.....పెద్దలకు ఒక్కొక్కరికి రూ.10, చిన్న పిల్లలకు ఉచితం

కెమరా ఫీజులు...స్టిల్ కెమరా రూ.10, వీడియో రూ.50

దగ్గరగా ఉన్న చూడదగిన ప్రాంతాలు...టీ మ్యూజియం, బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, ఊటి లేక్

ఎంత దూరం....ఊటి బస్ స్టాండ్ నుంచి కేవలం రూ.10 కిలోమీటర్లు.

ప్రకృతి ఆరాధకులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడి నుంచి ఊటి అందాలను చూడటం చాలా బాగుంటుంది. ఎత్తైన పర్వత శిఖరాలు, టీ ఎస్టేట్స్ ఇవన్నీ చూస్తూ ఇట్టే సమయాన్ని మనం మరిచిపోవచ్చు.

4. వ్యాక్స్ మ్యూజియం

4. వ్యాక్స్ మ్యూజియం

సమయం...ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకూ

ప్రవేశ రుసుం...పెద్దలకు ఒక్కొక్కరికి రూ.30, పిల్లలకు ఒక్కొక్కరికి రూ.20

కెమరా ఫీజు...స్టిల్ కెమరా రూ.50, వీడియో రూ.100

దగ్గరగా చూడదగిన ప్రాంతాలు...దొడ్డబెట్ట, బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, టీ మ్యూజియం, థండర్ వరల్డ్

ఎంత దూరం...ఊటి బస్ స్టాండ్ నుంచి కేవలం 2 కిలోమీటర్లు

భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఎన్నో వస్తువులు ఈ వ్యాక్స్ మ్యూజియంలో చూడవచ్చు. ముఖ్యంగా భారతీయ చరిత్రలో గొప్పవారిగా కీర్తించబడే ఎంతమంది వ్యక్తుల విగ్రహాలను మైనంతో తయారు చేసి ఈ వ్యాక్స్ మ్యూజియం ఉంచారు. పెద్దల కంటే చిన్నపిల్లలు ఈ వ్యాక్స్ మ్యూజియంలో ఎంజాయ్ చేస్తారు. కాగా, ఇక్కడ విభిన్న ఆకృతిలో తయారు చేసి కొవ్వొత్తులు కొనుగోలు కూడా చేయవచ్చు.

5. హిడన్ వ్యాలీ

5. హిడన్ వ్యాలీ

సమయం...వారంలో అన్ని రోజులూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ

రుసుములు.......ఎటువంటి రుసులు లేవు ఉచితం

దగ్గర్లో చూడదగిన ప్రాంతాలు....ఎం.ఆర్.సీ పాయింట్, విలింగ్ టన్ లేక్, సింమ్స్ పార్క్, టీ మ్యూజియం

విలింగ్ టన్ గోల్ఫ్ కోర్స్ వెనుక వైపునే హిడన్ వ్యాలీ ఉంటుంది. ఈ హిడన్ వ్యాలీ వద్దకు చేరుకోవడానికి కొంత చేపు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అంతే కొంత దూరం నడవాలి. అందువల్లే చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చూడకుండానే ఊటి పర్యాటకాన్ని ముగించేస్తూ ఉంటారు. అయితే చుట్టూ ఉన్న ప్రక`తి అందాలను చూస్తూ నడుచుకొని వెలుతుంటే స్వర్గమే మన ముందుకు వస్తున్నట్లు అనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X