Search
  • Follow NativePlanet
Share
» »కొత్త జంటలకు విహార కేంద్రం ... కూర్గ్ !!

కొత్త జంటలకు విహార కేంద్రం ... కూర్గ్ !!

By Super Admin

తెలంగాణ ఖజురహో ఎక్కడ వుందో మీకు తెలుసా?తెలంగాణ ఖజురహో ఎక్కడ వుందో మీకు తెలుసా?

కూర్గ్ లేదా కొడగు పట్టణం కర్నాటక లోని ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది పడమటి కనుమల మల్నాడు ప్రాంతంలో కర్నాటకలోని నైరుతి ప్రాంతంలో కలదు. ఈ ప్రాంతం ప్రధానంగా పర్వతమయం. సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల నుండి 1715 మీ.ల ఎత్తువరకు ఉంటుంది. కూర్గ్ ను ఇండియాలోని "స్కాట్ లాండ్ " అంటారు. మరో రకంగా కర్నాటకలోని "కాశ్మీర్ " అని కూడా అంటారు. కొత్త దంపతుల తొలి అడుగులకు మడుగులొత్తే సుందరమైన కొండల ప్రాంతమే ఈ కూర్గ్ . కనుచూపు మేరలో ఎటుచూసినా కాఫీ తోటలు, మిరియాలు, యాలకుల తోటలతో సుమనోహరంగా ఉంటుందీ ప్రాంతం.

నాటి రాచరిక వైభవాన్ని చాటిచెప్పే పలు ప్రదేశాలు నేటీకీ కూర్గ్‌కు తలమాలికంగా నిలుస్తున్నాయి. కర్ణాటకకు చెందిన కావేరీ నది పుట్టిన ' తలకావేరీ ' గల ప్రాంతంగానూ దీనికి ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ చూడవల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటినన్నింటినీ కలగలిపి చూడాలంటే, నాలుగైదు రోజులకు మించే సమయం పడుతుంది. పిల్లలు, పెద్దలు, ముసలివారు, ముఖ్యంగా కొత్తగా పెళ్లయినవారు... ఇలా ఎవరైనా సరే కూర్గ్ లేదా కొడగు సౌందర్యానికి దాసోహం అనక తప్పదు మరి!!. ఇక చివరిగా... కాఫీ ప్రియులకు కూర్గ్‌ కాఫీ అమృతం కంటే రుచిగా, మధురంగా ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే, ఇక్కడి కాఫీ రుచికి ఎన్ని కప్పులయినా అలా తాగుతూనే ఉండాలనిపిస్తుంటుంది. అక్కడి కాఫీ తాగి నాణ్యమైన యాలకులు నోట్లో వేసుకుంటే, గాలిలో తేలిపోతున్నట్లనిపిస్తుంది. అలాంటి సువాసనను ఆస్వాదిస్తూ, కొత్త దంపతులు తొలిరాత్రుల ఆనందాన్ని హాయిగా అనుభవించవచ్చు. కానీ వీటిలో ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలను గమనించినట్లయితే...

ఫ్రీ కూపన్లు త్వరపడండి : హోటళ్లు & ట్రావెల్ బుకింగ్ చేసుకోండి 70% ఆఫర్ పొందండి

ఎలిఫెంట్ క్యాంప్

ఎలిఫెంట్ క్యాంప్

కూర్గ్‌లోని కావేరీ నది తీరంలో గల దుబరే అడవి సమీపంలో ఉన్నదే 'దుబరే ఎలిఫెంట్ క్యాంప్'. నిజానికి ఇది ఏనుగులకు శిక్షణనిచ్చే ఒక శిబిరం. ఏనుగులను పట్టే అలవాటును ఇప్పుడు అక్కడ నిలుపు చేశారు. అక్కడి క్యాంపులోని ఏనుగులను స్నానం చేయించడానికి, శుభ్రపరచడానికి నది తీరానికి తీసుకువస్తారు.

Photo Courtesy: Navaneeth KN / Kishore Murthy

మడికేరీ కోట

మడికేరీ కోట

మడికేరీ పట్టణం మధ్యభాగంలోనే బృహత్తరమైన కొట దర్శనమిస్తుంది. ఇది 19వ శతాబ్దపు కాలం నాటిది. అక్కడ జరిగిన అనేక యుద్దాలకు ప్రత్యక్షసాక్షిగా ఈ కోట నిలుస్తుంది. కోట నుండి మొత్తం కూర్గ్ పట్టణాన్ని రమణీయంగా దర్శించవచ్చు. కోటలో ప్రస్తుతం ఒక చిన్న మ్యూజియం ఉంది. అందులో కొన్ని చారిత్రాత్మక పెయింటింగులు, ఆయుధాలు, కవచకాలు, నాటి రాజులు ధరించిన దుస్తులు, అప్పటి జైలులోని వస్తువులు వంటివి చూడవచ్చు.

Photo Courtesy: Hari2007

శ్రీ ఓంకారేశ్వర దేవాలయం

శ్రీ ఓంకారేశ్వర దేవాలయం

శివుడికి చెందిన ఈ చారిత్రాత్మకమైన దేవాలయాన్ని 1820 లో కూర్గ్ రాజు నిర్మించాడు. అత్యద్భుతమైన ఇస్లామిక్, గోధిక్ శిల్పకళా రీతులకు ఇది పేరెన్నికగన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఉత్సవాలు జరుగుతాయి. ఈ గుడి గోపురం పైన గల గుండ్రని బంతిలాంటి ' వాతావరణ గడియారం' భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Photo Courtesy: ramprasad lg

అబ్బీ జలపాతం

అబ్బీ జలపాతం

ఇదివరకైతే ఈ జలపాతాన్ని ' జెస్సీ ఫాల్స్ ' అని పిలిచారు. స్థానిక యాసలో అబ్బీ అంటే కోడగు జలపాతం అని అర్థం. ఎంతో సుందరమైన ఈ జలపాతం కూర్గ్‌కు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉంది. ప్రతి ఏట అక్టోబర్ నుండి మార్చి వరకు ఇక్కడ పుష్కలంగా నీరు ఉంటుందని చెబుతారు.

Photo Courtesy: Ananth BS

భాగమండలం

భాగమండలం

పవిత్ర ఆలయాలకు పేరు గాంచిన భాగమండలం కూర్గ్‌కు 30 కి.మీ. దూరంలోఉంది. జిల్లాలో ఎంతో పేర్గాంచిన ఆలయ పట్టణం ఇది. ఇక్కడే కావేరీ నది సుజ్యోతి, కన్నికలతో సంగమిస్తుంది. కాగా, పవిత్రమైన కావేరీ నది పుట్టిన చోటునే ' తలకావేరీ గా పిలుస్తారు. అక్కడి తటాకం సమీపంలోనే అశ్వంత వృక్షం ఉంది. అగస్త్య మహామునికి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యింది ఇక్కడేనని స్థానికులు చెబుతారు. ఇంత పవిత్రత ఉంది కాబట్టే, భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ప్రతి ' తుల సంక్రమణ ' రోజున అంటే సుమారు అక్టోబర్ 17న ఇక్కడ కావేరి దేవత జలాల ప్రవాహాలను వేలాదిమంది దర్శిస్తారు.

Photo Courtesy: Ashok Prabhakaran

ఇరుపు జలపాతం

ఇరుపు జలపాతం

ఇరుపు జలపాతం నాగర్‌ హోల్ వెళ్లేదారిలో వీరాజ్‌ పేట్‌ కు 48కి.మీ. దూరంలో ఉంది. ఇది ఎంతో మంచి పర్యాటక ప్రదేశమేగాక పిక్నిక్ స్పాట్‌ గా కూడా బాగా ప్రసిద్దిగాంచింది. కావేరీనదికి ఉపనది అయిన లక్ష్మణ తీర్థ నది ఒడ్డున ప్రముఖ శివాలయం ఒకటి ఉంది.

Photo Courtesy: telugu nativeplanet

 కాఫీ, నారింజ తోటలు

కాఫీ, నారింజ తోటలు

అపరిమితమైన వరి పొలాలు, కాఫీ, నారింజ తోటలకు కూర్గ్‌లో కొదువ లేదు. ఇక్కడి లోయలు, కొండ ప్రాంతాలను ఉదయ కాలంలో కప్పేసే పొగ మంచు ప్రతి ఒక్క యాత్రికుడినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. అత్యంత సుందరమైన ఆ దృశ్యాలు పర్యాటకులకు మరచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ ప్రాంతం మిరియాలు, ఏలకులు వంటి మసాలా దినుసులకు కూడా ప్రసిద్ధిగాంచింది. ఒక్క మడికేరీలోని కాఫీ తోటలే కర్ణాటక రాష్ట్రంలోని కాఫీ ఉత్పత్తిలో సగం భాగస్వామ్యాన్ని కలిగిఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికీ దేశంలోనే కాఫీ పండించడంలో కర్ణాటక అతిపెద్ద రాష్ట్రంగా ఉంది.

Photo Courtesy: Philip Larson

హారంగి డ్యామ్ ప్రదేశం

హారంగి డ్యామ్ ప్రదేశం

పర్యాటకులు హారంగి డ్యామ్ ను కూడా తప్పక చూడాలి. ఇది కావేరి ఉపనదిపై కలదు. ఈ డ్యామ్ పొడవు షుమారు 846 మీ.లు కాగా ఎత్తు 47 మీ.లుగా ఉంటుంది. ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలలో పర్యాటకులు ఈ డ్యామ్ వద్ద అందమైన రిజర్వాయర్ నిండుగా ఉండటం చూస్తారు. హారంగి డ్యామ్ వద్ద పర్యాటకులకు అతిధి గృహాలు లభిస్తాయి. పూర్తి ప్రశాంతతతో ఈ ప్రదేశం పర్యాటకులకు హాయి కలిగిస్తుంది. ఎపుడు చూసినా పర్యాటకులు కొద్ది సంఖ్యలోనే ఉంటారు కాబట్టి మరింత సౌకర్యం కలిగి ఉంటుంది.

Photo Courtesy: coorg

బైలేకెప్పే

బైలేకెప్పే

కూర్గ్ సమీపంలో చూడతగ్గ వాటిలో "టిబెటన్ స్వర్ణ దేవాలయంగా" పిలిచే బైలేకుప్పే ప్రసిద్దిగాంచింది. ఇక్కడి అద్భుతమైన శిల్పకళకు ప్రతి ఒక్కరూ మగ్దులవుతారు. ఇక్కడ సుమారు 5,000 మంది బౌద్ద బిక్షవులకు విద్యాబుద్దులు చెబుతుంటారు. ఈ ప్రాంతమంతా చూడటానికి ఒక చిన్న టిబెటన్ గ్రామంలా ఉంటుంది. జవహర్‌లాల్ నెహ్రూ బౌద్ద భిక్షువులకు ఇచ్చిన రెండు మఠాలలో ఇది ఒకటి కాగా మరొకటి హిమాచల్‌లోని ధర్మశాలలో ఉంది.

Photo Courtesy: Premnath Thirumalaisamy

తలకావేరి

తలకావేరి

హిందువుల పవిత్ర స్ధలం. కావేరి నది పుటుక ఇక్కడ జరిగింది. ఇక్కడ నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. సమీపంలో అగస్తేశ్వర దేవాలయం కలదు. తలకావేరీ నదిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని, బాధలు తీరతాయని హిందువులు భావిస్తారు. తలకావేరి నుండి భాగమండల 8 కి.మీ.ల దూరం. సమీపంలో గణపతి, సుబ్రమణ్య, విష్ణ దేవాలయాలు కలవు. వార్షిక జాతర ప్రతి ఏటా అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో జరుగుతుంది. ఆ సమయంలో నదీ ప్రవాహ వెల్లువలు చూసేందుకు యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు. దేవాలయాలలో వేలాది దీపాలను వెలిగిస్తారు.

Photo Courtesy: telugu nativeplanet

వాతావరణం

వాతావరణం

ఏ రుతువులో నయినా సరే, ఉష్ణోగ్రత 20-25 డిగ్రీలకు మించని కూర్గ్ ప్రాంతంలో మనకు తెలియకుండానే కాలం ఇట్టే హాయిగా గడచిపోతుంది. ఎక్కడికెళ్లినా పచ్చదనం, నీలి ఆకాశం దానికింద పెద్ద పెద్ద లోయలు , ఆ లోయలలో ప్రవహించే అందమైన సెలయేర్లు, అక్కడక్కడా జలపాతాలు పర్యాటకు లను విశేషంగా ఆకట్టుకుంటాయి.

Photo Courtesy: Philip Larson

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

విమాన సౌకర్యం

కూర్గ్ లో ఎటువంటి విమానాశ్రయం లేదు కానీ దీనికి చేరువలో మూడు ఏర్ పోర్ట్ లు ఉన్నాయి. ఈ విమానాశ్రయాలు దేశంలోని అన్ని నగరాలకు కనెక్ట్ అయి ఉన్నాయి. అవి వరుసగా మైసూర్ , మంగళూరు, బెంగళూరు . మైసూర్ నుంచి సుమారుగా 120 కి. మీ. దూరంలో, మంగళూరు నుంచి సుమారుగా 135 కి. మీ. దూరంలో మరియు బెంగళూరు నుంచి సుమారుగా 260 కి. మీ. దూరంలో కూర్గ్ ఉంది.

రైలు సౌకర్యం

కూర్గ్‌ కు సమీప రైల్వేస్టేషన్ మైసూర్. ఇక్కడ్నుంచి కూర్గ్ 114 కి.మీ. దూరంలో ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి మైసూరుకు రైళ్ల సౌకర్యాలు ఉన్నాయి. అంతే కాదు మంగళూరు మరియు హస్సన్ లు కూడా దీనికి చేరువలో గల రైల్వే స్టేషన్ లు. హస్సన్ అయితే 103 కి. మీ .దూరంలో ఉంటుంది.

రోడ్డు సౌకర్యం

కూర్గ్ చక్కటి రోడ్డు వ్యవస్థ కలిగి ఉంది. ఇక రోడ్డు మార్గం విషయానికొస్తే మైసూర్ నుండి 120 కి. మీ. దూరంలో , హస్సన్ నుంచి 103 కి. మీ. దూరంలో , మంగళూరు నుంచి సుమారుగా 145 కి. మీ. దూరంలో ఉంటుంది.

Photo Courtesy: Haseeb P

వసతి

వసతి

కూర్గ్‌లో యాత్రికులు, నవదంపతులు మజిలీ చేయడానికి పలు రిసార్ట్‌లుకూడా ఉన్నాయి.
విండ్ ఫ్లవర్ రిసార్ట్ గురించి కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని రిసార్ట్ లు, హోటళ్లు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy:rishabh_m

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X