Search
  • Follow NativePlanet
Share
» »అందమైన కోటలు...బికనీర్ ఊసులు

అందమైన కోటలు...బికనీర్ ఊసులు

బికనీర్ చుట్టు పక్కల చూడదగిన ప్రాంతాల వివరాలతో కూడిన కథనం.

అందమైన కోటలు చారిత్రాత్మక విశేషాలను చెప్పే రాజసౌధాలు బికనీర్ సొంతం. తనదైన శైలిలోని నిర్మాణ చారుర్యాన్ని సొంతం చేసుకొంది ఈ ఎడరి నగరమైన బికనీర్. అంతేకాదు ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన
మిఠాయిలూ, నమ్ కీన్స్ (స్నాక్స్) బికనీర్ వాసుల సొంతం. అంతేకాదు ఇక్కడ దొరికే ఉన్ని చాలా ప్రాముఖ్యత కలిగినది. బికనీర్ లోని జూనాఘడ్ కోట, లక్ష్మీ నివాస్ ప్యాలెస్, బందాసర్ జైన్ దేవాలయం, ఇక్కడికి పర్యాటకులను స్వాగతిస్తూ ఉంటాయి. వీటితో పాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాల వివరాలు మీ కోసం...

జునాగడ్ కోట

జునాగడ్ కోట

P.C: YouTube

బికనీర్ లోని రాజవంశపాలనను చాటిచెప్పే నిర్మాణంలో జునాగడ్ కోట ముఖ్యమైనది. 1571 నుంచి 1612 వరకూ బికనీర్ రాజ్యాన్ని పాలించిన ఆరవ రాజైన రాజ రాయ్ సింగ్ ఈ కోటను నిర్మించారు. మొఘల్ చక్రవర్తులతో పాటు జోధ్ పూర్ నుంచి వచ్చిన నిధులతో ఈ కోటను రాయ్ సింగ్ నిర్మించాడు. ఈ కారణంగానే జునాగడ్ కోట నిర్మాణంలో మొఘల్ చిత్రకళ శైలి కనిపిస్తుంది.

జునాగడ్ కోట

జునాగడ్ కోట

P.C: YouTube

బికనీర్ లోని రాజవంశపాలనను చాటిచెప్పే నిర్మాణంలో జునాగడ్ కోట ముఖ్యమైనది. 1571 నుంచి 1612 వరకూ బికనీర్ రాజ్యాన్ని పాలించిన ఆరవ రాజైన రాజ రాయ్ సింగ్ ఈ కోటను నిర్మించారు. మొఘల్ చక్రవర్తులతో పాటు జోధ్ పూర్ నుంచి వచ్చిన నిధులతో ఈ కోటను రాయ్ సింగ్ నిర్మించాడు. ఈ కారణంగానే జునాగడ్ కోట నిర్మాణంలో మొఘల్ చిత్రకళ శైలి కనిపిస్తుంది.

లాల్ ఘడ్ ప్యాలెస్

లాల్ ఘడ్ ప్యాలెస్

P.C: YouTube

క్రీస్తుశకం 1902 నుంచి 19226 మధ్య కాలంలో లాల్ ఘడ్ ప్యాలెస్ నిర్మితమైనదని చరిత్రకారులు చెబుతారు. మహారాజ గంగాసింగ్ ఈ ప్యాలెస్ ను నిర్మించారు. ప్యాలెస్ వైభవోపేత మైన స్థంభాలు, ల్యాట్టిక్ వర్క్, పిలిగ్రీ వర్క్ అడగడుగునా దర్శనమిస్తుంది.

మూల్ నాయ్ జీ

మూల్ నాయ్ జీ

P.C: YouTube

క్రీస్తు శకం 1486లో నిర్మితమైన మూల్ నాయక్ జీ బికనీర్ లో నిర్మితమైన మొట్టమొదటి వైష్ణవ దేవాలయమని చరిత్ర చెబుతోంది. వైష్ణవులకు ఈ ఆలయం అతిముఖ్యమైన ప్రదేశం. ఈ ఆలయంలో ఆ నల్లనయ్య ప్రధాన దైవంగా పూజలు అందుకొంటున్నాడు.

భందాసర్ జైన్ దేవాలయం

భందాసర్ జైన్ దేవాలయం

P.C: YouTube

బికనీర్ వ్యాప్తంగా దాదాపు 27 జైన దేవాలయాలు ఉన్నప్పటికీ బంధాసర్ జైన్ దేవాలయం ఐదవ తీర్థాంకరుడు సుమతీనాథ్ కు అంకితం చేయబడింది. అత్యంత అందమైన ఎత్తైన నిర్మాణంగా ఈ ఆలయానికి
పేరుంది. ఈ ఆలయ పునాదులను స్వచ్ఛమైన నెయ్యి , ఎండుకొబ్బరితో నిర్మించారు.

కొలయట్

కొలయట్

P.C: YouTube

కొలను పక్కన ధ్యానముద్రలో కొలవుదీరిన కపిల దేవుని కోసం ఈ ఆలయం నిర్మితమైనది. ఈ ఆలయానికి ఎక్కువ సంఖ్యలో సాధువులు వస్తుంటారు. పుష్కర్ పండుగ కాలంలో ఈ ఆలయానికి వచ్చే సాధువుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని దర్శించడం పరమ పవిత్ర కార్యంగా రాజస్థాన్ వాసులు భావిస్తారు.

శివభారి ఆలయం

శివభారి ఆలయం

P.C: YouTube

ఎర్రటి ఇసుక రాయితో నిర్మితమైన ఈ ఆలయం 19వ శతాబ్దం చివరిలో నిర్మితమైనది. బికనీర్ ను పాలించిన దుంగార్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. నల్లని చలువరాతితో రూపొందించిన చతుర్ముఖ శివరూపం ఇక్కడ ప్రత్యేకత.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X