Search
  • Follow NativePlanet
Share
» »మీరు మీ కుంటుంబ చూడదగ్గ పర్యాటక కేంద్రాలు

మీరు మీ కుంటుంబ చూడదగ్గ పర్యాటక కేంద్రాలు

అక్టోబర్ లో కుంటుంబ సభ్యుతలతో కలిసి చూడదగిన ప్రాంతాలు

దసరా, వేసవి ఇలాంటి సమయాల్లో ప్రతి ఒక్కరికి తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కొత్త ప్రదేశాలు చూసి రావాలాని ఉంటుంది. మీకు ఉండదా చెప్పండి. అయితే భారత దేశంలో చాలా ప్రాంతాలు పర్యాటకానికి అనుకూలమే అయినా కుటుంబ సభ్యులతో కలిసి చూడటానికి అనువైనవి కొన్ని ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి మీకోసం అందిస్తున్నాం.

ఢిల్లీ-ఆగ్రా-జైపూర్

ఢిల్లీ-ఆగ్రా-జైపూర్

P.C: You Tube

మొఘలుల కాలంనాటి కోటల నుంచి అత్యంత రుచికరమైన రెస్టోరెంట్ల వరకూ ప్రతి ఒక్కటి ఈ మార్గంలో ఆస్వాధించవచ్చు. అంతేకాకుండా మనకు నచ్చినవన్నీ తక్కువ ధరల్లో కొనుగోలు చేయడం కోసం ఇక్కడి బజార్లలో షాపింగ్ చేయవచ్చు. ఉత్తమైన టూర్ కోసం ఢిల్లీ దర్శన్ ను బుక్ చేసుకోండి.

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

చిన్న, పెద్ద అందరికీ నచ్చే పర్యాటక ప్రాంతం హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ సాహస క్రీడల నుంచి మొదలుకొని ధార్మిక ప్రదేశాల వరకూ ఎన్నో పర్యాటక ప్రాంతాలు మిమ్ములను రారమ్మని పిలుస్తూ ఉంటాయి. మీతో పాటు 10 ఏళ్ల కంటే తక్కువ వయస్స ఉన్న పిల్లలుంటే మాత్రం ఇక్కడ ట్రెక్కింగ్ వెళ్లకండి

కాశ్మీర్

కాశ్మీర్

P.C: You Tube

మినీ స్విర్జర్ ల్యాండ్ గా పేరుగాంచిన కాశ్మీర్ భారత దేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అక్టోబర్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటు వంటి అనేక పర్వత, నదీలోయల్లోని పుష్పవనాలు వికసించి మీకు, మీ కుటుంబ సభ్యులకు స్వాగతం పలుకుతాయి. శ్రీనగర్ లో హౌస్ బోటింగ్ మాత్రం మిస్ చేసుకోకండి

ఈశాన్య ప్రాంతాలు

ఈశాన్య ప్రాంతాలు

P.C: You Tube

భారత దేశంలోని ఈశాన్య ప్రాంతాలు ఈ అక్టోబర్ లో చాలా అందంగా కనిపిస్తాయి. దాదాపు పర్వత మయమైన ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక్కడ మీకు అరుదైన రెడ్ పాండ, వలస పక్షులు ఎదురవుతాయి. ముఖ్యంగా యుమ్తాంగ్ వ్యాలీని చూడటం మాత్రం మరిచిపోవద్దు.

రాజస్థాన్

రాజస్థాన్

P.C: You Tube

కుటుంబ సభ్యులతో కలిసి చూడదగిన పర్యాటక కేంద్రాలు ఎక్కువగా రాజస్థాన్ లో ఉన్నాయి. ముఖ్యంగా అలనాటి రచరికానికి గుర్తుగా నిలిచిన ప్యాలెస్ లు, ఎడారీ ఇసుక తిన్నల వెంబడి ఒంటెల పై ప్రయాణం మీకు మీ కుంటుంబానికి మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తాయి.

అండమాన్ నికోబార్

అండమాన్ నికోబార్

P.C: You Tube

అండమాన్ నికోబార్ ది పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానం, ఒంటరిగా పోయినా అంతులేని అనుభూతిని మిగులుస్తుంది. ఇక కొత్తగా పెళ్లైనవారు హనీమూన్ కోసం ఇక్కడకు వెళ్లడం మనకు తెలిసిందే. అదే విధంగా కుటుంబ సభ్యులు కూడా మూడు రోజుల పాటు సరదాగా గడపడానికి ఇక్కడి బీచ్ లు రారమ్మని ఆహ్వానం పలుకుతాయి.

హరిద్వార్, రుషికేష్

హరిద్వార్, రుషికేష్

P.C: You Tube

హరిద్వార్, రుషికేష్ ను చాలా మంది ధార్మిక ప్రాంతాలుగానే గుర్తిస్తారు. అయితే ఇక్కడ ట్రెకింగ్ మొదలుకొని కయాగింగ్, స్పోడ్ బోట్ వంటి అనేక సహాస క్రీడలకు ఈ హరిద్వార్, రుషికేష్ లు నిలయం. అందువల్లే ఇటీవల కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది.

కేరళ

కేరళ

P.C: You Tube

కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటారు. పర్యాటక రంగంలో భారత దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఈ కేరళ ఆదర్శమని చెప్పవచ్చు. ఇక్కడి పిల్ల కాలువలు మొదలుకొని నదీ, సముద్ర తీరాల వరకూ ప్రతి ఒక్కటి మీ పర్యాటకానికి అంతులేని అనుభూతులను దరిచేరుస్తాయి.

నైనిటాల్

నైనిటాల్

P.C: You Tube

నైనిటాల్ లో పడవలో ప్రయాణం జీవితంలో మరిచిపోలేని ఆనందాలను మిగులుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రక`తిలో మమేకం కావాలనుకొనేవారికి ఈ నైనిటాల్ ఉత్తమ పర్యాటక ప్రాంతం.

కూర్గ్

కూర్గ్

P.C: You Tube

కర్నాటకలో కూర్గ్ అత్యుత్తమ హిల్ స్టేషన్. కూర్గ్ మార్గంలో మీరు ఊటీ, కొడైకెనాల్ ను కూడా చూడవచ్చు. కనుచూపు మేర పచ్చదనం తప్ప మరేమీ మీకు ఇక్కడ కనిపించదు. కూర్గ్ లో అబ్బే వాటర్ ఫాల్, ఊటీలో బొటానికల్ గార్డెన్ చూడటం మరిచపోకండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X