Search
  • Follow NativePlanet
Share
» »అక్టోబర్ లో హాయి హాయిగా కర్నాటకను ఇలా చుట్టేదాం

అక్టోబర్ లో హాయి హాయిగా కర్నాటకను ఇలా చుట్టేదాం

కర్నాటకలో అక్టోబర్ లో సందర్శించాల్సిన ప్రాంతాలు.

కర్నాటక ప్రపంచ పర్యాటక పటంలో దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. కూర్గ్, నంది హిల్స్, చిక్కమగళూరు వంటి హిల్ స్టేషన్స్, పట్టదకళ్, హలేబీడు, హంపి వంటి శిల్పకళా వేదికలతో పాటు ఆధునిక ప్రపంచానికి నిలువుటద్దాలైన మైసూరు, మంగళూరు, బెంగళూరు వంటి మహానగరాలు కూడా ఈ కర్నాటక సొంతం. అంతేనా ఆధ్యాత్మిక క్షేత్రాలైన గోకర్ణ, ఉడిపి తో పాటు ఎంతో అందమైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రం కర్నాటక. ఇక్కడ చూడటానికి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చిటపట చినుకులు పడే అక్టోబర్ నెలలో ఇక్కడ చూడదగిన ప్రాంతాల్లో మచ్చుకు కొన్ని...

మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిన ప్రాంత మన తెలుగు రాష్ట్రాల్లోనే?మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశం భద్రపరచబడిన ప్రాంత మన తెలుగు రాష్ట్రాల్లోనే?

అపరిచిత వ్యక్తి రూపంలో మీకు కాళీమాత వివాహం చేస్తుంది.అపరిచిత వ్యక్తి రూపంలో మీకు కాళీమాత వివాహం చేస్తుంది.

కూర్గ్

కూర్గ్

P.C: You Tube

కర్నాటక లో ప్రముఖ హిల్ స్టేషన్లలో ముందు వరుసలో ఉంటుంది. ఒక వైపు పచ్చటి చెట్లు, మరో వైపు గంభీరంగా జాలువారే జలపాతాలతో పాటు అంతరించే స్థితికి చేరుకున్న ఎన్నో జంతువులకు ఈ కూర్గ్ నెలవు. అక్టోబర్ నుంచి మార్చ్ మధ్య కాలంలో కూర్గ్ చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది.

హనీమూన్ జంటలు

హనీమూన్ జంటలు

P.C: You Tube

ముఖ్యంగా హనీమూన్ జంటలు ఎక్కువ మంది ఈ సమయంలోనే ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడే అబ్బే ఫాల్స్, బ్రహ్మగిరి, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, ఇరుప్పు ఫాల్స్, నాగర్ హోల్ నేషనల్ పార్క్, చిత్తాలి, బైలుకుప్పే, కావేరి నిసర్గధామ తదితర ప్రాంతాలను చూడవచ్చు.

ఇక్కడికే వెళితే మోక్షం, అదృష్టం ఉంటే అనంత చోళ సంపద మీ చెంతకుఇక్కడికే వెళితే మోక్షం, అదృష్టం ఉంటే అనంత చోళ సంపద మీ చెంతకు

హంపి

హంపి

P.C: You Tube

భారతదేశ చరిత్రలో హంపిది ప్రత్యేక స్థానం. హంపి ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య రాజధాని. ప్రస్తుతం బళ్లారి జిల్లాల్లో ఉంది. 14వ శతాబ్దపు అవశేషాలు 26 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఒక వైపు తుంగభద్ర నది గలగలను వింటూనే ఆనాటి శిల్పుల కళా చాతుర్యాన్ని ప్రదర్శించే ఎన్నో మంటపాలను సందర్శించవచ్చు.

విరూపాక్ష దేవాలయం

విరూపాక్ష దేవాలయం

P.C: You Tube

హంపిలో చూడదగిన ప్రాంతాల్లో విరుపాక్ష దేవాలయం ఒకటి. ముఖ్యంగా ఈ దేవాలయానికి చెందిన 50 మీటర్ల గాలి గోపురం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక్కడ విఠాలలయం కూడా చూడదగినదే. ఇక్కడ సప్త స్వరాలను వినిపించే స్తంభాలు చూడవచ్చు. ఇక హంపి చుట్టు పక్కల కూడా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

మైసూరు

మైసూరు

P.C: You Tube

కర్నాటకలో మూడో అతి పెద్ద నగరం మైసూరు. కర్నాటక రాజధాని బెంగళూరు నుంచి నైరుతి దిశలో సుమారు 146 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంటుంది. ఇక్కడ చాముండి హిల్స్ పై ఉన్న చాముండి మాత దేవాలయాన్ని తప్పకుండా సందర్శించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మైసూరు పాక్, మైసూరు పట్టు వస్త్రాలు చాలా ప్రాచూర్యం చెందాయి.

దసరా ఉత్సవాలు

దసరా ఉత్సవాలు

P.C: You Tube

మైసూరు శివారులో ఉన్న బ`ందావన్ గార్డెన్ కూడా చూడదగినది. రాత్రి సమయంలో విద్యుత్ వెలుగులో ఈ ఉద్యానవనం అందాలను ఎంత వర్ణించినా తక్కువే. ఇక అక్టోబర్ నెలలో మైసూరు నగరంలో జరిగే ఉత్సవాలను చూడటం కోసం ప్రపంచం నలుమూలల నుంచి కూడా వస్తారు. ఈ ఉత్సవాలను పది రోజుల పాటు ప్రభుత్వం అంగరంగ వైభంగా జరుపుతుంది. చివరి రోజు జరిగే జంబూసవారి చూడదగినది.

మురుడేశ్వర

మురుడేశ్వర

P.C: You Tube

కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ తాలూకాలోని చిన్న పట్టణం మురుడేశ్వర. ఇది అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ఇక్కడ ఉన్న ప్రధాన శివాలంయంలో శివుడు మురుడేశ్వరుడి పేరుతో అర్చించబడుతున్నాడు. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం.

సూర్యరశ్మి పడితే మెరిసే విగ్రహం

సూర్యరశ్మి పడితే మెరిసే విగ్రహం

P.C: You Tube

శివుడి ఆత్మలింగం ఇక్కడ ప్రతిష్టించబడిందని చెబుతారు. అందువల్లే దీనిని భూ కైలాసంగా పేర్కొంటారు. ఇక్కడ మురుడేశ్వర కోట, శివుని విగ్రహం చూడదగినది. 123 అడుగులు అంటే 37 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శివుడి విగ్రహం చెక్కడానికి ఏడాది పట్టింది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే సూర్యరస్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది.

శ్రావణబెళగొళ

శ్రావణబెళగొళ

P.C: You Tube

కర్నాటకలోని హాసన్ జిల్లాలో శ్రావణబెళగొళ ఉంది. ఇది బెంగళూరు నుంచి 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైనులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షత్రం ఈ శ్రావణబెళగొళ. రాజస్థాన్ లోని అబూ పర్వతం, ఒడిశఆలోని ఉదయగిరితో పాటు ఈ శ్రావణబెళగోళ జైనులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం.

అందుకే ఆ పేరు

అందుకే ఆ పేరు

P.C: You Tube

ఈ పట్టణం మధ్యలో ఒక కొలను ఉంది. దీనికి శ్వేత కొలను లేదా దవళ సరోవరం అని పేరు. ఈ శ్వేత కొలనుకు కన్నడంలో బెళగొళ అని పేరు. శ్రవణుడు అంటే గోమఠేశ్వరుడి బెళగొళ కాబట్టి ఈ ప్రాంతానికి శ్రావణ బెళగొళ అని పేరు వచ్చింది.

ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X