Search
  • Follow NativePlanet
Share
» »క్యాలికట్ లో ఉండే ఈ సుందరమైన ప్రదేశాలను చూశారా?

క్యాలికట్ లో ఉండే ఈ సుందరమైన ప్రదేశాలను చూశారా?

కేరళ అనగానే..ఇక్కడి ప్రకృతి, లోయలు, మనసును కట్టిపడేసే అందమైన ఇళ్లు, ప్రజల జీవన విధానం ముచ్చటగొలుపుతాయి. కనువిందు చేసే సెలయేర్లు, ఆహ్లాదాన్ని కలిగించే పచ్చని చెట్లు, అరుదైన బోట్లు, అందనంత ఎత్తులో నివాసాలూ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కేరళ వైవిధ్యం ఎంతో! కేరళ మొత్తంలో చెప్పుకోదగ్గ ప్రాంతాలు ఇవీ అని ప్రత్యేకంగా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

క్యాలికట్ కేరళలోని ఒక అందమైన నగరంగా ప్రసిద్ది చెందినది. ఈ నగరం ఒక సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. కేరళలోని కోలికోడ్ ను కాలికట్ గా కూడా పిలువబడుతున్న ఈ నగరం సౌత్ ఇండియాలో కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళలో ఈ కాలికట్ మూడవ అతి పెద్ద నగరం. ఇది కోలికోడ్ జిల్లా యొక్క ప్రధాన కేంద్రం. సాంప్రదాయ పురాతన పద్దతులు మరియు మధ్యయుగపు మసాలా దినుసుల నగరంగా పేర్కొనబడినది.కాలికట్ తూర్పు విభాగపు మసాలా దినుసులకు ఒక ప్రధాన వాణిజ్య నగరంగా పిలువబడింది.

ఈ నగరం దాని సంపదతో ప్రయాణీకులను ఆకర్షించింది. నల్ల మిరియాలు మరియు ఏలకులు వంటి సుగంధద్రవ్యాలతో 500 సంవత్సరాలకు పైగా అరబ్బులు, యూదులు, ఫోనీషియన్లు మరియు చైనీస్లను వర్తకం చేసింది. కాలికట్ లో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. మీరు కాలికట్, కేరళకు ప్రయాణిస్తుంటే, అక్కడ ఈ ముఖ్యమైన స్థలాలను సందర్శించడం మర్చిపోవద్దు.

1. లౌట్ హౌస్:

1. లౌట్ హౌస్:

లౌట్ హౌస్:

తిక్కోటి లైట్హౌస్ కాలికట్లో అత్యంత వినోదాత్మక కట్టడాలలో ఒకటి. తిక్కోటి అనే అందమైన ఒక చిన్న గ్రామంలో ఉంది. కాలికట్ నగరం నుండి సుమారు 30 మీటర్ల దూరంలో ఉన్న,ఈ చారిత్రాత్మక కట్టడం ప్రతి సంవత్సరం చాలా మంది పర్యాటకులు మరియు సందర్శకులను ఆకర్షిస్తుంది.లైట్హౌస్ చుట్టుపక్కల ప్రాంతం రాతి, వేల్లియంకల్లు ,అరేబియా సముద్రంలో భారీ రాతి నిర్మాణం అద్భుతమైన వీక్షణను అందిస్తుంది.నీరు వేడిగా ఉండుట వల్ల అలలు నురుగుగా ఉంటాయి.వేల్లియంకల్లు ఉత్కంఠభరితమైన ప్రదేశం.ఇది అనేక రకాల వలస పక్షులకు నివాసముగా ఉంది.లైట్హౌస్ ను 1847 లో నిర్మించారు.లైట్హౌస్ 33.5 మీటర్ల ఎత్తు ఉండే లైట్ హౌస్ పైకి పర్యాటకులు వెళ్లి చుట్టుపక్కల ఉన్న అద్భుత ద్రుశ్యాలను చూసి ఆనందం పొందవచ్చు. పర్యాటకులు లైట్ హౌస్ ఎక్కాలంటే అక్కడి అధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

థుశరగిరి జలపాతం:

థుశరగిరి జలపాతం:

PC:നിരക്ഷരൻ

కేరళలో కోజికోడ్ జిల్లాలోని పశ్చిమ భాగంలోని థుశరగిరి జలపాతం చూడచక్కగా ఉంటుంది. మూడు జలపాతాలలోని ఒక్కసారిగా కిందుకు జారుతున్నట్లు కనిపించే సుందరమైన ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. చిన్ని గిరిజన గ్రామం సమీపంలో ఈ జలపాతం ఉంది. జలపాతం సమీపంలో కొందరు ట్రెక్కింగ్, రాక్ క్లైంబిగ్, అడవి జంతువులను వేటాడటం కోసం ఈ ప్రదేశానికి వస్తుంటారు. థుశలగిరి జలపాతం సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంది.

 బేఫ్టూర్ బీచ్:

బేఫ్టూర్ బీచ్:

PC: Pradeep717

క్యాలికట్ నడిభాగంలోని బేఫ్టూర్ బీచ్ కేరళలోనే చేపలు పట్టే వారి ప్రత్యేక సముద్రతీర ప్రాంతం. కాలికట్ లో ప్రసిద్ది చెందని పర్యాటక ప్రదేశాల్లో ఇది ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తింపుపొందింది. బేప్టూర్ బీచ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు.ఇక్కడ పడవ ప్రయాణంకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వెళ్లే పర్యాటకులు రెండు కిలోమీటర్లు ఉన్న పులిముడు (వంతెన) ఫ్లేఓవర్ మీద నడవడం మాత్రం మరిచిపోకూడదు.

కక్కాయం అనకట్ట:

కక్కాయం అనకట్ట:

PC:Vishak Pv

కక్కయం కాలికట్ నగరం నుండి 45 కిమీ దూరంలో ఉన్న ఒక సుందరమైన ఆనకట్ట. పర్యాటకులను మరియు ప్రయాణీకులను ఆకర్షిస్తుంది. రాక్ అధిరోహణ మరియు ట్రెక్కింగ్ వంటి సాహస కార్యక్రమాలు కక్కయం లో నిర్వహిస్తారు.పశ్చిమ కనుమలు వెంట ఈ ప్రదేశం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉంది.ఇక్కడ వృక్ష మరియు జంతు జాతులు చాల ఉన్నాయి.ఈ ప్రాంతంలో అద్భుతమైన ట్రెక్కింగ్ ట్రయల్స్ ఉన్నాయి, మరియు అటవీ పోలీసు యంత్రాంగం పరిధిలో ఉన్నాయి. కక్కయం రిజర్వాయర్ విహారయాత్రలు మరియు సాహస ఔత్సాహికులను ఆకర్షించే ప్రదేశం.పర్యాటకులకు సుందరమైన దృశ్యం, మరియు కుటుంబ ప్రయాణాలు, సాహస ప్రయాణాలు పిక్నిక్ లకు అనువైన స్థలం. మనసుకు ఆహ్లాదకరముగా ఉంటుంది.

కాలికట్ బీచ్:

కాలికట్ బీచ్:

PC:Sulyab Thottungal

పర్యాటకానికి ఎంతో ప్రసిద్ధి చెందిన కాలికట్ లో, అందమైన నీటి కయ్యలు (బ్యాక్ వాటర్స్) మరియు తాటి చెట్లు నడుమ సూర్యాస్తమయ సౌందర్యాన్ని ఖచ్చితంగా, మనస్ఫూర్తిగా ఆస్వాదించవచ్చు. భగవంతుడి స్వంతదేశంగా చెప్పుకునే కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఒకటైన కాలికట్ లో, సముద్ర కెరటాల హోరు నడుమ, నీటిపై ఊదా రంగు కాంతులు ప్రసరింపజేస్తూ, పొద్దుగూకే సూర్యుని అందాలను ఎంతసేపు గాంచినా తనివితీరదు. నీటి తరంగాల సవ్వడి మధ్య గూటి పడవలో (హౌస్ బోట్) ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, అద్భుత అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

కాలికట్ సరస్సు:

కాలికట్ సరస్సు:

PC:Lenish

వైథిలీ దగ్గరగా ఫుకేట్‌ సరస్సు, ఏడక్కల్‌ గుహలుంటాయి. అక్కడికి వెళ్లేదారిలో పొగ మంచు తెరలు ప్రకృతి అందాలను ఎలా దాచేయలని చాలా ప్రయత్నిస్తు న్నట్లు కనిపిస్తుంది ఆ దృశ్యం. ఇక్కడ ప్రయాణం మొత్తం చిరుజల్లుల మధ్య కొనసాగు తుంది. ఫుకేట్‌ లేక్‌ టూరిస్టు రిసార్ట్‌చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాల కాలుష్యాలకు దూరంగా, ముగ్ధమనోహరంగా ఉంటుంది. ఫుకేట్‌ సరస్సులో మరో ఆకర్షణ బోటింగ్‌. ఇక్కడ కాసేపు గడిపితే చాలు మానసిక ఒత్తిళ్లు, ఉద్వేగాలు అన్ని దూరమైపోయి ఏదో తెలియని ప్రశాంతంత ఆవరించి నట్లు అనిపిస్తుంది. పర్యాటకుల కోసం ఎప్పుడూ బోట్లు సిద్ధంగా ఉంటాయి.

ముచుండి పల్లి:

ముచుండి పల్లి:

PC:Nmkuttiady

13వ శతాబ్ధంలో ఈ మసీదును చాలా అందంగా నిర్మించారు. ఈ మసీదు కట్టడంలో పై కప్పులు మరియు డబుల్ ఇటుకలతో కట్టిన ఇటుకల కప్పుల నిర్మాణ శైలిని అత్యంత ఆకర్షనీయంగా ఉంది. ఈ మసీదు షేక్ జైనుద్దీన్ మకడమ్ II ల కాలంలో బాగా ప్రసిద్ది చెందినది అతను ప్రసిద్ది పుస్తక రచయిత, టుహాట్ ఉల్ ముజాహిదీన్ అనే పుస్తకాన్నిరచించాడు. ఈ మసీదుపై అరబిక్ మరియు మళయాల భాషల్లో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఇది ఈ ప్రాంతంను పరిపాలించన జమోరిన్ రాజు కథను వర్ణిస్తుంది.

కాలికట్ ఎలా చేరుకోవాలి ?

కాలికట్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

పాలక్కాడ్, త్రిస్సూర్, కన్నూర్, కాసర్గోడ్, ఎర్నాకుళం, సుల్తాన్ బతేరి, మలప్పురం, బెంగుళూరు, ఊటీ, మధురై, ఎర్నాకుళం, కొట్టయం, పతనంతిట్ట, తిరువనంతపురం, కోయంబతూర్ వంటి నగరాల నుండి బస్సులు కలవు.

రైలు మార్గం

కాలికట్ లో రైల్వే స్టేషన్ ఉంది. అటు చెన్నై, కోయంబత్తూర్, బెంగుళూర్, ఢిల్లీ, హైదరాబాద్, తిరువంతపురం, కొచీ, పాలక్కాడ్ మరియు కన్నూర్ వంటి నగరాలకు తరచుగా రైళ్లు ఉన్నాయి. ఆటో రిక్షాలు టాక్సీలు మరియు బస్సులు రైల్వే స్టేషన్ నుండి అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నగరము నుండి 25 కిమీ దూరములో, కొందోట్టి(మాలపురం జిల్లా) లో కరిపూర్ లో ఉంది. పర్యాటకులు కాలికట్ నగరం చేరటానికి విమానాశ్రయం నుండి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more