Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు చుట్టు పక్కల ఒక రోజులో ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలు ఇవే

బెంగళూరు చుట్టు పక్కల ఒక రోజులో ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలు ఇవే

బెంగళూరుకు దగ్గర్లో ఒక రోజులో ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు

వీకెండ్ వచ్చిందంటే చాలా యువత ఎక్కడికి వెలుదామా అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతి వీకెండ్ పబ్ లు, బార్లు అంటు తెగ తిరిగిన వారు కొంత మార్పు కోసం ఈ కాంక్రీట్ జంగిల్ వంటి బెంగళూరు నగరం నుంచి దూరంగా వెళ్లలని భావిస్తుంటారు. అటువంటి వారి కోసమే ఈ కథనం. ఇందులో బెంగళూరుకు దగ్గర్లో ఒక రోజులో ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు క్లుప్తంగా ఇచ్చాం. అంతేకాకుండా శ్రావణ మాసం సందర్భంగా ప్రాచూర్యం చెందిన లక్ష్మీ దేవి దేవాలయ సమచారం మీ కోసం...

సిద్ధరబెట్ట

సిద్ధరబెట్ట

P.C: You Tube

తుమకూరులో చూడదగిన పర్యాటక కేంద్రం సిద్ధరబెట్ట. తుమకూరుకు ఇది 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అడ్వెంచర్ టూరిజం అంటే ఇష్టమున్న వారికి ఈ సిద్ధరబెట్ట ఖచ్చితంగా నచ్చుతుంది. అసియాలోనే రెండో అతి పెద్ద ఏక శిలనే సిద్ధరబెట్ట అని అంటారు.

తొమ్మిది వేల మంది

తొమ్మిది వేల మంది

P.C: You Tube

ఈ సిద్ధర బెట్ట పై పూర్వం తొమ్మిదివేల మంది సాధువులు తపస్సు చేసేవారు అందువల్లే దీనికి సిద్ధర బెట్ట అని పేరు వచ్చింది. సిద్ధలు అంటే సాధువులు, బెట్ట అనే కొండ అని అర్థం. వారాంతాల్లో ఇక్కడకు యువత ఎక్కువగా వస్తుంటారు.

పావగడ

పావగడ

P.C: You Tube

తుమకూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణం పావగడ. ఇక్కడ ఉన్న కోటను విజయనగర రాజుల కాలంలో నిర్మించారని ప్రతీతి. ఇక్కడే టిప్పు సుల్తాన్ కు, బ్రిటీష్ సైనికులకు మధ్య యుద్ధం కూడా జరిగింది.

రాక్ క్లైంబింగ్

రాక్ క్లైంబింగ్

P.C: You Tube

ఈ పావగడ కొండ ట్రెక్కింగ్ కు ఇప్పుడిప్పుడే ప్రాచూర్యం చెందుతూ ఉంది. అదే విధంగా రాక్ క్లైంబింగ్ కోసం కూడా ఇక్కడకు యువత ఎక్కువగా వస్తూ ఉంటారు. పావగడలో అతి ప్రాచీన, ప్రాచూర్యం చెందిన శనీశ్వర దేవాలయం ఉంది.

దేవరాయన దుర్గా అటవీ ప్రాంతం

దేవరాయన దుర్గా అటవీ ప్రాంతం

P.C: You Tube

దేవరాయన దుర్గా సతిత హరితారణ్యం. ఎల్లప్పుడూ ఇక్కడ పచ్చగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటూ పర్యవరణ ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది చిన్నపాటి ట్రెక్. ఇప్పుడిప్పుడే ప్రాచూర్యంలోకి వస్తోంది.

వారాంతాల్లో

వారాంతాల్లో

P.C: You Tube

వారాంతాల్లో ఎక్కువ మంది యువత ట్రెక్కింగ్ కోసం దేవరాయన దుర్గాకు వస్తుంటారు. తుమకూరు నుంచి దేవరాయన దుర్గా కు 11 కిలోమీటర్ల దూరం కాగా, బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

దేవరాయన దుర్గా కోట

దేవరాయన దుర్గా కోట

P.C: You Tube

సముద్ర మట్టానికి దాదాపు 3940 అడుగుల ఎత్తులో ఈ దేవరాయన దుర్గ కోట ఉంటుంది. ఇది తుమకూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోకు చేరుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి.

రెండు జలపాతాలు

రెండు జలపాతాలు

P.C: You Tube

ఈ కోటకు దగ్గర్లో రెండు జలపాతాలు నయన మనోహరంగా కనిపిస్తాయి. అవి ఆనే దొనే, జయ తీర్థం. ఇక ఈ దేవరాయన దుర్గా కోటలో రామ, సితా, లక్ష్మణ విగ్రహాలతో కూడిన చిన్న దేవాలయంతో పాటు యోగ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది.

గొరవన హళ్లి లక్ష్మీ దేవి దేవలయం

గొరవన హళ్లి లక్ష్మీ దేవి దేవలయం

P.C: You Tube

తుమకూరు నుంచి గొరవన హళ్లి లక్ష్మీ దేవి దేవాలయానికి 35 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్నటు వంటి లక్ష్మీ దేవి చాలా శక్తివంతురాలని భక్తుల విశ్వాసం. పెళ్లికాని వారు ఈమెను సేవిస్తే త్వరగా ఫలితం ఉంటుందని నమ్ముతారు.

మంగళ శుక్రవారాల్లో

మంగళ శుక్రవారాల్లో

P.C: You Tube

ముఖ్యంగా ఈ దేవిని సేవించడం వల్ల ఐశ్వర్య వ`ద్ధి కలుగుతుందని భక్తులు చాలా కాలంగా నమ్ముతున్నారు. బెంగళూరు నుంచి 82 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దేవాలయానికి మంగళ, శుక్రవారాల్లో ఎక్కువ మంది వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X